రాజకీయాలు
Balineni Srinivasa Reddy Resigns YSRCP: వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జనసేనలోకి వెళ్లనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyవైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత జగన్ కు పంపించారు. కొంత కాలంగా పార్టీ అధిష్ఠానంపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు
Congress Manifesto For Haryana Elections: ఏడు గ్యారెంటీలతో హర్యానా కాంగ్రెస్ మేనిఫెస్టో, 2 లక్షల ఉద్యోగాలు, 6 వేల పెన్షన్ ప్రకటించిన మల్లికార్జున ఖర్గే
Arun Charagondaహర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫేస్టోను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఏడు గ్యారెంటీలతో మేనిఫెస్టోను రూపొందించగా ప్రధానంగా 2 లక్షల ఉద్యోగాలు, 6 వేల పెన్షన్, మహిళలకు రూ. 2 వేల రూపాయలు అనౌన్స్‌చేశారు.
Jammu Kashmir: కిష్ట్‌వార్‌లోని పోలింగ్ స్టేషన్‌లో ఉద్రిక్తత, గుర్తింపు కార్డు లేకుండా వచ్చిన వ్యక్తి, గందరగోళం నెలకొనడంతో కాసేపు పోలింగ్‌కు బ్రేక్
Arun Charagondaజమ్మూ కశ్మీర్ తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.47 శాతం ఓటింగ్ జరుగగా కిష్ట్‌వార్‌లోని పోలింగ్ స్టేషన్‌లో కాసేపు పోలింగ్ నిలిపివేశారు. ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా ఓ వ్యక్తి పోలింగ్ స్టేషన్‌కు రాగా గందరగోళం నెలకొనడంతో కాసేపు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత పరిస్థితి చక్కబడటంతో పోలింగ్‌ను తిరిగి ప్రారంభించారు.
One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం, వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు
Hazarath Reddyలోక్‌సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలను ఒకే షెడ్యూల్‌కు సమకాలీకరించే లక్ష్యంతో 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' ప్రతిపాదనకు మోడీ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు తెలిపాయి. రానున్న శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది.
KTR on CM Revanth Reddy: ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే పనిలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ, సెటైర్ వేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కంప్యూటర్లను కనిపెట్టడం, మళ్లీ వాటిని ఆవిష్కరించడంలో సీఎం బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. దీంతో పాటు ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే పనిలో నిమగ్నమై ఉన్నారని కేటీఆర్ విమర్శించారు.
Jammu Kashmir Assembly Election: పదేళ్ల తర్వాత ఎన్నికలు, జమ్మూ కశ్మీర్‌లో ప్రశాంతంగా తొలి విడత పోలింగ్, ఆనందం వ్యక్తం చేస్తున్న ఓటర్లు, ఓటు వేయనున్న కశ్మీరి పండిట్లు
Arun Charagondaపదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం ఏడు గంటలకే తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుండగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు.
New Liquor Policy in AP: ఏపీలో నూతన మద్యం విధానం, సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ, వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను వివరించిన అధికారులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానంపై చర్చించేందుకు సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ విధానంపై మంత్రులు తమ అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబుకు వివరించారు. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను ఉన్నతాధికారులు తెలిపారు
SC on Bulldozer Action: అక్టోబరు ఒకటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, బుల్డోజర్ న్యాయంపై కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyఅక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేసే(Bulldozer Justice) ప్రక్రియకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. అక్టోబర్ ఒకటో తేదీ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కోర్టు ఆదేశించింది. బుల్డోజర్ వినియోగంపై మళ్లీ వాదనలు చేపట్టే వరకు ఆ చర్యలను ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Atishi Named New Delhi CM by AAP: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీ, ప్రతిపాదించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్
Hazarath Reddyఢిల్లీ తరువాత సీఎం ఎవరన్నదానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.మంత్రి అతిశీ (Atishi)ని కొత్త సీఎంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు ఆమె పేరును తాజాగా ప్రకటించింది.
Bandi Sanjay on Delhi CM: కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఖాళీగా ఉన్న కేసీఆర్ ని ఢిల్లీ సీఎం చేయండి, బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు వీడియో ఇదిగో..
Hazarath Reddyఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఢిల్లీ సీఎం రాజీనామా చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ ఇక్కడ ఖాళీగా ఉందని ఎవరో ఒకరిని సీఎం చేయాలని సలహా విసిరారు.
CM Revanth Reddy Unveils Rajiv Gandhi Statue: వీడియో ఇదిగో, తెలంగాణ సచివాలయం ఎదుట స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyగత నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని ప్రభుత్వం అనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. మరో పక్క సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తొలి నుండి బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
CM Revanth Reddy Slams KCR Family: వీడియో ఇదిగో, అదే జరిగి ఉండకపోతే కేటీఆర్ ఇడ్లీ, వడ అమ్ముకునేటోడు, కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyవారసత్వ రాజకీయాలు అని పదే పదే అంటున్నారు... తండ్రిని అడ్డుపెట్టుకుని కొందరు పదవులు పొందలేదా? అని రేవంత్ నిలదీశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఏ పదవి కూడా చేపట్టలేదని వివరించారు. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ అని వెల్లడించారు
Telangana Thalli Statue: పదేళ్లు ఏ గాడిద పండ్లు తోమినవ్? కేసీఆర్, కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyసోనియాగాంధీ పుట్టిన రోజునే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. ఇక్కడి ప్రజల కడుపుకోతను అర్థం చేసుకొని ఓ తల్లిగా తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ. కేసీఆర్ విశాలమైన ఫామ్‌హౌస్ కట్టుకున్నడు.. వంద ఎకరాల్లో కేటీఆర్ జన్వాడ ఫామ్‌హౌస్ కట్టుకున్నడు.
Rajiv Gandhi Statue War: రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించే మగాడెవడో రండి, బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్, తెలంగాణ తల్లిని మళ్లీ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటన
Hazarath Reddyతెలంగాణ సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహమా? అంటూ కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
New Ration Cards in Telangana: తెలంగాణలో అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు, కీలక ప్రకటన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Hazarath Reddyఅక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.రేషన్‌కార్డుల జారీపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు
Andhra Pradesh: జగన్ ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, పాత సంప్రదాయ టెండరింగ్ విధానం అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు
Hazarath Reddyగత వైసీపీ ప్రభుత్వ పాలనలో అమల్లోకి తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన రివర్స్ టెండర్ జీవో నంబరు 67ను రద్దు చేస్తున్నట్లుగా పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది.
Sanjay Gaikwad Sparks Controversy: వీడియో ఇదిగో, రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్
Hazarath Reddyశివసేన ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. (Sanjay Gaikwad) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు ఇస్తానని ప్రకటించారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సచివాలయం ముందు నేడు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ.. సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం
Rudraడాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆవిష్కరించనున్నారు.