Politics

CAA Row-Vijay Goel: సైకిల్‌పై ఢిల్లీ రోడ్ల మీద బీజేపీ ‘శ్రీమంతుడు’, దేశాన్ని కలుషితం చేయవద్దన్న విజయ్ గోయెల్, సీఏఏ బ్యానర్ కట్టుకుని సైకిల్‌పై పార్లమెంట్‌కి వచ్చిన బీజేపీ ఎంపీ

Hazarath Reddy

బిజెపి రాజ్యసభ ఎంపీ విజయ్ గోయెల్ (BJP lawmaker Vijay Goel) శుక్రవారం పార్లమెంటుకు సైకిల్‌పై వచ్చారు. బడ్జెట్ సమావేశానికి ఆయన సైకిల్‌పై ఓ ప్లకార్డుతో వచ్చారు. ఇందులో "సిఎఎపై పర్యావరణాన్ని కలుషితం చేయవద్దు" (Don't Pollute the Environment On CAA) అనే స్లోగన్ రాసుకున్నారు.సైకిల్‌కి (Cycle) ఈ కార్డు కట్టుకుని ఢిల్లీ రోడ్ల మీద తొక్కుకుంటూ పార్లమెంటుకు వచ్చారు. ఈ సీన్ అచ్చం మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాని తలపించింది. కాగా అడపాదడపా ఎంపీలు సైకిల్‌పై పార్లమెంటుకు రావడం కొత్త కానప్పటికీ విజయ్ గోయెల్ ఈసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

Delhi Elections-BJP Manifesto: ఢిల్లీని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతాం, ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన బీజేపీ, ఢిల్లీ ప్రజలకు వరాల జల్లులు కురిపించిన భారతీయ జనతా పార్టీ

Hazarath Reddy

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకిక దాదాపు వారం రోజులే ఉండగా.. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను (BJP Election Manifesto)విడుదల చేసింది. నగర వాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ (Manoj Tiwari) నగర ఎన్నికల ఇన్-ఛార్జ్, కేంద్ర మంత్రి కూడా అయిన ప్రకాష్ జవదేకర్, మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు ఈ మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే ఆప్ (AAP) పార్టీ తన మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి విదితమే.

Kejriwal Warns PAK Minister: నీ పని నీవు చూసుకో, మోదీ మా దేశ ప్రధాని, పాక్ మంత్రికి కేజ్రీవాల్ కౌంటర్, మా ఐక్యతను మీ ఉగ్రవాద దేశం దెబ్బ తీయలేదన్న ఢిల్లీ సీఎం

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్తాన్ కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Delhi Chief Minister) దిమ్మతిరిగే కౌంటర్ విసిరారు. పాక్ మంత్రి (Pakistani minister Chaudhary Fawad Hussain) భారత ప్రధానిని (PM Modi) కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ కౌంటర్ వేశారు.మోడీజీ భారత ప్రధాని, ఆయన మాకూ ప్రధానమంత్రి. ఢిల్లీ ఎన్నికలు (Delhi elections) భారత అంతర్గత వ్యవహారం. ఈ విషయంలో ‘ఉగ్రవాద సంస్థ ఆర్గనైజర్’ వేలుపెడితే ఊరుకోబోం’ అని పాక్ మంత్రి ట్వీటుకు ఢిల్లీ సీఎం (Arvind Kejriwal) ధీటైన రిప్లయి ఇచ్చారు. భారతీయుల ఐక్యతను దెబ్బతీయాలన్ని పాక్ ఎంతగా ప్రయత్నించినా ఏమీ చేయలేదని చెప్పారు.

Pradhan Mantri Kisan Samman Nidhi: పీఎం కిసాన్‌ నిధుల్లో కోత, రూ.75 వేల కోట్ల నుంచి రూ.61 వేల కోట్లకు ఈ బడ్జెట్‌ను పరిమితం చేసే అవకాశం, బడ్జెట్ 2020లో రైతులకు మరో రెండు కీలక పథకాలు!

Hazarath Reddy

రేపు యూనియన్ బడ్జెట్ (Union Budget 2020) ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని రంగాల మీద అంచనాలు మొదలయ్యాయి. కొన్ని రంగాల్లో కోతలు, మరికొన్ని రంగాలు పెరుగదలలు నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది పీఎం కిసాన్ (Pradhan Mantri Kisan Samman Nidhi)నిధుల కేటాయింపుల్లో కోత విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Jagananna Chedodu: సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, త్వరలో జగనన్న చేదోడు పథకం, ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.10 వేలు, మండలి రద్దుతో మారిన మంత్రిత్వ శాఖలు

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టిన ఏపీ సీఎం నాయీ బ్రాహ్మణులకు కూడా ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశ్యంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ‘జగనన్న చేదోడు’ (Jagananna Chedodu Programme) కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం.

Encounter In Jammu: కాల్పులుకు తెగబడిన ఉగ్రవాదులు, ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఆర్టికల్ 370 రద్దు తర్వాత మళ్లీ కాల్పుల కలకలం, ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం

Hazarath Reddy

ఆర్టికల్ 370 రద్దు (Article 370) తర్వాత ప్రశాంతంగా మారిన జమ్మూలో (Jammu) మళ్లీ ఉగ్రవాదులు (terrorists) కాల్పులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలోనే జమ్మూకాశ్మీర్‌లోని (Jammu and Kashmir) శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై ఉన్న బాన్ టోల్ ప్లాజా వద్ద భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య హోరా హోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో భారత జవాన్లు ముగ్గురు ఉగ్రవాదుల్ని తుదముట్టించారు.

Hostage Drama: ఆ 23 మంది పిల్లలు సురక్షితం, బ‌ర్త్‌డే పార్టీ పేరుతో వారిని బంధించిన దుండుగుడు, కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరిపిన ఎన్ఎస్‌జీ క‌మాండోలు, నేరస్తుడు సుభాష్ హతం

Hazarath Reddy

పుట్టిన రోజు వేడుకకు పిల్లల్ని పిలిచి వారిని బందీలుగా చేసిన ఓ పాత నేరస్తుడిని గురువారం అర్ధరాత్రి ఎన్‌ఎస్‌జీ (నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌) (nsg commandos) చాకచక్యంగా మట్టుబెట్టింది. నేరస్తుడి చెర నుంచి 23 మంది పిల్లల్ని (23 Children Rescued) సురక్షితంగా రక్షించింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని (Uttar Pradesh) ఫ‌రూఖాబాద్ (Farrukhabad)జిల్లాలో ఓ దుండ‌గుడి గురువారం సుమారు 20 మందికిపైగా చిన్నారుల‌ను బంధించాడు. త‌న కూతురి బ‌ర్త్‌డే పార్టీకి పిల్ల‌ల్ని ఆహ్వానించి.. వారిని బంధించాడు.

Pension Home Delivery: దేశంలొనే తొలిసారి, నేరుగా మీ ఇంటికే పెన్సన్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ సర్కారు, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి, ఫస్ట్ తారీఖునే పింఛన్‌ మీచేతికి

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సర్కారు (AP Government) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలో తొలిసారిగాగా సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకే (Pension Home Delivery) వెళ్లి పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1వ తేదీనుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కేవలం కొద్దిగంటల్లోనే పూర్తిచేయడానికి సర్కారు అన్ని ఏర్పాట్లుచేసింది.

Advertisement

Yeh Lo Azaadi: 'జై శ్రీరామ్.. ఏలో ఆజాదీ' దిల్లీలో సంచలన ఘటన, పౌరసత్వ చట్టంపై నిరసనలు చేస్తున్న వారిపై ఓ వ్యక్తి కాల్పులు, ఒకరికి బుల్లెట్ గాయాలు, ఆపై లైవ్ వీడియో

Vikas Manda

దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారం సంచలన ఘటన చోటు చేసుకుంది. దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ పరిధిలో ఒక వ్యక్తి చేతిలో తుపాకీతో హల్ చల్ చేశాడు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీ జరుగుతుండగా నిరసనకారులపై....

Prashant Kishor's Expulsion: ప్రశాంత్ కిషోర్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన జేడీయూ, ధన్యవాదాలు తెలిపిన ప్రశాంత్, 'ఇక మీకు దేవుడే దిక్కు' అంటూ వ్యంగ్య ప్రకటన

Vikas Manda

సిఎఎకు అనుకూలంగా ఓటు వేయడం పట్ల నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. పనిలో పనిగా అమిత్ షాపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యహరించి జగన్ గెలవడంలో ప్రశాంత్ కిషోర్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Saina Nehwal: బీజేపీలో చేరిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, ప్రధాని మోదీపై పొగడ్తల వర్షం, దిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసే అవకాశం

Vikas Manda

హర్యానాకు చెందిన 29 ఏళ్ల సైనా నైహ్వాల్ కుటుంబంతో కలిసి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన మరియు బ్రాండ్ విలువ కలిగిన క్రీడాకారులలో సైనా ఒకరు. ఒలంపిక్స్ లో కాంస్య పతకంతో పాటు 24 అంతర్జాతీయ టైటిల్స్ గెలిచి బ్యాడ్మింటన్ లో ప్రపంచ నెం1 ర్యాంకు....

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్‌పై బీహార్ సీఎం సంచలన వ్యాఖ్యలు, ట్విట్టర్ వేదికగా కౌంటర్ విసిరిన ప్రశాంత్ కిషోర్, అమిత్ షా చెబితేనే నిన్ను పార్టీలోకి తీసుకున్నామన్న నితీష్ కుమార్, అబద్దాలు చెప్పడం మానుకోమన్న ప్రశాంత్ కిషోర్

Hazarath Reddy

బీహార్ రాజకీయాల్లో (Bihar Politics)అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జేడీయూ అధ్యక్షుడు, సీఎం నితీష్‌ కుమార్‌, (Nitish Kumar) ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు (Prashant Kishor) మధ్య విభేదాలు బయటపడ్డాయి. ప్రశాంత్‌ కిషోర్‌పై సీఎం నితీష్‌ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

Advertisement

Delhi Gang Rape: నాపై జైలులో పలుమార్లు అత్యాచారం, సహకరించిన తీహార్ జైలు అధికారులు, నిందితుడు ముఖేష్ సింగ్ సంచలన ఆరోపణలు, ఫిబ్రవరి 1న ఉరితీయాలన్న ఢిల్లీ హైకోర్టు

Hazarath Reddy

నిర్భయ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైనా ముఖేష్‌ సింగ్‌ (Mukesh Singh) సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కేసు నుంచి బయటపడేందుకు అన్ని దారులను ఉపయోగించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏకంగా తనపై పలుమార్లు జైలులో అత్యాచారం(sexually abused) చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

PM Narendra Modi: పాకిస్థాన్‌ను ఓడించేందుకు భారత ఆర్మీకి పది రోజులు చాలు, ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు, 'చారిత్రాత్మక అన్యాయాన్ని' సరిదిద్దటానికే సిఎఎ అని వెల్లడి, ప్రతిపక్షాల నిరసనలపై మండిపాటు

Vikas Manda

దేశాన్ని వెంటాడుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా తమ ప్రభుత్వం పని చేస్తుందని మోదీ స్పష్టంచేశారు. కాశ్మీర్ అంశంతో పాటు బోడో శాంతి ఒప్పందం, పాకిస్తాన్‌లో ఉన్న కర్తార్‌పూర్ గురుద్వారా ప్రారంభం, బంగ్లాదేశ్‌తో ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్, ముస్లిం మహిళల హక్కుల కోసం ట్రిపుల్ తలాక్ నిషేధం లాంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాము.....

Jagan Assets Case: సీబీఐ కేసులో తెలంగాణా హైకోర్టుకు ఏపీ సీఎం, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించిన తెలంగాణా హైకోర్టు,తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా

Hazarath Reddy

సీబీఐ కేసుల్లో వ్యక్తిగత మినహాయింపును కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) దాఖలు చేసిన పిటిషన్‌పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ ను తెలంగాణా హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. పిబ్రవరి 6వ తేదీకి ఈ కేసు సంబంధించిన విచారణను వాయిదా వేసింది.

Three New Districts In AP: అరకు, మచిలీపట్నం, గురజాలతో 15 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్, ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలు, ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా రాని ప్రకటన

Hazarath Reddy

తాజాగా మూడు జిల్లాల (Three New Districts In AP) ఏర్పాటుకు ఏపీ కేబినెట్ (AP cabinet) ఆమోదం తెలిపినట్లు సమాచారం. మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించిందనే వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మచిలీపట్నం (Machilipatnam) కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణకు సమీపంలో ఉండే గుంటూరు జిల్లాలోని గురజాల ప్రాంతాన్ని కూడా జిల్లా చేసినట్టు వార్తలొస్తున్నాయి.

Advertisement

Nereducharla Municipality: నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ పీఠం టీఆర్ఎస్ కైవసం, ఎన్నికను బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ, ఎక్స్ అఫీషియో ఓట్లపై వివాదం, జిల్లా కలెక్టర్‌పై బదిలీ వేటు

Vikas Manda

టీఆర్ఎస్- కాంగ్రెస్ కు సమాన బలాలు ఉండటంతో లాటరీ పద్ధతిలో చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక ఉంటుంది అని భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ టీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిని ఎక్స్ అఫీషియో సభ్యునిగా రంగంలోకి దించి తమ బలాన్ని 11కు పెంచుకుంది....

Coronavirus: కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు వెల్లడించిన సైంటిస్టులు, దాని పుట్టుకకు రెండు కారణాలు చెబుతున్న శాస్త్రవేత్తలు, ప్రపంచం మొత్తం పాకుతున్న డెడ్లీ కరోనా వైరస్

Hazarath Reddy

ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఒకే ఒక వ్యాధి కరోనావైరస్ (Coronavirus Outbreak). ఈ డెడ్లీ కరోనా వైరస్‌ ఎలా పుట్టిందో అసలు దీని మూలాలేంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. దీని గుట్టు తెలిస్తే దీనికి నివారణ మార్గం తెలుస్తుంది. అయితే ఈ వ్యాధి ఎలా వస్తుందనే దానిపై ఇంతవరకు సరైన సమాచారం లేదు. తాజాగా పరిశోధనలు దీని గుట్టును విప్పినట్లు తెలుస్తోంది. ఇది ఎలా వచ్చిందనే దానికి రెండు కారణాలు చెబుతున్నారు.

Racchabanda: మీ గ్రామంలోకి సీఎం జగన్ వస్తున్నాడు, రచ్చబండ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం, సంక్షేమ పథకాలపై ఫీడ్‌బ్యాక్‌ కోసం గ్రామాల్లోకి పర్యటన, ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో ప్రజానేతగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. (CM YS Jagan Mohan Reddy)వాటి అమలు, పనితీరును పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఇందుకోసం రచ్చబండ (Racchabanda) తరహా కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు.

AP Legislative Council: ఏపీ చరిత్రలో రెండో సారి, పెద్దల సభ రద్దుకు అసెంబ్లీ ఆమోదం, కేంద్రం చెంతకు ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం, ఉభయ సభలు, రాష్ట్రపతి ఆమోదం తర్వాత సభ పూర్తిగా రద్దు

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ (Andhra Pradesh Assembly) చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని (Abolish Legislative Council) అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో సభకు హాజరైన సభ్యులంతా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అనంతరం తీర్మానం ఆమోదం పొందినట్లు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. రాజ్యాంగంలోని 169 అధికరణ ప్రకారం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్‌ తెలిపారు.

Advertisement
Advertisement