Politics

Andhra Pradesh Elections 2024: వైఎస్సార్‌సీపీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి నియోజకవర్గ గెలుపు బాధ్యతల్ని అప్పగిస్తారని వార్తలు..

Hazarath Reddy

అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది నెలల్లో సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా వైసీపీ నుండి గెలిచి ఆ తర్వాత రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) మళ్లీ వైసీపీలో చేరనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

KA Paul Slams Nara Lokesh: జనసేన పార్టీని కుక్కతో పోల్చిన కేఏ పాల్, ఎవడికి కావలిరా నీ అపాయింట్మెంట్ అంటూ నారా లోకేష్ మీద ఫైర్, విశాఖ నుంచి ఎంపీగా పోటీలో ఉంటానని వెల్లడి

Hazarath Reddy

ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ జనసేన పార్టీపై దాని అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ యువనేత నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 సీట్ల కోసం జనసేన టీడీపీకి కుక్కలాగా అమ్ముడుపోయిందన్నారు. ‘ఎవడికి కావాలిరా నీ అపాయింట్‌మెంట్’ అంటూ నారా లోకేష్‌పై కేఏ పాల్ విరుచుకుపడ్డారు

PM Modi Jammu Visit: ప్రధాని మోదీ జమ్మూ పర్యటన, అప్రమత్తమైన భద్రతా బలగాలు, అన్ని పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు, రూ. 30,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయనున్న ప్రధాని

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 20న జమ్మూ కాశ్మీర్‌లో (J&K) పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా బలగాలు సోమవారం అప్రమత్తమయ్యాయి. శ్రీనగర్, జమ్మూలోని అన్ని ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద భద్రతా దళాలు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాయి

Delhi Excise Policy Case: వరుసగా ఆరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కోర్టు నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని ఆప్ స్పష్టం

Hazarath Reddy

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోసారి ఈడీ విచారకు డుమ్మా కొట్టారు.ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈ నెల 14న కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయన నేడు కూడా విచారణకు హాజరుకాలేదు.

Advertisement

Criminal Case Against Pawan Kalyan: జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పై క్రిమినల్‌ కేసు.. గుంటూరు కోర్టులో నమోదు.. మార్చి 25న హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. ఇంతకీ ఏ కారణంతో జనసేనానిపై కేసు నమోదయ్యిందంటే??

Rudra

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై క్రిమినల్‌ కేసు నమోదయింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ ను గుంటూరు కోర్టు విచారణకు స్వీకరించింది.

Suhani Bhatnagar Dies: దంగల్‌ చిత్రంలో చిన్నారి బబితా పాత్రలో నటించిన సుహానీ భట్నాగర్ కన్నుమూత..

sajaya

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' చిత్రంలో చిన్నప్పటి బబితా ఫోగట్ పాత్రను పోషించిన నటి సుహానీ భట్నాగర్ కన్నుమూశారు. ఈరోజు, ఫిబ్రవరి 17వ తేదీ శనివారం, సుహాని ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. 19 ఏళ్లకే సుహాని ఈ లోకానికి వీడ్కోలు పలికింది.

Vote of Confidence in Delhi Assembly: అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, రేపు చర్చకు రానున్న విశ్వాస పరీక్ష

Hazarath Reddy

ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని (vote of confidence motion) ప్రవేశపెట్టారు. లిక్కర్ స్కాం ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆరోసారి సమన్లు జారీ చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఢిల్లీ కోర్టుకు కూడా హాజరుకావాల్సి ఉండటంతో అరెస్ట్ ఊహాగానాలు ఊపందుకున్నాయి

Telangana Elections 2024: కాంగ్రెస్ పార్టీలో చేరిన అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్‌రెడ్డి, హస్తం గూటికి చేరిన బీఆర్ఎస్ నేతల లిస్టు ఇదే..

Hazarath Reddy

పార్లమెంట్‌ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకున్నాయి. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్‌ జెడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో జాయిన్‌ అయ్యారు.

Advertisement

Chandrababu Viral Video: చంద్రబాబు నాయుడు నోటి వెంట.. 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్.. వైరల్ వీడియో ఇదిగో!

Rudra

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నోటి వెంట సోషల్ మీడియాలో పాపులర్ అయిన 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్ వచ్చింది. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ డైలాగ్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

PM Modi Qatar Visit: ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఖతార్ పర్యటన, వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంపొందించడంపై దృష్టి

Hazarath Reddy

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దోహా పర్యటన (PM Modi Qatar Visit) ద్వైపాక్షిక సంబంధాలను లావాదేవీల నుండి వ్యూహాత్మక స్థాయికి పెంచిందని, ఈ పర్యటనలో భారత్ - ఖతార్ మధ్య విస్తృత భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడంపై (Fostering Strategic Partnerships) దృష్టి కేంద్రీకరించినట్లు విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు.

Andhra Pradesh Elections 2024: టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశో​ర్ చంద్రదేవ్ రాజీనామా, విద్వేష శక్తులతో​ చేతులు కలపడం సహించరాని విషయమని మండిపాటు

Hazarath Reddy

టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశో​ర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. ఎన్డీయేలో టీడీపీ చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. విద్వేష శక్తులతో​ చేతులు కలపడం సహించరాని విషయమన్న కిశోర్‌.. అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేనని చంద్రబాబుకు ఘాటు లేఖ రాశారు.

SC on Electoral Bonds Scheme: ఎలక్టోరల్‌ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్ధం, వెంటనే నిలిపివేయండి, ఎన్నికల బాండ్ల స్కీమ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Hazarath Reddy

ఎల‌క్టోర‌ల్ బాండ్ల(Electoral Bonds)పై సీజేఐ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం (Supreme Court) సంచలన తీర్పును వెలువరించింది. ఎలక్టోరల్‌ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్ధం. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే.

Advertisement

Verdict On Electoral Bond Scheme Today: 2018లో తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం చెల్లుబాటుపై సుప్రీంకోర్టు తీర్పు నేడే.. ఈ తీర్పు వచ్చే లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపొచ్చంటున్న రాజకీయ విశ్లేషకులు

Rudra

2018లో తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం చెల్లుబాటుపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఎలక్టోరల్ బాండ్ల చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గతేడాది నవంబర్‌ లో వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.

Telangana Politics: పదేళ్లు వెంట్రుక కూడా పీకలేవ్, కేసీఆర్‌కి సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి, కొత్తగా ఎంపికైన 13,444 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

గత కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) మండిపడ్డారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో హోంశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించారు

Rajya Sabha Elections 2024: రాజ్యసభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన అందర్నీ తీసుకోలేమని స్పష్టం చేసిన టీడీపీ అధినేత

Hazarath Reddy

రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) తేల్చేశారు. బుధవారం ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పలువురు పార్టీ ముఖ్యనేతలు సమావేశమైన టీడీపీ అధినేత రాజ్యసభ ఎన్నికల్లో (Rajya Sabha elections) పోటీ చేసే ఆలోచన లేదని నేతలకు తేల్చిచెప్పేశారు.

Rajya Sabha Elections 2024: తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ, రేణుకా చౌదరితో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్‌కుమార్ యాదవ్‌కు అవకాశం

Hazarath Reddy

తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను బుధవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించింది. రేణుక చౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్‌కుమార్ యాదవ్‌కు ఏఐసీసీ అవకాశం ఇచ్చింది

Advertisement

Vibhakar Shastri Joins BJP: బీజేపీలో చేరిన మాజీ ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మ‌నువ‌డు విభాక‌ర్ శాస్త్రి, జై జవాన్, జై కిసాన్ ముందుకు సాగాలంటే మోదీతోనే సాధ్యమని వెల్లడి

Hazarath Reddy

రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన తర్వాత విభాకర్ శాస్త్రి తన ప్రకటనలో, “ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో , లాల్ బహదూర్ శాస్త్రి యొక్క ‘జై జవాన్, జై కిసాన్’ విజన్‌ని మరింత బలోపేతం చేయడం ద్వారా నేను దేశానికి సేవ చేయగలనని భావిస్తున్నానని తెలిపారు.

Vibhakar Shastri Quits Congress: కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్, రాజీనామా చేసిన మాజీ ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మ‌నువ‌డు విభాక‌ర్ శాస్త్రి

Hazarath Reddy

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చవాన్ రాజీనామా ఘటన మరువక ముందే కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. మాజీ ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మ‌నువ‌డు విభాక‌ర్ శాస్త్రి పార్టీకి రాజీనామా చేశారు.

Rajya Sabha Elections 2024: రెండో సారి రాజ్యసభకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌, బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల ఫస్ట్, సెకండ్ లిస్టు ఇదిగో..

Hazarath Reddy

త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తన రెండో లిస్టును ప్రకటించింది. రెండో లిస్టులో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఒడిషా నుంచి రాజ్యసభకు రీనామినేట్‌ అయ్యారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రి(సహాయ) డాక్టర్ ఎల్. మురుగన్ తో పాటు మరో ముగ్గురు ఉమేష్ నాథ్, మాయ నరోలియా, బన్సీలాల్ గుర్జర్ పేర్లను బీజేపీ నామినేట్‌ చేసింది.

Rajya Sabha Elections 2024: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ, రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, పూర్తి లిస్టు ఇదిగో..

Hazarath Reddy

రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్రం నుంచి చంద్రకాంత్ హాండోర్‌ నామినేషన్ దాఖలు చేయనున్నారని వెల్లడించింది.

Advertisement
Advertisement