Health Tips: మన గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే రక్తపోటు లేకుండా చూసుకోవాలి. రక్తపోటు ద్వారా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే వీటితోపాటు చలికాలంలో వచ్చే జలుబు దగ్గు వంటి సమస్యలు తగ్గించడానికి దాల్చిన చెక్క టీనే ఉపయోగించుకోవచ్చు. దాల్చిన చెక్కను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా బిపి కంట్రోల్ లో ఉంటుంది. దాల్చిన చెక్కతో చేసిన టీ ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఇందులో ఉండే విటమిన్లు ఖనిజాలు అనేక రకాల పోషకాలు మన శరీరానికి చాలా ఉపయోగపడతాయి. ఇది శరీరంలో రక్త పోటును తగ్గించడానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
బీపీని కంట్రోల్ చేస్తుంది- దాల్చిన చెక్కలో పొటాషియము, కాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాలు అనేకం ఉంటాయి. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. రోజు దాల్చిన చెక్క టీ తీసుకోవడం ద్వారా రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది.
Health Tips: మీశరీరంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉందా,
షుగర్ తగ్గుతుంది- షుగర్ సమస్యతో బాధపడే వారికి కూడా దాల్చిన చెక్క టీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది రక్తంలోని చక్కర స్థాయిలో అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఎవరికైతే మధుమేహ ప్రమాదం వచ్చేవారు వారు ముందు నుంచే దాల్చిన చెక్క టీ తీసుకోవడం ద్వారా మధుమేహం రాకుండా ఉంటుంది.
గుండె జబ్బులు- దాల్చిన చెక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తంలో గడ్డ కట్టడాన్ని నిరోధిస్తుంది. దీని ద్వారా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
జీర్ణ క్రియ కు- ప్రతిరోజు దాల్చిన చెక్క తీసుకోవడం ద్వారా జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. కడుపు సంబంధ వ్యాధులు తగ్గడంలో సహాయపడుతుంది. గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గిస్తుంది. అంతేకాకుండా బరువు ఉన్న వారికి కూడా బరువు తగ్గడంలో దాల్చిన చక్కటి ప్రభావంతంగా పనిచేస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి