రాజకీయాలు

Water War: నీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ వాదనలో అర్థం లేదు, కౌన్సిల్ సమావేశంలో పూర్తి ఆధారాలతో నిలదీయాలని అధికారులకు తెలంగాణ సీఎం కేసీఆర్ సూచన

Team Latestly

పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంపుతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గట్టిగా అభ్యంతరం చెప్పాలని నిర్ణయించారు. నీటి కేటాయింపులు లేకున్నా, అనుమతులు లేకున్నా, ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా గోదావరి, కృష్ణా నదుల్లో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా....

Three Capital Row: రాజధాని అంశం అసలు మా పరిధిలో లేనే లేదు, హైకోర్టు నోటీసులపై మరోసారి స్పందించిన కేంద్రం, మూడు రాజధానుల అంశం మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

రాజధాని విషయంలో హైకోర్టు (AP High Court) ఇచ్చిన నోటీసులపై మరోసారి కేంద్రం స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని 3 రాజధానులపై కేంద్ర ప్రభుత్వం (Central Govt) తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేసింది. రాజధాని అంశం (Three Capital Row) మా పరిధిలో లేదంటూ తేల్చేసింది. రాజధానుల్ని నిర్ణయించుకునే హక్కు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశం అంటూ పేర్కొంది. ఇదే విషయాన్ని గతంలోనే ఏపీ హైకోర్టుకు తెలియజేసింది. సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై ఏపీ హైకోర్టులో కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు రాజధాని అంశం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.

US Presidential Elections 2020: అమెరికాను ఈ సారి నడిపించేదెవరు? జో బిడెన్‌ను తమ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేసిన డెమోక్రటిక్‌ పార్టీ, నవంబర్‌ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు

Hazarath Reddy

నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటిక్‌ పార్టీ జో బిడెన్‌ను (Democrat Joe Biden) తమ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్‌ చేసింది. ఇది జో బిడెన్‌ (Joseph Biden) రాజకీయ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు. బిడెన్‌ గతంలో రెండు సార్లు అధ్యక్ష పదవికి తలపడ్డారు. డెమోక్రటిక్‌ తరఫున తనను అధ్యక్ష పదివికి నామినేట్‌ చేసినందుకు బిడెన్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఏడాది న‌వంబ‌ర్ 3వ తేదీన అధ్య‌క్ష ఎన్నిక‌లు (US Presidential Elections 2020) జ‌ర‌గ‌నున్నాయి.

AP Cabinet Meeting: ప్రారంభమైన ఏపీ క్యాబినెట్ మీటింగ్, పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న ఏపీ సీఎం జగన్, సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఏపీలో పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) ప్రారంభమైంది. ఈ కేబినెట్‌ బేటీలో సీఎం జగన్‌ (Chief Minister YS Jagan Mohan Reddy) పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నూతన పారిశ్రామిక విధానానికి ఈ కేబినెట్‌ బేటీలో (Andhra Pradesh Cabinet) ఆమోదం తెలపనున్నారు. వైఎస్‌ఆర్‌ ఆసరా పథకంపై చర్చించడంతో పాటు .. నవరత్నాల్లో మరో హామీ అమలు దిశగా నిర్ణయం తీసుకోనున్నారు. నాలుగేళ్లలో 27వేల కోట్లకుపైగా ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుంది.

Advertisement

Chandrababu Letter Row: ఫోన్ ట్యాపింగ్ అంతా డ్రామా, చంద్రబాబుపై మండిపడిన ఏపీ హోంమంత్రి సుచరిత, ఆధారాలతో డీజీపీకి ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన హోం మంత్రి

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో ఫోన్ ట్యాపింగ్ (phone tapping) జరుగుతోందని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానికి లేఖ రాసిన సంగతి విదితమే. ఈ లేఖపై ఏపీ హోం మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలతో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని (Chandrababu Naidu trying to create unrest in AP) రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో (DGP Gautam Sawang) కలసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా సుచరిత (AP Home minister Mekathoti Sucharitha) మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫోన్‌లు ట్యాప్‌ చేస్తోందని చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని, ఫోన్‌లు ట్యాప్‌ అవుతున్నాయనడానికి ఏం ఆధారాలున్నాయని ప్రశ్నించారు.

BJP MLA Mahesh Singh Negi: ఆ బీజేపీ ఎమ్మెల్యే నా బిడ్డకు తండ్రి, కావాలంటే డీఎన్‌ఏ టెస్ట్ చేయించండి, మహిళతో పాటు కాంగ్రెస్ పార్టీ డిమాండ్, చిక్కుల్లో ఉత్తరాఖండ్ ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగి

Hazarath Reddy

ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగిపై (BJP MLA Mahesh Singh Negi) వచ్చిన సంచలన ఆరోపణలు ఇప్పుడు ఉత్తరాఖండ్‌ రాజకీయాల్లో (Uttarakhand Politics) ప్రకంపనలు రేపుతున్నాయి. తనను లైంగికంగా లొంగదీసుకొన్నాడంటూ ద్వారహత్ బీజేపీ ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగిపై ఓ వివాహిత మహిళ పోలీసులను (Dehradun’s Nehru Colony police station) ఆశ్రయించడం కలకలం రేపుతోంది. పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు.

Assembly 'COVID' Session: సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడి, సభ్యులు హాజరయ్యేనా?

Team Latestly

కరోనావైరస్ లాక్డౌన్ నేపథ్యంలో అన్ని సామూహిక కార్యక్రమాలు వాయిదా పడిన వేళ, తెలంగాణ అసెంబ్లీ సమావేశం అయ్యేందుకు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు...

Chandrababu Letter to PM Modi: వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోంది, ప్రధాని మోదీకి లేఖ రాసిన ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు

Hazarath Reddy

రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ (Chandrababu Letter to PM Modi) రాశారు. ఏపీలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగంలో ఆర్టికల్స్ 19, 21 ఉల్లంఘనలు జరుగుతున్నాయని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడుతోందని. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని (YSRCP Govt Tapping Phones of Opposition Parties) లేఖలో ఆరోపించారు.

Advertisement

PM Modi Independence Day Speech: ఎర్రకోటపై ఎగిరిన మువ్వన్నెల జెండా, జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, నియంత్రణ రేఖ నుంచి వాస్తవాధీన రేఖ వరకు భారత సార్వభౌమత్వాన్ని ఎవరూ సవాలు చేయలేరని వ్యాఖ్య

Team Latestly

దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని దేశభద్రత కోసం కరోనా మహమ్మారిపై డాక్టర్లు, పోలీసులు ఇతర ఫ్రంట్ లైన్ వారియర్లు చేస్తున్న పోరాటం, దేశ సరిహద్దు వద్ద సైనికులు చూపిస్తున్న పోరాట పటిమ...

Ashok Gehlot Wins Floor Test: విశ్వాస పరీక్షలో గెహ్లాట్ విజయకేతనం, మూజువాణి ఓటుతో విజయం సాధించిన రాజస్థాన్ సీఎం, అసెంబ్లీ ఈ నెల 21కి వాయిదా

Hazarath Reddy

అనుకోని పరిణామాలు..భారీ ట్విస్టుల మధ్య సాగిన రాజస్థాన్ పొలిటికల్ ఎపిసోడ్ కు (Rajasthan Political Crisis) శుభం కార్డు పడింది. రాజస్తాన్‌ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో (confidence motion) విజయం సాధించింది. బీజేపీ పెట్టాలనుకున్న అవిశ్వాస తీర్మానాన్ని పాలక కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో మూజువాణి ఓటుతో గెహ్లాట్ సర్కార్‌ (Ashok Gehlot Govt) నెగ్గింది. విశ్వాస పరీక్షపై ఓటింగ్‌ అనంతరం సభను ఈనెల 21 వరకూ వాయిదా వేస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషీ ప్రకటించారు.

Rajasthan Assembly Session 2020: బలపరీక్షకు సిద్ధమైన రాజస్థాన్ సీఎం, అశోక్ గెహ్లాట్‌కు షాకిచ్చిన బీఎస్‌పీ, సీఎం గెహ్లాట్‌తో భేటీ అయిన సచిన్‌ పైలట్‌, నేటి నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు

Hazarath Reddy

రాజస్థాన్ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు (Rajasthan Assembly Session 2020) ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై (CM Ashok Gehlot Govt) అవిశ్వాసం పెట్టాలని బీజేపీ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. అయితే, ఇందుకు ప్రతిగా తామే విశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ట్విస్ట్ ఇచ్చింది. అశోక్ గెహ్లాట్ నాయకత్వం మీద తిరుగుబాటు చేసిన సచిన్ పైలెట్ వర్గం (19 మంది ఎమ్మెల్యేలు) మళ్లీ కాంగ్రెస్ (Congress) గూటికి చేరింది. దీంతో కథ సుఖాంతమైందని అంతా భావించారు. అనూహ్యంగా అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మీద అవిశ్వాసం అంటూ బీజేపీ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ కూడా దానికి కౌంటర్‌గా విశ్వాస తీర్మానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.

Penmatsa Suresh Babu: ఎన్నికవడం లాంఛనమే, వైసీపీ తరపున ఎమ్మెల్సీ స్థానానికి పెన్మత్స సురేష్‌ బాబు నామినేషన్, ఈ నెల 24న ఎమ్మెల్సీ ఎన్నిక, పెనుమత్స సాంబశివరాజు తనయుడే ఈ సురేష్ బాబు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేష్‌ బాబు (Penmatsa Suresh Babu) గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana), ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

YSR Cheyutha Scheme 2020: వైఎస్సార్‌ చేయూత నేడే లాంచ్, పథకం ద్వారా నాలుగేళ్లకు రూ. 75 వేలు మహిళల అకౌంట్లోకి, నేడు తొలి ధపా మొత్తం రూ.18,750 విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

పరిపాలనలో ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా దూసుకుపోతున్న ఏపీ సీఎం (Chief Minister Y.S. Jagan Mohan Reddy) సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పటికే పలు పథకాల ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొన్న ఏపీ సీఎం తాజాగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉద్ధేశించిన వైఎస్సార్‌ చేయూత పథకాన్ని(YSR Cheyutha Scheme 2020) నేడు ప్రారంభించనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో( CM Camp Office) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఈ పథకాన్ని(YSR Cheyutha) ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్ల కాలంలో రూ. 75,000 లను మహిళలకు ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. దాదాపు 25 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.

Ram Madhav: ఏపీలో ప్రతిపక్షం సీటు ఖాళీయే, బీజేపీనే భర్తీ చేయాలన్న రాం మాధవ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు స్వీకరణ, రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని వెల్లడి

Hazarath Reddy

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు మంగళవారం బాధ్యతలు (Somu Veerraju sworn-in as AP BJP President) స్వీకరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, బీజేపీ రాష్ట్ర సహాయ ఇంచార్జ్ సునీల్ డియోదర్, మధుకర్ జీ, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు, స్వర్ణపాలెస్ ప్రమాద మృతులకు బీజేపీ నేతలు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.

Rajasthan Political Drama: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పదవి సేఫ్, వెనక్కి తగ్గిన సచిన్ పైలట్, సీఎం‌పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ, సొంతగూటికి కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు

Hazarath Reddy

గత కొంతకాలంగా రాజస్తాన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి (Rajasthan Political Crisis) తెరపడింది. సీఎం అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) మీద తిరుగుబాటు జెండా ఎగరవేసిన సచిన్‌ పైలట్ వర్గం (Sachin Pilot Team) చివరకు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో (Congress Party) చర్చల అనంతరం సచిన్‌ పైలట్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలను గుర్తించడంతోపాటు పరిష్కారానికి కృషి చేసిన సోనియా, రాహుల్‌, ప్రియాంకతోపాటు పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశాడు.

JP Nadda Slams KCR Govt: కేసీఆర్ మొద్దు నిద్ర వల్లే ఈ పరిస్థితి, కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించిన జేపీ నడ్డా, కాళేశ్వరం అంతా అవినీతిమయమని మండిపాటు

Hazarath Reddy

తెలంగాణ జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలకు సోమవారం భూమి పూజా కార్యక్రమం (Bhoomi Pooja) సంధర్భంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ప్రభుత్వంపై (JP Nadda Slams Telangana Govt) విరుచుకుపడ్డారు. వర్చువల్‌ వేదికగా ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన (BJP president JP Nadda) తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో (corruption) కూరుకుపోయిందని విమర్శలు గుప్పించారు. 45వేల కోట్ల రూపాయలకు పూర్తికావాల్సిన కాళేశ్వరం ప్రాజక్టును ( Kaleshwaram project) దోచుకోవటం కోసమే 85వేల కోట్లకు పెంచారని ఆరోపించారు.

Advertisement

Rajasthan Political Crisis: రాజస్థాన్ రాజకీయాల్లో కీలక మలుపు, సొంత గూటికి తిరిగిరానున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఆగస్టు 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు

Hazarath Reddy

ఆగస్టు 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడ రాజకీయ సమీకరణాలు (Rajasthan Political Crisis) కీలక మలుపులు తిరుగతున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్ మీద తిరుగుబావుటా ఎగరవేసిన సచిన్ పైలట్ (Sachin Pilot) ఎట్టకేలకు మళ్లీ సొంత గూటికి చేరే అవకాశం ఉన్నట్లు పరిస్థితులు తెలియజేస్తున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్ నాయకులకు చిక్కకుండా ఉన్న సచిన్ పైలట్.. సోమవారం రాహుల్, ప్రియాంక వాద్రలతో గంటన్నర పాటు సమావేశమైనట్లు అక్కడి రాజకీయవర్గాలు చెప్తున్నాయి. పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు.

CM YS Jagan Temple: ఏపీ సీఎం జగన్‌కు గుడి, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, గోపాలపురం మండంలం రాజుపాలెం వైసీపీ నేతల అత్యుత్సాహం

Hazarath Reddy

సాధారణంగా దేవుళ్లకు, సినీ తారలకూ కొన్నిచోట్ల ఆలయాలు నిర్మిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఏపీ సీఎం వైయస్ జగన్ కు కూడా గుడి (CM YS Jagan Temple) కడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండంలం రాజుపాలెంలో వైసీపీ నేతలు సీఎం జగన్ కు ఆలయం (CM YS Jagan Mohan Reddy Temple) నిర్మిస్తున్నారు. ఈ గుడిలో సీఎం జగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ ఆలయానికి గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు (MLA Venkatarao Talari) శంకుస్థాపన చేశారు. భూమి పూజ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ సీఎం జగన్ ను ఆకాశానికెత్తేశారు.

Sri Lanka General Elections Results 2020: శ్రీలంకలో మళ్లీ రాజపక్స, ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎస్‌ఎల్‌పీపీ, ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

Hazarath Reddy

శ్రీలంకలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాజపక్స (Mahinda Rajapaksa) కుటుంబ ఆధ్వర్యంలో నడిచే శ్రీలంక పీపుల్స్‌ పార్టీ (ఎస్‌ఎల్‌పీపీ) బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఎస్ఎల్పీపీ మూడింట రెండొంతుల మెజార్టీని సొంతం చేసుకుంది. దీంతో శ్రీలంక ప్రధానిగా మహీంద్ రాజపక్సే కొనసాగనున్నారు. గత నవంబరు నుంచి రాజపక్సే ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లోనూ (Sri Lanka General Elections Results 2020) రాజపక్సే పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన సోదరుడు గోటాబయ రాజపక్సే అధ్యక్షుడిగా ఉన్నారు.

AP Three Capitals Row: రాజధానితో మాకు సంబంధం లేదని తెలిపిన కేంద్రం, రిట్‌ పిటిషన్‌ 20622/2018కు ప్రతిగా ఏపీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ

Hazarath Reddy

ఏపీ రాజధాని అంశంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజధాని అంశంపై (AP Three Capitals Row) ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ (Home Ministry) గురువారం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోకే వస్తుందని కేంద్ర హోంశాఖ హైకోర్టులో (AP High Court) దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. రాజధాని (AP Capital) నిర్ణయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తెలిపింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ.. కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది.రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనువైన ప్రాంతంలో గానీ, అభివృద్ది చేయాలని భావించిన ప్రాంతం నుంచి గానీ పరిపాలన చేయవచ్చని చెప్పింది. ఈ అంశంపై పూర్తి అధికారాలు రాష్ట్రాల్లోని ప్రభుత్వానిదేనని చెప్పింది.

Advertisement
Advertisement