Politics

Karnataka Lok Sabha Election Results 2024: కర్నాటక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇవిగో, 19 స్థానాల్లో ఎన్టీఏ కూటమి గెలుపు, 9 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్

Hazarath Reddy

కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 19 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 9 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 17 స్థానాల్లో గెలుపొందగా, జేడీ(ఎస్) 2 సీట్లు గెలుచుకుంది.

Lok Sabha Elections Results 2024: 543 ఎంపీ సీట్లలో 240 మాత్రమే గెలుచుకున్న బీజేపీ, 99 సీట్లతో పుంజుకున్న కాంగ్రెస్, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..

Hazarath Reddy

బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్‌ ప్రజలు ఈసారి ఆ పార్టీకి చేదు ఫలితాలను మిగిల్చారు. దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రంలో బీజేపీ భారీగా సీట్లు కోల్పోయింది. యూపీలోని మొత్తం 80 నియోజకవర్గాలకు గానూ బీజేపీ 2014లో 71 స్థానాలను, 2019లో 62 స్థానాలను గెలుచుకున్నది.

Mudragada Padmanabham: ప‌ద్మ‌నాభ‌రెడ్డిగా మార్చుకుంటున్నట్లు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సంచలన ప్రకటన, దేశంలో సీఎంగా జగన్ చేసిన సాహసం మరెవరూ చేయలేదని వెల్లడి

Hazarath Reddy

2024 ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి తిరిగి వచ్చిన కాపు సామాజికవర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఎన్నికల్లో పవన్‌ని ఓడించకుంటే పేరు మార్చుకుంటానని సవాల్‌ విసిరారు.

Chandrababu on Election Result: ఎన్డీఏ కూటమి సమావేశం తర్వాత అప్‌డేట్ ఇస్తా, చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని వెల్లడి

Hazarath Reddy

ఏపీ ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం కట్టబెట్టినందుకు రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. మీడియా సహా ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

Advertisement

BSP Faces Sharp Fall: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఘోరంగా బోల్తా కొట్టిన మాయావ‌తి పార్టీ, క‌నీస ప్ర‌భావం చూపించ‌లేక‌పోయిన బీఎస్పీ

VNS

రాష్ట్ర రాజకీయాల్లో మాయావతి ప్రభావం తగ్గించేందుకు బీజేపీ దళిత నాయకురాలైన సీనియర్ మంత్రి బేబీరాణి మౌర్యను ప్రోత్సహించగా.. ఎస్పీ అధినేత అఖిలేశ్ సైతం భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు పరోక్ష మద్దతుగా నిలిచారు. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులు పార్టీకి బలమైన ఓటు బ్యాంకును కోల్పోయారు.

AP Election Results 2024: ఏపీలో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థుల పూర్తి జాబితా ఇదిగో, 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ, 164 స్థానాలతో టీడీపీ కూటమి విజయభేరి

Hazarath Reddy

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని బరిలో దిగిన ఆ పార్టీ 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. పులివెందుల నియోజవకర్గంలో గతంలో కంటే జగన్‌కు మెజార్టీ తగ్గింది. జగన్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా వైసీపీ కేబినెట్‌లోని మంత్రలంతా ఓటమి పాలయ్యారు.

AP Election Results 2024: వైసీపీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదు, హామీలను ఖచ్చింతగా నెరవేర్చడమే మా ముందున్న లక్ష్యం, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల ఘన విజయం తర్వాత జ‌న‌సేన అధినేత‌ పవన్ కల్యాణ్ తాజాగా ప్రెస్‌మీట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఇవాళ‌ ఒక చారిత్రాత్మక రోజని అన్నారు. తాము ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చామో అది కచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు

AP Election Results 2024: మంగళగిరిలో 72 ఏళ్ల రికార్డును తిరగరాసిన నారా లోకేష్, మురుగుడు లావణ్యపై 91,413 ఓట్ల మెజారిటీతో ఘన విజయం

Hazarath Reddy

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక ఫ‌లితాల్లో టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌ మంగళగిరి నియోజకవర్గంలో రికార్డు స్థాయి మెజారిటీతో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. మంగ‌ళ‌గిరి 72 ఏళ్ల ఎన్నికల చరిత్రలో తిరుగులేని మెజారిటీ సాధించి విజేతగా నిలిచిన లోకేశ్ స‌రికొత్త‌ రికార్డు నెలకొల్పారు.

Advertisement

AP Election Results 2024: సీఎం పదవికి జగన్ రాజీనామా, రాష్ట్రంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సీఎం పదవికి జగన్ రాజీనామా చేశారు. జగన్ తన రాజీనామా లేఖను ఈ సాయంత్రం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు పంపించారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించడం తెలిసిందే. కూటమికి 165 సీట్లు రాగా, వైసీపీ 10 స్థానాలకే పరిమితమైంది

AP Lok Sabha Election Results 2024 Winners List: వైసీపీ గెలిచిన 4 ఎంపీ సీట్లు ఇవే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన ఎంపీ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 25 స్థానాల్లో టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2 స్థానాల్లో విజయభేరి మోగించింది. వైసీపీ 4 స్థానాలకే పరిమితమైంది.

AP Election Results 2024: పులివెందులలో వైఎస్ జగన్ విజయం, గతంతో పోలిస్తే తగ్గిన మెజారిటీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఎన్నికల్లో అధికార వైసీపీకి దిమ్మదిరిగే ఫలితాలు వచ్చాయి. అదేవిధంగా ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ పులివెందులలో విజయం సాధించినా.. ఈసారి మెజార్టీ తగ్గడం గమనార్హం. సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై జగన్ 61,176 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

AP Election Results 2024: ఎనభైకి పైగా సీట్లలో అభ్యర్థులను మార్చడమే జగన్ కొంపముంచిందా? 18 జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ, ఎనిమిది జిల్లాల్లో 110 సీట్లు సాధించిన కూటమి

Hazarath Reddy

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురయింది. 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలుస్తామన్న వైఎస్‌ జగన్‌ అంచనాలు తలకిందులయ్యాయి. కనీసం రెండంకెల సీట్లను కూడా సాధించలేకపోయింది. ఏపీలోని 26 జిల్లాల్లో 18 జిల్లాల్లో అయితే ఖాతా కూడా తెరవలేదు.

Advertisement

AP Election Results 2024: ఓటమికి కారణాలను సమీక్షించుకుంటాం, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయంపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల తీర్పుని శిరసావహించాల్సిందేనని, ఈ విధంగా నడుచుకోవడం రాజ్యాంగ బద్ధమైనదని ఆయన వ్యాఖ్యానించారు.

Jagan on Election Results: ఓటములు కొత్తేమీ కాదు, తట్టుకుని నిలబడి గెలిచాం, ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ జగన్ భావోద్వేగం, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వెల్లడి అయ్యాయి. మంత్రలు అందరూ ఓటమి పాలైయారు. 175 సీట్లకు గాను పార్టీ కేవలం 10 స్థానాలను మాత్రమే గెలుచుకోనుంది. ఇంత ఘోరమైన ఓటమి నేపథ్యంలో వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడారు.

Andhra Pradesh Election Results 2024: వీడియో ఇదిగో, చంద్రబాబు ఇంట్లో సంబరాల వేడుకలు, విక్టరీ సింబల్‌ చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమికే స్పష్టమైన ఆధిక్యం రావడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌, బాలకృష్ణ సతీమణి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులంతా కలిసి కేక్‌ కట్‌ చేశారు

AP Election Results 2024: వీడియో ఇదిగో, ఓటర్లకు, జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా, తనయుడు అకీరా నందన్

Hazarath Reddy

జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి భారీ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి వంగా గీత కంటే 70,354 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ఇక ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం లాంఛనమే. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్నెవా, తనయుడు అకీరా నందన్ ఓటర్లకు, జనసైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు

Advertisement

Hyderabad Lok Sabha Election Result 2024: హైదరాబాద్ కా బాద్‌షా మళ్లీ అసదుద్దీన్ ఓవైసినే, 3,15,811 ఓట్లతో బీజేపీ అభ్యర్థి మాధవి లత పై గెలుపు, తెలంగాణలో ఎవరికెన్ని సీట్లంటే..

Hazarath Reddy

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీ 3,15,811 ఓట్లతో బీజేపీ అభ్యర్థి మాధవి లత పై గెలుపొందారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో ఎనిమిది చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఇరుపార్టీలకు చెందిన మెజార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో దూసుకెళుతున్నారు.

Andhra Pradesh Election Results 2024: పేర్లు మార్పు షురూ చేసిన టీడీపీ, వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన టీడీపీ కార్యకర్తలు

Hazarath Reddy

ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మళ్లీ పేర్లు మార్పును టీడీపీ కార్యకర్తలు స్టార్ట్ చేశారు. తాజాగా విజయవాడలో వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చివేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Gudivada Election Result 2024: గుడివాడలో కొడాలి నానికి ఘోర పరాభవం, 51 వేల పై చిలుకు ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఘన విజయం

Hazarath Reddy

గుడివాడలో వరుస విజయాలతో దూసుకుపోతున్న కొడాలి నానికి ఘోర పరాభవం ఎదురైంది. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము 50 వేల పై చిలుకు ఓట్లతో కొడాలి నానిపై గెలుపొందారు. పోటీ చేసిన ప్రతి జిల్లాలోనూ టీడీపీ అభ్యర్థుల హవా స్పష్టంగా తెలుస్తోంది.

Kadapa Election Result 2024: వైసీపీ కంచుకోట క‌డ‌ప జిల్లాలో ఎగిరిన టీడీపీ జెండా, 5 వేల‌కు పైచిలుకు ఆధిక్యంలో రెడ్డ‌ప్ప‌గారి మాధ‌విరెడ్డి

Hazarath Reddy

వైసీపీ కంచుకోట క‌డ‌ప జిల్లాలో టీడీపీ జెండా ఎగిరింది. క‌డ‌ప అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన రెడ్డ‌ప్ప‌గారి మాధ‌విరెడ్డి విజ‌యం సాధించారు. వైసీపీ అభ్య‌ర్థి, ఉప ముఖ్య‌మంత్రి అంజాద్ బాషాపై గెలుపొందారు. ప్ర‌స్తుతం ఆమెకు 5 వేల‌కు పైచిలుకు ఆధిక్యంలో ఉండ‌గా.. సాయంత్రానికి పూర్తి మెజారిటీపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Advertisement
Advertisement