రాజకీయాలు

Tea Diplomacy: సస్పెండ్ ఎంపీలకు టీ ఇచ్చిన డిప్యూటీ చైర్మన్, మా పోరాటం టీ కోసం కాదు..రైతుల కోసమన్న విపక్షాలు, రాత్రంతా మహాత్మాగాంధీ విగ్రహం సమీపంలో సస్పెన్షన్‌ ఎంపీలు

Hazarath Reddy

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ తమకు టీ, స్నాక్స్ (Tea Diplomacy) తీసుకుని వచ్చారనీ.. అయితే వాటిని తాము తిరస్కరించామని ఆయన వెల్లడించారు. ఇవాళ ఉదయం డిప్యూటీ చైర్మన్ మమ్మల్ని కలుసేందుకు ధర్నా స్థలి వద్దకు వచ్చారు. అయితే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు చట్టాన్ని ఆమోదించారనీ... బీజేపీ మైనారిటీలో ఉండగా ఎలాంటి ఓటింగ్ లేకుండా రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించారని మేము చెప్పాం. అలా ఎలా ఆమోదిస్తారని.. అందుకు మీరే కారణమని కూడా ఆయనకు స్పష్టం చేశాం..’’ అని సంజయ్ వెల్లడించారు.

Rajya Sabha Ruckus Over Farm Bills: రాజ్యసభలో దుమారం, 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు, డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌పై విపక్షాల అవిశ్మాస తీర్మానంను తిరస్కరించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు

Hazarath Reddy

వ్యవసాయ బిల్లులపై ఓటింగ్‌ సందర్భంగా పార్లమెంట్‌లో ఆదివారం చోటుచేసుకున్న గందోరగోళంపై (Rajya Sabha Ruckus Over Farm Bills) రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ హక్కుల మర్యాదలకు భంగం కలిగించే విధంగా విపక్ష సభ్యులు వ్యవహరించారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో రభస సృష్టించిన కొందరు ప్రతిపక్ష సభ్యులపై చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు (M. Venkaiah Naidu) సస్పెన్షన్ వేటు వేశారు.

Agricultural Reform Bills: రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల దుమారం, అడ్డుకున్న విపక్షాలు, రైతులను కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మారుస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శలు

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణ బిల్లు (Bills Moved To Rajya Sabha Amid Protests) తీవ్ర దుమారానికి దారితీస్తోంది. బిల్లులపై ఓటింగ్‌ సందర్భంగా రాజ్యసభలో గందరగోళం నెలకొంది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. రైతు వ్యతిరేక విధానాలు ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నాయి.

MI vs CSK Highlights: పాత కథే నడిచింది, ఓటమితో ఐపీఎల్ 20ని ప్రారంభించిన ముంబై, తొలి విక్టరీ నమోదు చేసిన ధోనీ సేన, సూపర్ ఇన్నింగ్స్ ఆడిన రాయుడు

Hazarath Reddy

ఐపీఎల్‌-13 వ సీజన్‌ ఆరంభపు మ్యాచ్‌లో ముంబై పాత కథనే కొనసాగించింది. విక్టరీ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొలి మ్యాచ్ లోనే దుమ్ములేపింది. అటు బౌలింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో సూపర్‌ విక్టరీ (Chennai Super Kings Beat Mumbai) సాధించింది. అంబటి రాయుడు (Ambati Rayudu)(71; 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) బ్యాటింగ్‌ పవర్‌ చూపించగా, డుప్లెసిస్ (Faf du Plessis) (58 నాటౌట్‌; 44 బంతుల్లో 6 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి విజయంలో సహకరించాడు.

Advertisement

TDP MLA Vasupalli Ganesh: విశాఖలో టీడీపీ షాక్, వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, విశాఖను ఆర్థిక రాజధానిగా స్వాగతిస్తున్నామని తెలిపిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే

Hazarath Reddy

విశాఖలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే టీడీపీ నేత వాసుపల్లి గణేష్‌ (TDP MLA Vasupalli Ganesh) వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు ఏపీ ముఖ్యమత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, టీడీపీ నేత వాసుపల్లి గణేష్‌ కలిశారు. శనివారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో తన కుమారులతో కలిసి ఆయన ...ముఖ్యమంత్రితో భేటీ (MLA Vasupalli Ganesh Meets CM YS Jagan Mohan Reddy) అయ్యారు. ఎమ్మెల్యే కుటుంబంతో పాటు వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా సీఎంను కలిసినవారిలో ఉన్నారు.

Harsimrat Kaur's Resignation: వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కేంద్రమంత్రి పదవికి హర్‌సిమ్రత్‌ కౌర్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మరో మంత్రికి బాధ్యతల అప్పగింత

Team Latestly

అకాలీదళ్‌ పార్టీ సుదీర్ఘకాలం నుంచి బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నది. ఈ పార్టీ నుంచి హర్‌సిమ్రత్‌ ఒక్కరే ఇంతకాలం కేంద్ర మంత్రివర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రిగా వ్య్వహరించారు. ఇప్పుడు ఆమె తన పదవి నుంచి వైదొలగడంతో ఇకపై ఎన్డీఏలో కొససాగడంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని....

Telangana Liberation Day 2020: విలీనమా.. విమోచనమా? తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన కేటీఆర్, తెలంగాణ ప్రాంతంలో ఈరోజుకున్న విశిష్టత తెలుసుకోండి

Team Latestly

సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రాంతానికి నిజమైన స్వాతంత్య్ర దినోత్సవంగా, నిజాం పాలను అంతమొందిన సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా చెప్తారు. అయితే అది విమోచనం కాదు, భారతదేశంలో విలీనమైన రోజు మాత్రమే అని మరొక 'రాజకీయ' వాదన....

#HappyBirthdayPMModi: నరేంద్రమోదీ..భారత రాజకీయాల్లో ఓ చెరగని సంతకం, భారత ప్రధాని నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాలపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అలియాస్ నరేంద్ర మోదీ.. ఈ పేరు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఓ సంచలనం. ఈ సంచలనం వెనుక ఎన్నో గాయాలు, మరెన్నో మరకలు, అయినా వాటికి అదరలేదు, బెదరలేదు, అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. దేశ రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసుకున్నాడు. రెండో సారి దేశ ప్రధానిగా ఎన్నికై సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నాడు. నేడు 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ప్రస్థానం నిజంగా పడి లేచిన కెరటమే..

Advertisement

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సోకిన కరోనావైరస్, స్వీయ నిర్భంధంలోకి వెళ్లినట్లు ప్రకటన, ఇప్పటికే పదుల సంఖ్యలో పార్లమెంట్ సభ్యులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ

Team Latestly

పార్లమెంటు సభ్యులందరికీ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో 17 మంది లోకసభ సభ్యులు సహా, 8 మంది రాజ్యసభ సభ్యులకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే గడ్కరీకి అప్పుడు నెగెటివ్ అని తేలడంతో ఆయన సోమవారం సమావేశాలకు హాజరయ్యారు...

CM YS Jagan VC with MPs: ప్రత్యేక హోదానే ఎజెండా కావాలి, పెండింగ్ నిధులు ఇవ్వాలని నిలదీయండి, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలకు ఏపీ సీఎం వైయస్ జగన్ దిశా నిర్దేశం

Hazarath Reddy

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న వైయస్సార్సీపీ ఎంపీలతో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ (CM YS Jagan VC with MPs) నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీలకు (YSRCP MPs) రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన వాటి గురించి చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో పార్టీ ఎంపీలు కృషి చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం నిరంతరం ప్రయత్నించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.

Parliament Monsoon Session: ఎంపీలకు కరోనా, పార్లమెంట్ సమావేశాలకు ముందే కోవిడ్ కలకలం, సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 1 వరకు కొనసాగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Hazarath Reddy

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు (Parliament Monsoon Session) ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్ సభ, రాజ్యసభ ఎంపీలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో కొంతమంది ఎంపీలకు కరోనా పాజిటివ్ అని తేలినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు పలువురు ఎంపీలకు, కేంద్రమంత్రులకు కరోనా పాజిటివ్‌గా (COVID-19 Positive) తేలినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సమావేశాల మధ్యలో ఎవరికైనా వైరస్‌ (COVID) సోకితే మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

'My Silence Isn't Weakness': మహారాష్ట్రకు చెడ్డ పేరు తీసుకువచ్చే కుట్ర, మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దు, అన్నింటికీ సరైన సమయంలో స్పందిస్తానని తెలిపిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే

Hazarath Reddy

దాదాపు మూడు నెలల తర్వాత రాష్ట్రాన్ని ఉద్దేశించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే (CM Uddhav Thackeray) ప్రసంగించారు. కోవిడ్ -19 మార్గదర్శకాలను పాటించడం యొక్క ప్రాముఖ్యత, అన్‌లాక్ పరిస్థితులు, మరాఠా రిజర్వేషన్ కోసం ఆయన చేసిన పోరాటం మరియు పోరాడటానికి వ్యూహం వంటి అనేక విషయాల గురించి దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడారు. మాజీ నేవీ అనుభవజ్ఞుడు మదన్ శర్మపై దాడి, శివసేన వర్సెస్ కంగనా రనౌత్ (Kangana Ranaut vs Shiv Sena) గొడవ వంటి విషయాలపై మహా సీఎం స్పందించారు.

Advertisement

Parliament Monsoon Session: ఈ సారి మెరుపులు ఉంటాయా ? రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం, అధికార పక్షాన్ని పలు అంశాలపై నిలదీసేందుకు విపక్షాలు రెడీ

Hazarath Reddy

రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం (Parliament Monsoon Session Begins Tomorrow) కానున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా ప్రత్యేక ఏర్పాట్లు, జాగ్రత్తల నడుమ..ఎన్నడూ చోటు చేసుకోని విధంగా అనేక ప్రత్యేకతల మధ్య ఈ సమావేశాలు (Parliament Monsoon Session) జరగనున్నాయి. ఈ సమావేశాలకు ముందు పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించట్లేదు. మొట్టమొదటి సారి భారత్‌లో రియల్‌ టైమ్‌లో ఉభయసభలు సమావేశం కానున్నాయి.

CBI to Probe Antarvedi Incident: అంతర్వేది రథం దగ్ధం ఘటన సిబిఐకి అప్పగింత, జీవో విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ ఘటనను సీఎం జగన్ తీవ్రంగా పరిగణించారని సీఎంఓ ప్రకటన

Team Latestly

ఏపీ ప్రభుత్వం ఘటన దర్యాప్తును సిబిఐకి అప్పజెప్తున్నట్లు శుక్రవారం జీవో విడుదల చేసింది. సెక్షన్‌ 6, ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1946 ప్రకారం సీబీఐ ఈ కేసును విచారించాలని కోరింది...

Rafale Induction: భారత వాయుసేనలో చేరిన రాఫెల్ యుద్ధ విమానాలు, రెండు వైపులా నీటి ధారలతో అపూర్వ స్వాగతం, ప్రారంభోత్సవంలో ఆకట్టుకున్న గగనతల విన్యాసాలు, అద్భుతమనిపించే ఆ దృశ్యాలు మీకోసం

Team Latestly

ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా సర్వమత ప్రార్థనలు (Sarva Dharma Puja) నిర్వహించారు. అనంతరం రాఫెల్, సు -30 మరియు జాగ్వార్లచే నిర్వహించిన అద్భుతమైన గగనతల విన్యాసాలు చూపరులను రోమాలు నిక్కబొడిచేలా చేశాయి......

TS Cabinet Meet Highlights: నూతన రెవెన్యూ బిల్లు, వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లుకు తెలంగాణ కేబినేట్ ఆమోదం, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే

Team Latestly

పాత సెక్రెటేరియట్ భవనం కూల్చివేతతో పాటు కొత్త సచివాలయ నిర్మాణాలకు అయ్యే ఖర్చులు, జిల్లా ఆఫీసులకు నిధుల కేటాయింపు, ఆయుష్ వైద్య కళాశాలల్లో అధ్యాపకుల వయో పరిమితి పెంపు మరియు బిసి కమీషన్ చేసిన సిఫారసులు, ఇతర ఆర్డినెన్సులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది....

Advertisement

Vallabhaneni Vamsi Press Meet: ఉచిత విద్యుత్ పేటెంట్ వైఎస్సార్‌దే, ఏపీ సీఎం జగన్ పాలనపై ప్రశంసలు కురిపించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చంద్రబాబు, లోకేష్‌పై విమర్శలు

Hazarath Reddy

AP Covid Update: కొత్తగా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా, ఏపీలో 24 గంటల్లో 10,794 మందికి కోవిడ్-19, 4,98,125కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, 4417 కు చేరిన మృతుల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల్లో 72,573 నమూనాలు పరీక్షించగా 10,794 పాజిటివ్‌ కేసులు (Andhra Pradesh COVID-19 cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల 4,98,125 కు సంఖ్య చేరింది. తాజా పరీక్షల్లో 35,358 ట్రూనాట్‌ పద్ధతిలో, 37,215 ర్యాపింగ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 70 మంది మృతి చెందడంతో ఆ సంఖ్య 4417 కు చేరింది. చిత్తూరు 9, అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం 2, విజయనగరం జిల్లాలో కరోనాతో ఒకరు మృతి చెందారు.

Sanjay Raut on Kangan Comments: ముంబై ఓ మినీ పాకిస్తాన్, కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు, ఆమె ఓ మెంటల్ కేసు అంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కౌంటర్, ముదురుతున్న వివాదం

Hazarath Reddy

బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్‌ తీసుకుంటారని సంచలన వ్యాఖ్యలు (Kangan Comments) చేసిన కంగనా రనౌత్‌ ముంబై నగరం మరో పాకిస్తాన్ (Mini Pakistan) అంటూ వివాదాస్పవ వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. కాగా ఆమె సుశాంత్ డెత్ కేసులో ముంబై పోలీసులపై నమ్మకం లేదంటూ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో వేడిని రాజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ముంబై పోలీసులను అవమానించడమేనని, దయచేసి ఆమెను ముంబై రావద్దని కోరుతున్నామని సామ్నాలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) రాసుకొచ్చారు.

CM KCR on Assembly Session: 'అసెంబ్లీ దూషణల పర్వానికి వేదిక కారాదు, స్పూర్థివంతమైన చర్చలు జరగాలి'! సమావేశాల నిర్వహణపై సీఎం కేసీఆర్ రివ్యూ, మంత్రులు సిద్ధంగా ఉండాలని సూచన

Team Latestly

ప్రజాస్వామ్య విలువలు పరిఢవిల్లేలా అసెంబ్లీ సమావేశాలు జరగాలి. అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు, గందరగోళం, తిట్లు, శాపనార్థాలు కాదు. పనికి మాలిన నిందలు వేసుకోవడానికి, అసహనం ప్రదర్శించడానికి అసెంబ్లీ వేదిక కారాదు. ఇలాంటి ధోరణిలో మార్పు రావాలి......

Advertisement
Advertisement