Traditional Mango Pickle Recipe (Photo Credits: Wikimedia Commons)

Food Tips: సాధారణంగా మ్యాంగో పికిల్స్ ఎక్కువగా పడతారు. అయితే ఈసారి ఆరోగ్య ప్రయోజనాల కోసం వెల్లుల్లి పచ్చడి చేసుకోండి. దీనిని తయారు చేసుకోవడం చాలా తేలిక. మంచి రుచితో పాటు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది.  ఈ టేస్టీ, హెల్తీ రెసిపీని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు, ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

నూనె - పావు కప్పు

వెల్లుల్లి - 25 రెబ్బలు

అల్లం - 2 టేబుల్ స్పూన్లు

పచ్చిమిర్చి - 3

కారం - 1 టేబుల్ స్పూన్

పసుపు - అర టీస్పూన్

మెంతి గింజలు - పావు టీస్పూన్

ఆవాలు - 1 టీస్పూన్

జీలకర్ర - అర టీస్పూన్

ఉప్పు - రుచికి తగినంత

నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టండి. దానిలో కొద్దిగా నూనె వేసి.. కొన్ని ఆవాలు వేయాలి. అవి వేగుతున్న సమయంలో పొట్టుతీసిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వెల్లుల్లి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి. అనంతరం పసుపు, కారం వేయాలి. ఇవి వేసినప్పుడు మంటను సిమ్ చేయాలి. లేదంటే కారం, పసుపు మాడిపోయే ప్రమాదముంది. అవి మిక్స్ చేసి.. స్టౌవ్ ఆపేయాలి.

Vastu Tips: ఇంట్లో తాజ్ మహల్ ఫోటో పెట్టుకున్నారా అయితే జాగ్రత్త ...

ఇప్పుడు మరో పాన్ తీసుకుని దానిని వెలిగించిన స్టౌవ్​పై ఉంచాలి. దానిలో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేయాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మంచిగా పొడి చేయాలి. ఈ పౌడర్​ను ముందుగా సిద్ధం చేసుకున్న వెల్లుల్లి మిశ్రమంలో వేసి బాగా కలపాలి. అనంతరం ఉప్పు, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే ఇన్​స్టాంట్ వెల్లుల్లి ఊరగాయ రెడీ. దీనిని అన్నంతో, టిఫిన్స్తో కలిపి తీసుకోవచ్చు.