రాజకీయాలు
Sachin Pilot vs Gehlot Govt: సుప్రీంకోర్టులో సచిన్‌కు ఊరట, స్పీకర్ జోషి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని తెలిపిన కపిల్ సిబల్
Hazarath Reddyసుప్రీం కోర్టులో తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు ఊరట లభించింది. స్పీక‌ర్ సీపీ జోషి (Speaker CP Joshi) పిటిషన్ విచారణ సందర్భంగా.. అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ పైలట్‌తో పాటు అసంతృప్త ఎమ్మెల్యేల పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేయకుండా రాజస్థాన్ హైకోర్టును (Rajasthan High Court) నిలువరించలేమని సుప్రీం (Supreme Court) స్పష్టం చేసింది. దీంతో సచిన్ పైలట్ వర్గానికి భారీ ఊరట లభించినట్లే. సచిన్ పైలట్ (Sachin Pilot) పిటిషన్‌పై రాజస్థాన్ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించేందుకు సుప్రీం అనుమతినిచ్చింది.
AP Capital Bill Row: రాజ్‌భవన్‌కు చేరిన మూడు రాజధానుల బిల్లు, ఆమోదించవద్దని గవర్నర్‌కు చంద్రబాబు లేఖ, నిబంధనల ప్రకారమే గవర్నర్ చెంతకు చేరాయన్న వ్యవసాయమంత్రి కన్నబాబు
Hazarath Reddyఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లు ఈ అంశాలపై గత కొద్ది రోజులుగా చర్చ కొనసాగుతోంది. అయితే ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్ వద్దకు రాజధాని బిల్లు చేరుకుంది. దీనిపై విశ్వభూషణ్ హరిచందన్ (Andhra Pradesh Governor Biswabhusan Harichandan) ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించుకునేందుకు ఈ ఫైల్‌ను రాజ్‌భవన్‌కు (Raj Bhavan) పంపింది.
Rajasthan Political Drama: స‌చిన్ పైల‌ట్‌ను 24 వరకూ టచ్ చేయవద్దు, రాజస్తాన్‌ స్పీకర్‌‌కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, పిటిషన్‌పై జూలై 24న తీర్పు ఇవ్వనున్న రాజస్థాన్ హైకోర్టు
Hazarath Reddyరాజ‌స్థాన్ అసెంబ్లీ స్పీక‌ర్ ఇచ్చిన నోటీసుల‌ను స‌వాలు చేస్తూ స‌చిన్ పైల‌ట్ తోపాటు మ‌రో 18 మంది రెబ‌ల్‌ ఎమ్మెల్యేలు హైకోర్టులో (Rajasthan High Court) పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై హైకోర్టు నేడు విచార‌ణ చేప‌ట్టింది. నేటి విచార‌ణ సంద‌ర్భంగా అసమ్మతి నేత సచిన్ పైలట్ ( Sachin Pilot), అతని గ్రూప్ ఎమ్మెల్యేలకు హైకోర్టు పెద్ద‌ ఉపశమనం కలిగించింది. ఈ నెల 24 వరకు రెబల్‌ ఎమ్మెల్యేల ( Rebel Congress MLAs) అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాజస్తాన్‌ స్పీకర్‌ను ఆదేశించింది.
Tripura CM Biplab Kumar Deb: పంజాబీలకు బలం ఉంది కాని బుద్ది లేదు, వ్యాఖ్యలపై క్షమాపణ కోరిన త్రిపుర సీఎం, ఏ ఒక్కరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదంటూ వివరణ
Hazarath Reddyజాట్లు, పంజాబీలు శారీరకంగా బలవంతులే గానీ వారికి మెదడు ఎక్కువగా పనిచేయదంటూ త్రిపుర ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ డెబ్ (Tripura CM Biplab Kumar Deb) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. తెలివితేటల్లో వారు బెంగాలీలతో పోటీ పడలేరంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడంతో త్రిపుర ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ డెబ్ (Biplab Kumar Deb) వెనక్కితగ్గారు. పంజాబీలు, జాట్లపై కొందరికున్న అభిప్రాయాలను మాత్రమే తాను తేటతెల్లం చేశానని, ఏ ఒక్కరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని మంగళవారం ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
Rahul Gandhi vs PM Modi: ప్రధాని మోదీదంతా బూటకపు ఇమేజ్, ట్విటర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించిన రాహుల్ గాంధీ, మోదీ బలమే భారత్‌కు అతిపెద్ద బలహీనత అంటూ ఎద్దేవా
Hazarath Reddyభారత ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలను (Rahul Gandhi Fires on Modi) సంధించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో నరేంద్ర మోదీ సర్కార్‌ వైఫల్యాలపై రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కరోనా వైరస్‌ (Coroanvirus) కలకలం మొదలైన ఫిబ్రవరి నుంచి మోదీ సర్కార్‌ (Modi Govt) నిర్ణయాలను ట్విటర్‌ వేదికగా రాహుల్ తప్పుపట్టారు.
AP Cabinet Expansion: కొత్త మంత్రి పదవులు ఆ ఇద్దరికేనా? రేపే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్లను సిఫారసు చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyరాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఖరారు అయింది. రేపు(బుధవారం) మధ్యాహ్నం 1:29 నిముషాలకు మంత్రివర్గ విస్తరణ (AP Cabinet Expansion) జరగనుంది. రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (AP CM YS jagan) నిర్ణయించారు. రాజీనామా చేసిన మంత్రుల సామాజిక వర్గానికే తిరిగి మంత్రి వర్గం లో అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
Rajasthan Political Crisis: రాజస్థాన్‌లో ఆడియో టేపు కలకలం, కేంద్ర మంత్రికి నోటీసులు, ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొవడానికి సిద్ధమన్న షెకావత్, బలనిరూపణకు సిద్ధమైన సీఎం అశోక్ గెహ్లాట్
Hazarath Reddyరాజస్థాన్ రాజకీయాలు (Rajasthan Political Crisis) అణుక్షణం ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. రాజస్తాన్‌లో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలు పన్నుతున్నారని, ఈ విషయంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు (Gajendra Singh Shekhawat) సంబంధం ఉందని కాంగ్రెస్‌ (Congress) ఆరోపిస్తోంది. తాజాగా కేంద్ర మంత్రికి రాజస్థాన్ స్పెషల్ గ్రూప్ ఆపరేషన్స్ నోటీసులు పంపించింది. ఈ విషయంలో ఆయనను ప్రశ్నించనున్నారు. అయితే ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. బయటకు వచ్చిన వీడియోలో వాయిస్ తనది కాదని తెలిపారు.
Osmania Hospital: హైదరాబాద్‌లో భారీ వర్షాలు, ఉస్మానియా ఆసుపత్రిలోకి పోటెత్తిన వరదనీరు, రోగులు మరియు వైద్య సిబ్బందికి ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు, వీడియో చూడండి!
Team Latestlyసీఎం కేసీఆర్ గతంలోనే 2016లో ఉస్మానియా చాలా పురాతనమైనది, దీనిని కూల్చివేసి కొత్త ఆసుపత్రి నిర్మిస్తామని ప్రతిపాదనలు చేశారు. ఆసుపత్రిలోని రోగులను ఇతర ఆసుపత్రుల్లోకి మార్చే ఏర్పాట్లు కూడా చేశారు. అయితే అప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయ పక్షాలు, మరికొంత మంది సామాజికవేత్తలు
Rajasthan Political Drama: రాజస్థాన్‌ రాజకీయాల్లో ఊహించని మలుపు, బీజేపీలో చేరేది లేదన్న సచిన్ పైల‌ట్‌, ప్రభుత్వ మనుగడపై కొనసాగుతున్న సస్పెన్స్
Hazarath Reddyరాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం (Rajasthan Political Crisis) ఊహించని మలుపులు తిరుగుతోంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పై తిరుగుబాటు లేవదీసిన రాజ‌స్థాన్ మాజీ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్‌ ఆ పార్టీకి అనుకోని ఘలక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి అన‌ర్హ‌త నోటీసులు అందుకున్న స‌చిన్ పైల‌ట్‌ (Sachin Pilot) తాజాగా మరో బాంబు పేల్చారు. తాను బీజేపీ పార్టీలో (Bharatiya Janata Party (BJP) చేరడం లేదని తెలిపారు. బీజేపీలో (BJP) చేరుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను స‌చిన్ పైల‌ట్ ఖండించారు.
Rajasthan Political Crisis: రాజస్థాన్‌లో రసవత్తరంగా మారిన రాజకీయం, రాష్ట్ర గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాను కలిసిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పూర్తి మెజారిటీ ఉందంటూ వివరణ
Hazarath Reddyరాజస్ధాన్‌లో రాజకీయ సంక్షోభం (Rajasthan Political Crisis) అనూహ్య మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(CM Ashok Gehlot) మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాను (Governor Kalraj Mishra) కలిశారు. అసెంబ్లీలో తనకు పూర్తి మెజారిటీ ఉందని గవర్నర్‌కు వివరించారు. అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) సీఎల్పీ సమావేశానికి మరోసారి గైర్హాజరు కావడంతో ఆయనను పార్టీ చీఫ్‌ సహా ఉప ముఖ్యమంత్రి పదవుల నుంచి కాంగ్రెస్‌ పార్టీ తప్పించింది.
Mudragada Padmanabham: ఆయన తర్వాత ఉద్యమాన్ని నడిపించేదెవరు? కాపు ఉద్యమానికి ముద్రగడ గుడ్‌బై, చాలా నష్టపోయానంటూ లేఖ ద్వారా వివరణ ఇచ్చిన కాపు ఉద్యమనేత
Hazarath Reddyఏపీలో కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కాపు ఉద్యమం (Kapu Movement) నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు 2020, జులై 13వ తేదీ సోమవరం కాపు సామాజిక వర్గానికి ఆయన లేఖ రాయడం సంచలనం రేకేత్తిస్తోంది. కాపు ఉద్యమంలో ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా చాలా నష్టపోయానని వివరించారు.
Rajasthan Political Drama: రంగంలోకి ప్రియాంకా గాంధీ, రిసార్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అధిష్టానం ముందు 3 డిమాండ్లను ఉంచిన సచిన్‌ పైలట్‌, విక్టరీ సింబల్ చూపిన అశోక్ గెహ్లాట్
Hazarath Reddyరాజస్ధాన్‌ ముఖ్యమం‍త్రి అశోక్ గెహ్లాట్ సర్కార్‌పై ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) తిరుగుబాటుతో చెలరేగిన రాజకీయ ప్రకంపనలు (Rajasthan Political Drama) కొనసాగుతున్నాయి. రాజస్థాన్ రాష్ట్ర రాజకీయం (Rajasthan Political Crisis) కీలక మలుపులు తిరుగుతోంది. కొద్ది సేపటి క్రితం సీఎల్పీ సమావేశం ముగియగా.. మొత్తం 107 మంది ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరయ్యారు. 102 మంది ఎమ్మెల్యేలతో గెహ్లాట్ (Ashok Gehlot) బలప్రదర్శన చేశారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు మద్దతు ప్రకటిస్తూ సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. సీఎల్సీ భేటీ తర్వాత ఎమ్మెల్యేలను బస్సుల్లో రిసార్ట్స్‌లకు (Resort Outside Jaipur) తరలించారు.
Rajasthan Political Crisis: రాజస్థాన్ పొలిటికల్ డ్రామాలో కీలక మలుపు, బీజేపీలో చేరడం లేదని తెలిపిన డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్, కొనసాగుతున్న రాజస్థాన్ రాజకీయ సంక్షోభం సస్పెన్స్
Hazarath Reddyరాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభానికి (Rajasthan Political Crisis) కేంద్ర బిందువుగా మారిన సచిన్ పైలెట్ (Sachin Pilot ) కొద్ది సేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి కొన్ని గంటల ముందు డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరడం లేదని ('Not Joining BJP') తెలిపారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలవబోతున్నారన్న వార్తలను మాత్రం ఆయన ఖండించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Telangana New Secretariat: 132 ఏళ్ల చరిత్ర గల భవనం కూల్చివేత, కొత్త సచివాలయ భవన నమూనాను విడుదల చేసిన తెలంగాణ సీఎంఓ
Hazarath Reddyతెలంగాణ సచివాలయ భవన కూల్చివేత పనులు (Telangana Secretariat Building Demolition) ప్రారంభించిన ప్రభుత్వం నూతన భవన నమూనాను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను (Telangana New Secretariat) ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా విడుదల చేసింది. చూడడానికి రాజప్రాసాదంలా ఉన్న ఈ నమూనాలో భవనం ముందున్న నీటి కొలనులో తెలంగాణ సచివాలయ భవనం ప్రతిబింబిస్తోంది
#WhereIsKCR: సీఎం కేసీఆర్ ఎక్కడ? తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ సీఎం జాడ ఏదంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశ్నలు, ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న కేసీఆర్ హ్యాష్‌ట్యాగ్
Team Latestlyసీఎం భద్రతా విభాగంలో కూడా కొంతమందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రగతి భవన్‌లో కొన్ని రకాల కార్యకలాపాలు నిలిపివేశారు. మంత్రి కేటీఆర్ మినహా సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ ప్రగతి భవన్ విడిచి రెండు, మూడు రోజుల క్రితమే మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలోని ఫాంహౌజ్‌‌కు...
TDP Leader Kollu Ravindra Arrest: వైసీపీ నేత హత్య కేసు, టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్, ఇప్పటికే ఈ కేసులో అయిదుమందిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఏపీలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌ యార్డు కమిటీ మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్యకేసును జగన్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ కేసులో రవీంద్ర హస్తం కూడా ఉందని భాస్కర్ రావు కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో టీడీపీ మాజీ మంత్రిని (TDP Leader Kollu Ravindra Arrest) పోలీసులు అరెస్ట్ చేశారు. తనను అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో ఆయన తన స్వస్థలమైన మచిలీపట్నం నుంచి విశాఖ వైపు వెళ్తూ పోలీసులకు చిక్కారు.
Madhya Pradesh Cabinet Expansion: మంత్రిమండలి విస్తరణలో సింధియా మార్క్, మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌ సింగ్‌ నేతృత్వంలో 28 మందితో కొలువుదీరిన కొత్త కేబినెట్
Hazarath Reddyమధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ తన మంత్రిమండలిని (Madhya Pradesh Cabinet Expansion)ఎట్టకేలకు విస్తరించారు. శివరాజ్‌సింగ్‌ సింగ్‌ (CM Shivraj Singh Chouhan) నేతృత్వంలోని ప్రభుత్వంలో గురువారం కొత్తగా 28 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. భోపాల్‌లో ఈ రోజు ఉదయం 28 మందితో గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అందులో 20 మంది మంత్రులుగా, ఎనిమిది మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా మంత్రిమండలి విస్తరణ ( MP Cabinet Ministers) అంశం గత మూడు నెలలుగా వాయిదాపడుతూ వస్తున్నది.
Priyanka Gandhi: లక్నోకు తన నివాసాన్ని మార్చనున్న ప్రియాంక గాంధీ, ఆగస్ట్‌ 1లోపు ఢిల్లీలో బంగ్లాని ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
Hazarath Reddyకాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీని (Priyanka Gandhi) ఢిల్లీలోని ప్రభుత్వ బంగళాను ఆగస్ట్‌ 1లోగా ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరిన విషయం విదితమే. ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున లోథీ రోడ్‌లోని బంగళాను ఖాళీ చేయాలని పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ బుధవారం ఆమెకు రాసిన లేఖలో పేర్కొంది. 35, లోడీ ఎస్టేట్స్‌ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆగస్ట్‌ 1 తర్వాత కూడా బంగళాలో కొనసాగితే ప్రియాంక వాద్రా (Priyanka Gandhi Vadra) జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని లేఖలో స్పష్టం చేసింది. ఖాళీ చేసే ముందు చెల్లించాల్సిన రూ. 3.46 లక్షల మొత్తాన్ని చెల్లించాలని తేల్చి చెప్పింది.
PM Modi Speech Highlights: దేశమంతా ఉచిత రేషన్, ప్రధాని గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం నవరంబర్ వరకు పొడిగింపు, అన్‌లాక్‌ 2.0పై ప్రధాని మోదీ ప్రసంగం హైలెట్స్ ఇవే
Hazarath Reddyభారత ప్ర‌ధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఇవాళ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. క‌రోనాపై పోరాటం చేస్తూ చేస్తూ అన్‌లాక్‌-2 ద‌శ‌లోకి ప్ర‌వేశించిన‌ట్లు ఆయన తెలిపారు. వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల‌ జ‌లుబు, జ్వ‌రం వ‌చ్చే మాసంలోకి ఎంటరయ్యామని..ఇలాంటి స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్రధాని మోదీ (PM Modi) దేశ ప్రజలకు విజ్ఞ‌ప్తి చేశారు. క‌రోనా మృతుల‌ (Corona Deaths) నివార‌ణ‌‌లో భార‌త్ మెరుగ్గా ఉంద‌న్నారు. లాక్‌డౌన్ స‌రైన స‌మ‌యంలో చేప‌ట్ట‌డం, ఇత‌ర నిర్ణ‌యాల వ‌ల్ల ల‌క్ష‌లాది మంది భార‌తీయుల ప్రాణాల‌ను ర‌క్షించుకోగ‌లిగామ‌న్నారు.
PM Modi to Address Nation: నేడు ప్రధాని ప్రసంగం ఆ రెండింటి మీదనేనా ? సాయంత్రం 4 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ, కోవిడ్-19, బార్డర్ ఘర్షణలే ఇప్పుడు హాట్ టాఫిక్..
Hazarath Reddyభారత ప్రధాని నరేంద్రమోదీ ఈ సాయంత్రం 4 గంట‌ల‌కు (PM Modi to Address Nation) జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO Office) ఆదివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే అన్‌లాక్‌-2 కు (Unlock 2) సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖ ( Home ministry) మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల‌లో జూలై 31 వ‌ర‌కు లాక్‌డౌన్ (Lockdown) కొన‌సాగుతుంద‌ని, దేశంలోని స్కూళ్లు, కాలేజీలు, జిమ్‌లు, థియేటర్లు కూడా జూలై 31 వ‌ర‌కు మూసే ఉంటాయని హోంశాఖ మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొన్న‌ది. రాత్రి 10 గంట‌ల‌ నుంచి ఉదయం 5 గంట‌ల వరకు య‌థావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది.