ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Maha Kumbh mela) అంగరంగ వైభవంగా జరుగుతోంది.అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani), భార్య ప్రీతీ అదానీ (అదానీ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్), కుమారుడు కరణ్ అదానీ (అదానీ పోర్ట్స్ అండ్ SEZ లిమిటెడ్ ఎండీ)తో కలిసి మహాకుంభమేళాలో పాల్గొన్నారు.గంగ, యమున, సరస్వతి నదుల సంగమంలో అదానీ కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించింది.మహాకుంభ మేళాలో ప్రముఖ ఆధ్యాత్మిక సేవా సంస్థ ‘ఇస్కాన్’, అదానీ గ్రూప్‌తో కలిసి ప్రతినిత్యం లక్షమంది భక్తులకు భోజనాలు సమకూరుస్తోంది. తమ శిబిరాల్లో ఈ భోజనాలు వండి ప్రయాగ్‌రాజ్‌లోని కేంద్రాలకు చేరవేస్తోంది. ఆహారం పంపిణీకి అదానీ గ్రూపు వంద వాహనాలు, వాలంటీర్లను సమకూర్చింది.
అమెరికాలో టిక్‌టాక్ ఈజ్ బ్యాక్, నిషేధించిన 24 గంటల్లోనే తమ సేవలను పునరుద్ధరించిన బైట్‌డ్యాన్స్
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కుమారుడు జీత్ వివాహం వచ్చే నెలలో జరగనుంది. జీత్ అదానీ 7 ఫిబ్రవరి 2025న దివా షాను వివాహం చేసుకోనున్నారు. ఫిబ్రవరి 7న తన కుమారుడి వివాహాన్ని అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన వెంట ఆయన భార్య ప్రీతి అదానీ, కుమారులు కరణ్, జీత్, కోడలు పరిధి, మనవరాలు కావేరి ఉన్నారు.
Jeet Adani and Diva Shah Wedding Date
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)