Politics

Maharashtra Exit Poll Result 2024: ఇండియా కూటమికి షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, మహారాష్ట్రలో అతి పెద్ద పార్టీగా అవతరించనున్న బీజేపీ కూటమి, పూర్తి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో..

Hazarath Reddy

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియగా..క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు బయటకు వచ్చాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని ఎక్కువ పోల్ సర్వేలు చెబుతున్నాయి.

Praja Vijayotsava Sabha: కేసీఆర్‌..ఒక్కసారి అసెంబ్లీకి రా, అన్నీ లెక్కలు తేలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు, బీఆర్‌ఆఎస్ నేతలకు మైండ్‌ దొబ్బిందని విమర్శ

Hazarath Reddy

వేములవాడలో కాంగ్రెస్‌ ప్రజా విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఓడించినా మార్పు రాలేదని అని అన్నారు.బీఆర్‌ఆఎస్ నేతలకు మైండ్‌ దొబ్బింది అని మండిపడ్డారు.

Anil Kumar Yadav: మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తాం, వైసీపీ నేతల అరెస్టులపై స్పందించిన అనిల్ కుమార్ యాదవ్, పార్టీ మారుతున్నారనే వార్తలు కొట్టివేత

Hazarath Reddy

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.

YS Jagan on Sharmila: వీడియో ఇదిగో.. బాలకృష్ణ ఇంటి నుంచి షర్మిలపై తప్పుడు ప్రచారం, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీలో జరుగుతున్న తాజా పరిస్థితులపై వైఎస్ జగన్ మాట్లాడారు. తనపై, తన తల్లిపై, తన చెల్లిపై అసభ్య పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.

Advertisement

YS Jagan on Illegal Arrests: పదేళ్లు చంద్రబాబు సీఎం అంటూ పవన్ వ్యాఖ్యలపై స్పందించిన జగన్, మంచి పనులు చేసినవారిని ప్రజలు ఆశీర్వదిస్తారని వెల్లడి

Hazarath Reddy

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీలో జరుగుతున్న తాజా పరిస్థితులపై వైఎస్ జగన్ మాట్లాడారు. చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని... ఆయనలో ఎప్పటికీ మార్పు రాదని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు

YS Jagan on Varma: రామ్ గోపాల్ వర్మకు అండగా నిలిచిన వైఎస్ జగన్, మీకు అనుకూలంగా సినిమాలు తీయకుంటే కేసులు పెడతారా అంటూ సూటి ప్రశ్న

Hazarath Reddy

వర్మ చేసిన సినిమాకి సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది. రామ్ గోపాల్ వర్మను అక్రమంగా అరెస్ట్ చేయాలని మీరు ప్రయత్నించడం లేదా ? మీకు అనుకూలంగా సినిమాలు తీస్తే ఒకే. అదే వ్యతిరేకంగా సినిమాలు తీస్తే కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారని మండిపడ్డారు.

Pawan Kalyan on Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు ఐదేళ్లు కాదు వచ్చే పదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘అక్రమ కేసులతో జైలులో పెట్టి చంద్రబాబును ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది.

Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ షురూ, ఓటేసిన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్, ఈసారి గెలుపు ఎవరిదో?

Arun Charagonda

దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహారాష్ట్ర ఎన్నికల సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్‌ ప్రారంభం కాగా 9.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Advertisement

AP Assembly Session 2024: మైలవరంలో మైనింగ్‌లో అక్రమాలు, గత ఎమ్మెల్యే హస్తం ఉందని తెలిపిన కొల్లు రవీంద్ర, సభలో నా పరువుకు భంగం కలిగిందని వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం

Hazarath Reddy

అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్త చేశారు. మైలవరంలో మైనింగ్‌లో అక్రమాలు జరిగాయని అందులో గత ఎమ్మెల్యే హస్తం ఉందని మంత్రి శాసన మండలిలో నా ప్రస్తావన తెచ్చారు. కొల్లు రవీంద్ర వ్యాఖ్యలతో సభలో నా పరువుకు భంగం కలిగింది.

CM Revanth Reddy Slams KCR: వీడియో ఇదిగో, తెలంగాణలో తిరిగే కేసీఆర్ అనే మొక్కను పెరగనీయను, కాస్కో ఇక చూసుకుందామంటూ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్

Hazarath Reddy

CM Revanth Reddy: వరంగల్‌ గడ్డ నుంచి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రుణమాఫీ కాని రైతుల రుణాలన్నీ త్వరలో మాఫీ చేస్తామని ప్రకటన

Hazarath Reddy

తెలంగాణ గడ్డపై సూర్య, చంద్రులు ఉన్నంత వరకూ ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు, ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాను టీపీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యానని రేవంత్ రెడ్డి చెప్పారు.

Revanth Reddy on Sonia Gandhi: వీడియో ఇదిగో, సోనియా గాంధీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నా తక్కువే, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

వరంగల్‌ను అభివృద్ధి చేస్తే సగం తెలంగాణను వృద్ధిలోకి తీసుకొచ్చినట్లేనని సీఎం రేవంత్‌ (Revanth Reddy) రెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికంగా వరంగల్‌ (Warangal)ను అభివృద్ధి చేస్తామన్నారు.సోనియమ్మ మా తల్లి.. ఆమె కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నా అది తక్కువేనని రేవంత్ రెడ్డి అన్నారు..

Advertisement

Andhra Pradesh Assembly Session 2024: వీడియో ఇదిగో, మీరు క‌ట్టుకున్న‌ చీర చేనేతదేనా, ఎమ్మెల్యే లోకం మాధవిని సరదాగా ప్రశ్నించిన డిప్యూటీ స్పీక‌ర్ రఘురామ

Hazarath Reddy

ఉద్యోగులు నెలకు ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించేలా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అని మాధవి ప్రశ్నించగా... ఇంతకీ మీరు ధరించింది చేనేత చీరనా? లేక వేరే చీరనా? అని రఘురాజు ప్రశ్నించారు. తాను చేనేత చీరను ధరించానని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు.

YS Sharmila Reddy: వీడియో ఇదిగో, కడప అమీన్‌పీర్‌ దర్గాను దర్శించుకున్న వైయస్ షర్మిల, దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన ఏపీసిసి చీఫ్

Hazarath Reddy

కడప అమీన్‌పీర్‌ దర్గాను ఏపీసిసి చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి దర్శించుకున్నారు. దర్గాలో కు విచ్చేసిన ఏపీసిసి చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి కు దర్గా సంప్రదాయం ప్రకారం దర్గా నిర్వాహకులు స్వాగతం పలికారు.దర్గాలో ఏపీసిసి చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు

Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, రూ. 5 కోట్ల నగదుతో హోటల్‌లో పట్టుబడ్డ బీజేపీ నాయకుడు వినోద్ తావ్డే, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నవంబర్ 20న మహారాష్ట్రలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, బీజేపీ నాయకుడు వినోద్ తావ్డే విరార్‌లోని ఓ హోటల్‌లో 5 కోట్ల రూపాయల నగదుతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల 2024కి ఓటు వేయడానికి ముందు ఓట్లను కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన డబ్బు అని నివేదించబడింది.

G20 Summit 2024: మీ దేశంలో దాక్కున్న ఆ ఇద్దరు ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించండి, జీ20 సమావేశంలో బ్రిటన్ ప్రధానిని కోరిన పీఎం నరేంద్ర మోదీ

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన UK కౌంటర్‌పార్ట్ లో భాగంగా బ్రిటన్ కు కొత్తగా ఎన్నికైన కైర్ స్టార్‌మర్‌తో జరిగిన సమావేశంలో, UK నుండి రప్పించడం కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఆర్థిక నేరస్థుల సమస్యను ప్రస్తావనకు తీసుకువచ్చారు

Advertisement

Kotamreddy Sridhar Reddy: చంద్రబాబును జైల్లో పెట్టేందుకు జగన్ ఫైళ్లను మాయం చేశారు, అసెంబ్లీలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో...

Hazarath Reddy

వైసీపీ హయాంలో చంద్రబాబు(Chandrababu)పై మహాకుట్ర జరిగిందని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy) ఆరోపించారు. ఓ టీవీ ఛానల్‌ చర్చలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ (PV Ramesh)దీనిపై చాలా స్పష్టంగా చెప్పారన్నారు.

Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, వల్లభనేని వంశీ అనుచరులు అరెస్ట్, టీడీపీ నేత రంగబాడుపై ఎలైట్‌ హోటల్‌ వద్ద దాడికి పాల్పడిన కేసులో అదుపులోకి..

Hazarath Reddy

గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన రంగబాబుపై వంశీ అనుచరులు గన్నవరం సమీపంలోని పార్క్‌ ఎలైట్‌ హోటల్‌ వద్ద దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో రంగబాబుకు గాయాలయ్యాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.పొలం విషయమై మాట్లాడేందుకు పిలిచి దాడి చేశారని ఫిర్యాదులో రంగబాబు పేర్కొన్నారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, టీడీపీ సోషల్‌ మీడియాలో వైఎస్‌ జగన్‌పై అసభ్యకర పోస్టులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు

Hazarath Reddy

వైఎస్‌ జగన్‌, ఆయన కుటుంబసభ్యులపై టీడీపీ సోషల్‌ మీడియాలో పోస్టులపై పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ పోస్టులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. వైఎస్‌ జగన్‌పై లోకేష్‌ చేసిన అసభ్యకర ట్వీట్లపై ఏం చర్యలు తీసుకున్నారంటూ అంబటి ప్రశ్నించారు

Lagacharla Village Incident: బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ అరెస్ట్, లగచర్ల వెళుతుండగా మొయినాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

బీజేపీ నేతలు చేపట్టిన లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీకే అరుణ పర్యటనను మొయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement