Astrology: జ్యోతిష శాస్త్రంలో అన్ని గ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జనవరి 26వ తేదీన శుక్రుడు కూజుడి కలయిక వల్ల నవ పంచయోగం ఏర్పడుతుంది. జనవరి 26వ తేదీన ఉదయం 5గంటల 20 నిమిషాలకు శుక్రుడు కలయికతో ఈ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల అన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్కాటక రాశి- కర్కాటక రాశి వారికి ఈ నవ పంచ యోగం అనేక శుభ ఫలితాలను తీసుకువస్తుంది. కెరీర్లో వృత్తిపరంగా అనేక మార్గాలు తెరుచుకుంటాయి. కొత్త ప్రణాళికలతో విజయాన్ని సాధిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు స్థిరాస్తులు పెరుగుతాయి.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి
ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి ఈ యోగం అనేక శుభ ఫలితాలను అందిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి సంబంధ వ్యవహారాల్లో మీకు లాభాలు ఇస్తాయి. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది. పెట్టవు విద్యార్థులు పోటీపరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.
మేషరాశి-మేష రాశి వారికి నవ పంచ యోగం వల్ల వారు గొప్ప గొప్ప విజయాలను అందుకుంటారు. వీరికి అదృష్టం కలిసి వస్తుంది. పనులన్నీ త్వరగా పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. మీరు పని చేసే చోట పదోన్నతులు ప్రశంసలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. సంతానం లేని వారికి సంతానయోగం ఉంటుంది. వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కొత్త కొత్త ఒప్పందాలను ఒప్పుకుంటారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.