Health Tips: ఈ మధ్యకాలంలో చాలా మందిను అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. అధిక కొలెస్ట్రాల వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండెపోటు పక్షవాతం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి .అధిక కొలెస్ట్రాల్ వల్ల బిపి సమస్య కూడా పెరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కోసం వ్యాయామం వంటి వాటితో పాటు మన ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను భాగం చేసుకోవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి ఆకులు- కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు. తులసాకులు అద్భుతంగా పనిచేస్తాయి. తులసిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. తులసిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ పుష్కలంగా ఉంటాయి. తులసాకులను ప్రతిరోజు నాలుగు తినడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి ఇది చక్కటి వరంగా చెప్పవచ్చు.
Health Tips: ఎన్ని వ్యాయామాలు చేసిన బరువు తగ్గట్లేదా
వెల్లుల్లి- వెల్లుల్లిలో పువ్వును కరిగించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గా యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని ప్రతి రోజు రెండు రెబ్బలు తీసుకున్నట్లయితే అధిక కొలెస్ట్రాలతో బాధపడే వారికి ఇది చక్కటి వరంగా చెప్పవచ్చు.
పుట్టగొడుగులు- అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు పుట్టగొడుగులను తమ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడతారు. పుట్టగొడుగుల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. బీపీ పేషెంట్స్ కూడా వీటిని తింటే గుండె సంబంధం జబ్బులు రాకుండా ఉంటాయి.
దాల్చిన చెక్క- దాల్చిన చెక్క అధిక కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు దాల్చిన చెక్కను పీ రూపంలో లేదా కషాయం రూపంలో చేసుకొని తాగినట్లయితే అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి చక్కటి వరంగా చెప్పవచ్చు. ఇది చెడు కొలెస్ట్రాలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి