RCB జట్టు IPL ట్రోఫీని గెలుపొందడం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఈ జట్టుకు ఎంతో లాయల్ అభిమానులుండగా ప్రతి ఐపీఎల్ టోర్నీలో 'ఈ సాలా కప్ మనదే' అంటూ స్టేడియంలో సందడి చేస్తుంటారు. కానీ దురదృష్టం ఆ జట్టును వెంటాడుతుండటంతో గెలుపు దరిచేరలేదు. ఈక్రమంలో 144 ఏళ్లకు ఒకసారి వచ్చే 'మహా కుంభమేళా'లో జెర్సీని ముంచి కోరుకుంటేనైనా గెలుస్తుందేమోనని ఓ అభిమాని భావించాడు.
కాగా ఈసారి ఆర్సిబి ఎలాగైనా కొట్టాలని ఓ తెలుగు వ్యక్తి అయ్యప్ప మాల ధరించి శబరిమల యాత్ర చేసిన వీడియో గతంలో వైరల్ గా మారింది. పాదయాత్రగా శబరిమల వెళుతూ దారి వెంట ఉన్న అన్ని దేవుళ్లకు మొక్కుతూ వెళుతున్నాడు. 2025 ఐపీఎల్ లో ఆర్సిబి ఛాంపియన్ అవ్వాలని శబరిమల యాత్ర చేస్తున్నానని చెబుతున్న పటాస్ ప్రశీత్ అనే ఈ ఆర్సిబి డై హార్డ్ ఫ్యాన్ వీడియోపై నెటిజన్లు తమకు నచ్చినట్లు కామెంట్లు ఇంకా పెడుతున్నారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం మూడుసార్లు ఫైనల్ చేరింది. అలాగే మరో ఆరుసార్లు ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించింది. కాని కప్ మాత్రం అందని ద్రాక్షలానే మారింది. గత ఐదు సీజన్లలో ఆర్సిబి 4 సార్లు ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించింది. ఇక 2023 ఐపీఎల్ సీజన్ లో ఆరో స్థానంలో నిలిచి తృటిలో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ఆర్సిబి జట్టుకు 9 సీజన్లకు కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ.. 2021 ఐపిఎల్ సీజన్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.2022 ఐపీఎల్ సీజన్ నుండి ఫాఫ్ డూప్లెససిస్ ఈ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
Fan Spotted Dipping RCB Jersey During Maha Kumbh Mela 2025
View this post on Instagram
RCB-fan-sabarimala-yatra-to-win-rcb-cup-in-ipl-2025
View this post on Instagram
ఇక 2025 సీజన్ కి సంబంధించి ఆర్సిబి ఎక్కువగా సీనియర్ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించకుండా.. యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపింది. భువనేశ్వర్ కుమార్, లుంగీ ఎంగిడి, జోష్ హేజిల్ వుడ్ వంటి కీలక ప్లేయర్లను ఆర్ సి బి ఈ సీజన్ లో దక్కించుకుంది. ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఆర్సిబి.. 2025 మెగా వేలంలోకి 83 కోట్లతో అడుగుపెట్టింది. ఇందులో యువ ఆటగాళ్లకి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది.