Politics
Andhra Pradesh Elections 2024: ఆ ఆరు ఎంపీ సీట్లు మాకిస్తే పొత్తుకు సై అంటున్న బీజేపీ పెద్దలు, 4 పార్లమెంట్ స్థానాలు ఇస్తామంటున్న టీడీపీ
Hazarath Reddyతాజా సమాచారం ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో ఆరు పార్లమెంట్ స్థానాలు రాజమండ్రి, నరసాపురం, వైజాగ్, విజయవాడ, హిందూపురం, అరకు స్థానాలను బీజేపీ కోరుతోంది. అయితే, టీడీపీ మాత్రం రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, అరకు ఇస్తామని బీజేపీకి ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Andhra Pradesh Elections 2024: మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌, అధికారికంగా ప్రకటించిన సీఎం జగన్ టీం
Hazarath Reddyమచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ Simhadri Chandrasekhar పేరును తాజాగా వైసీపీ పార్టీ అధికారికంగా ప్రకటించింది. మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని గురువారం సాయంత్రం ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు.
Arani Srinivasulu Joins Janasena: జనసేనలో చేరిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తనకు టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశారని ఆవేదన
Hazarath Reddyచిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నేడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆరణి శ్రీనివాసులుకు పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు.
Andhra Pradesh Elections 2024: ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి ఎంట్రీకి లైన్ క్లియర్, ఆనయ నివాసంలో భేటీ అయిన వైఎస్సార్‌సీపీ నేతలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyకాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లి వైఎస్సార్‌సీపీ నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం, ముద్రగడ నివాసంలోనే ఆయనతో మిథున్‌ రెడ్డి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇన్‌ఛార్జ్‌ దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇన్‌ఛార్జ్‌ తోట నరసింహం భేటీ అయ్యారు.
CM Jagan Slams Pawan Kalyan: కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడు, పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగిన సీఎం జగన్, వైఎస్సార్‌ చేయూత నాలుగో విడత నిధులు విడుదల
Hazarath Reddyఅనకాపల్లి జిల్లా పిసినికాడలో ‘వైఎస్సార్‌ చేయూత’ నాలుగో విడత నిధులను (YSR Cheyutha) బటన్‌ నొక్కి సీఎం జగన్‌ విడుదల చేశారు. వైఎస్సార్ చేయూత అనే ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే 33,14,916 మంది నా అక్కచెల్లెమ్మలకు మొత్తంగా రూ.19,189 కోట్లు నేరుగా ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం పంపించింది
Fresh Summons to Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు, 16వ తేదీ తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు
Hazarath Reddyఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (money laundering case)లో ఢిల్లీ సీఎంకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate ) అధికారులు ఇప్పటికే 8 సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణకు హాజరుకావాలని కోరితే ఈడీ సమన్లు కేజ్రీ పట్టించుకోలేదు.
Kesineni Nani Slams Chandrababu: చంద్రబాబు కంటే జగన్ 20 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాడు, టీడీపీ అధినేతపై విరుచుకుపడిన విజయవాడ ఎంపీ కేశినేని నాని
Hazarath Reddyఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు, ముస్లింలు గుర్తుకు వస్తారని విజయవాడ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని (MP Keshineni Nani) విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను జగన్ (YS Jagan) మూడేళ్లలో ఎంతగానో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. బీసీ డిక్లరేషన్‌ (BC Declaration) పేరిట ప్రతి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం , అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని మరిచిపోవడం టీడీపీ అధినేతకు అలవాటేనని ఆరోపించారు.
Palamuru Praja Deevena Sabha: 2024 నుంచి 2034 దాకా తెలంగాణలో ఉండేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే, మా జోలికి వస్తే అంతు చూస్తామని పాలమూరు ప్రజాదీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
Hazarath Reddyమహబూబ్ నగర్‌లో పాలమూరు ప్రజాదీవెన సభలో (Congress Praja Deevena Sabha) సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
Group 1, Group 2, Group 3 Exam Dates: తెలంగాణలో గ్రూప్‌-1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారు, గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు జూన్ 6న ప్రిలిమినరీ పరీక్ష, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ బుధవారం ప్రకటించింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. వారు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న షెడ్యూల్ వచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు జూన్ 6న ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ నిర్వహిస్తారు.
Poonam Kaur on Jagan Govt: కరోనాలో జగన్ నంబర్ వన్ పాలన అందించారు, ఏపీ ప్రభుత్వంపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ ప్రశంసలు
Hazarath Reddyకరోనా సమయంలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ ప్రముఖ హీరోయిన్‌ పూనమ్ కౌర్ సీఎం జగన్ ను ప్రశసించారు.కోవిడ్ మహామ్మారి విజృభించిన సమయంలో చేనేత కార్మికులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. వారి కోసం చాలా మంచి పనులు చేసింది.
YSRCP New Slogan: నాకు ఒక కల ఉంది అంటూ వైసీపీ కొత్త నినాదం, ఈ నెల 10న జరగనున్న సిద్ధం సభ కోసం ప్రచారం ముమ్మరం
Hazarath Reddyరానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ కొత్త ప్రచార అస్త్రానికి పదునుపెట్టింది. ఇప్పటి వరకు ‘సిద్ధం పేరుతో హోర్డింగులు కనిపించగా, తాజాగా ‘నాకు ఒక కల ఉంది అంటూ ఆయా వర్గాల పేరుతో ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
Nara Lokesh: మంగళగిరిలో 53 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి చూపిస్తా, నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు, చంద్రబాబుకు, పవన్‌కు కానుకగా ఇస్తానని వెల్లడి
Hazarath Reddyమంగళగిరిలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో లోకేశ్ (Nara Lokesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో నేను పోటీ చేయాలనుకున్నప్పుడు... రాష్ట్రంలో ఎక్కడ్నించి పోటీ చేస్తావని చంద్రబాబు నన్ను అడిగారు. రాష్ట్రంలో టీడీపీ ఎప్పుడూ గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి... గెలిపించి చూపించే బాధ్యత నాది అని చంద్రబాబుతో చెప్పాను.
Gummanur Jayaram Joins TDP: టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం, పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు, మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్‌ చేసిన వైసీపీ
Hazarath Reddyమంగళగిరి జయహో బీసీ సభలో ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. జయరాంతో పాటు ఆయన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు.
TDP-Janasena BC Declaration: బీసీలకు పెన్షన్ నెలకు రూ.4 వేలకు పెంపు, 10 అంశాలతో టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్‌ ఇదిగో..
Hazarath Reddyమంగళగిరిలో ఏర్పాటు చేసిన ‘జయహో బీసీ ’ సభలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. బీసీల అభివృద్ధికి చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.బీసీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని టీడీపీ-జనసేన ప్రకటించాయి. ఈ బీసీ డిక్లరేషన్ లో 10 అంశాలు ఉన్నాయి.
Rahul Gandhi Attack on PM Modi: జై శ్రీరాం అంటూ ఆకలితో చావండి, ప్రధాని మోదీకి కావాల్సింది ఇదే, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు ఫోన్ చూడాలి.. జై శ్రీరాం అనాలి. అలా చేస్తూ ఆకలితో చావండి. ప్రధాని మోదీకి కావాల్సింది ఇదే అని’ రాహుల్ గాంధీ అన్నారు.
Money Laundering Case: డికె శివకుమార్ మనీ ల్యాండరింగ్ కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు, అభియోగాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపిన అత్యున్నత ధర్మాసనం
Hazarath Reddyమనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌పై చర్యలు.. చట్టం, నిబంధనలకు అనుగుణంగా లేనందున ఆయనపై 2018 మనీలాండరింగ్ కేసును (2018 money laundering case) సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.
Bomb Threat to CM Siddaramaiah: రూ. 20 కోట్లు ఇవ్వకుంటే కర్ణాటక మొత్తం బాంబులతో పేల్చేస్తాం, సీఎం సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు బెదిరింపు ఈమెయిల్స్
Hazarath Reddyకర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సహా పలువురు మంత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం Shahidkhan10786@protonmail.com. అనే ఈమెయిల్‌ ద్వారా బెదిరింపు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపు మెయిల్‌ అందుకున్న వారిలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, హోంమంత్రి జీ పరమేశ్వరతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
RS Praveen Kumar Met KCR: కేసీఆర్‌తో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ మర్యాదపూర్వక‌ భేటీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో భేటీపై ప్రాధాన్యం
Hazarath Reddyబీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను నంది నగర్‌లోని ఆయన నివాసంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్, ఆ పార్టీ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌, ప్రవీణ కుమార్‌ భేటీపై ప్రాధాన్యం సంతరించుకుంది
CM Jagan Visakha Visit: మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, మళ్లీ సీఎంగా విశాఖలో ప్రమాణస్వీకారం, అక్కడి నుంచే పాలన, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని వెల్లడి
Hazarath Reddyవిజన్ విశాఖ కార్యక్రమంలో భాగంగా.. విశాఖలో పర్యటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధానిపై (Three Capitals) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ గెలిచి.. విశాఖలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అని అన్నారు.
Gummanur Jayaram Resigns YSRCP: వైసీపీకి ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రాజీనామా, టీడీపీ అభ్యర్థిగా గుంతకల్లు నుంచి పోటీ చేస్తానని వెల్లడి
Hazarath Reddyవైసీపీ (YCP)కి, మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) రాజీనామా చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.