Travel

Tirumala Update: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ... వారాంతం కావడంతో తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. సర్వదర్శనానికి 24 గంటల సమయం.. పూర్తిగా నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం ఏడు కొండల శ్రీవారు స్వయంగా కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వారాంతం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నుంచి ఇక్కడ భారీ రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.

TTD UPI Payments: శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ ఆలయాలలో యూపీఐ చెల్లింపులకు ఏర్పాట్లు.. టీటీడీ స్థానిక ఆలయాలతో పాటు ఉపఆలయాల్లో కూడా..

Rudra

శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్థానిక ఆలయాలతో పాటు ఉప ఆలయాల్లో యూపీఐ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నారు.

Huge Rush at Tirumala Temple: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ, దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు

Hazarath Reddy

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. తొలి ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగానే క్యూ కట్టారు. దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3గంటలు సమయం పడుతోంది.

Char Dham Yatra: చార్ ధామ్ యాత్రకు బ్రేక్.. వర్షం, మంచు కురుస్తున్న నేపథ్యంలో విరిగిపడుతున్న కొండ చరియలు.. యాత్రను ఆపేయాలంటూ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలు

Rudra

చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra)కు వెళ్లిన భక్తులకు (Devotees) తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాతావరణం ప్రతికూలంగా మారిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా చార్ ధామ్ యాత్రను నిలిపివేశారు.

Advertisement

Jagannath Rath Yatra: వీడియో ఇదిగో, 250 కొబ్బరికాయలతో జగన్నాథ రథయాత్ర శిల్పం, సముద్ర తీరంలో అద్భుతాన్ని సృష్టించిన సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌

Hazarath Reddy

జగన్నాథుని రథయాత్ర పూరీలో ఘనంగా ప్రారంభమైంది. భక్తులు తండోపతండాలుగా ఆలయాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన సైకత శిల్పి (Sand artist) సుదర్శన్‌ పట్నాయక్‌ (Sudarsan Pattnaik).. సముద్ర తీరంలో ఓ అద్భుతాన్ని సృష్టించారు

Jagannath Rath Yatra 2023: జై జగన్నాథ నినాదాలతో హోరెత్తిన పూరీ నగరం, ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథుడి రథయాత్ర, హింస కారణంగా మణిపూర్‌లో జగన్నాథ రథయాత్ర రద్దు

Hazarath Reddy

ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్ర మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. జగన్నాథుని రథయాత్ర సందర్భంగా పూరీ నగరం భక్తులతో నిండిపోయింది. ఒడిశాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు

Kalyanam at Yellamma Devasthanam: కన్నుల పండువగా బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత.. వీడియో ఇదిగో

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం నేడు. ఈ సందర్భంగా మంగళ, బుధవారాల్లో ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు వివరించారు. మంగళవారం కల్యాణోత్సవం, బుధవారం రథోత్సవ కార్యక్రమాలుంటాయని తెలిపారు. కళ్యాణం సందర్భంగా సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

TTD Key Decisions: తిరుమలలో రూ.14 కోట్లతో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణం, రూ.1 కోటి 28 లక్షలతో వసతి గృహాల ఆధునీకరణ, టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

తిరుమలలో రూ. 4 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రూ. 1 కోటి 28 లక్షలతో వసతి గృహాల ఆధునీకరించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సోమవారం సమావేశమైంది. సమావేశ తీర్మానాలను టీటీడీ ఛైర్మన్ మీడియాకు వెల్లడించారు.

Advertisement

5000 Pictures of Lord Hanuman: భక్తి అంటే ఇదే.. 10 ఏళ్ళ నుంచి 5000 హనుమాన్ చిత్రాలను సేకరించిన అఖిలేష్ శర్మ, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం

Hazarath Reddy

హనుమంతుని భక్తిలో ఎంతగానో మునిగిపోయిన అఖిలేష్ శర్మ 'బజరంగబలి' యొక్క 5000 చిత్రాలను (ప్రత్యేక ఫోటోలు) సేకరించి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు.

Balkampet Yellamma Kalynam: నేటి నుంచి 3 రోజుల పాటు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు, హైదరాబాద్‌లో ఈ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు

Hazarath Reddy

సోమవారం ఎదుర్కోళ్లు, మంగళవారం ఎల్లమ్మ కల్యాణం, బుధవారం రథోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎస్‌ అన్నపూర్ణ తెలిపారు.ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.

Ireland Offer: ఐర్లాండ్‌ దేశం బంపరాఫర్, ఆ దేశంలో సెటిల్ అయితే రూ.71 లక్షలు మీ చేతికి, ఉద్యోగం కూడా చూపిస్తుంది, కండిషన్స్ అప్లై మరి..

Hazarath Reddy

యూరప్ దేశం ఐర్లాండ్ తమ దేశంలో స్థిరపడాలనుకునే వారికి బంపరాఫర్ ప్రకటించింది. తమ దేశానికి వచ్చి స్థిరపడితే రూ.71 లక్షలతో (Irish government Will Pay You Rs 71 Lakh) పాటు..ఆ దేశానికి వెళ్లిన వాళ్లకు రిలోకేషన్‌ డబ్బులు ఇవ్వడమే కాకుండా ఉద్యోగం కూడా వెతికిపెడతామని తెలిపింది.

Tirupati Fire: గోవిందరాజుస్వామి రథం అగ్నికి ఆహుతి వార్తలను ఖండించిన టీటీడీ, సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని వెల్లడి

Hazarath Reddy

తిరుపతిలో లావణ్య ఫోటో ప్రేమ్స్‌ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గోవిందరాజుస్వామి వారి రథం అగ్నికి ఆహుతి అయినట్లు వస్తున్న వార్తలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఖండించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేసింది

Advertisement

Ramayana: రావణుడు సీతను ఒక్కరోజు కూడా తాకకపోవడానికి కారణం ఏంటి? శ్రీరామునికి భయపడ్డాడా లేక శాపానికి గురవుతాడని భయమా..

Hazarath Reddy

రాముడు, లక్ష్మణుడు మరియు సీత అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు లంకా పాలకుడు రావణుడు సీతను అపహరించి 2 సంవత్సరాలు బందీగా ఉంచాడు. రావణుడు సీత అందానికి మోహింపబడి ఆమెను కిడ్నాప్ చేసి తన అశోకవనంలో ఉంచుతాడు,

Vastu Tips: వాస్తు ప్రకారం ఈ శివుని ఫోటో ఇంట్లో పెట్టకూడదు, అలాగే ఇంటికి ఉత్తరం వైపున మాత్రమే శివుని విగ్రహం లేదా చిత్రపటం పెట్టాలి

Hazarath Reddy

శివుని నివాసం అంటే కైలాస పర్వతం ఉత్తర దిశలో ఉంది. అందుకే ఇంటికి ఉత్తరం వైపున శివుని విగ్రహం లేదా చిత్రపటం పెట్టాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, అలాంటి మూర్తిని లేదా కోపిష్టి భంగిమలో ఉన్న శివుని విగ్రహాన్ని ఇంట్లో ఎప్పుడూ ప్రతిష్టించకూడ

Tirumala Balaji Temple in Navi Mumbai: ముంబైలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భూమిపూజ చేసిన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి నవీ ముంబైలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు భూమిపూజ చేశారు. వీడియో ఇదిగో..

Uttarakhand Temples New Rule: ఉత్తరాఖండ్ దేవాలయాల్లో డ్రస్ కోడ్ అమల్లోకి, మహిళలు పొట్టి బట్టలు ధరించి వెళితే ఇకపై నో ఎంట్రీ

Hazarath Reddy

ఉత్తరాఖండ్ | రాష్ట్రంలోని మూడు దేవాలయాల్లో మహిళలు, బాలికలకు డ్రెస్‌ కోడ్‌ను అమలు చేశారు. మహిళలు, బాలికలు పొట్టి బట్టలు ధరించి, మహానిర్వాణి అఖర్ పరిధిలోకి వచ్చే మూడు దేవాలయాలలోకి ప్రవేశించలేరు.

Advertisement

3D Printed Temple in Siddipet: సిద్ధిపేటలో త్రీడీ ప్రింటెడ్ ఆలయం.. బూరుగుపల్లిలో సిద్ధమవుతున్న ఆలయం.. రోబో సాయంతో మూడు భాగాలుగా ఆలయ నిర్మాణం.. ప్రపంచంలో తొలి త్రీడీ ప్రింటెడ్ ఆలయం ఇదేనన్న కంపెనీ

Rudra

చోళ, పాండ్య, కాకతీయ రాజుల కాలాల్లోని అబ్బురపడే ఆలయ నిర్మాణాకృతులను చూసి అబ్బురపడటం తెలిసిందే. ఇప్పుడు సిద్దిపేట శివారులో త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో ఓ ఆలయం రూపుదిద్దుకుంటోంది. సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లిలోని ఓ టౌన్‌షిప్‌లో అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది.

Landslide in Uttarakhand: చార్‌ధామ్‌ వద్ద కొండచరియల బీభత్సం, చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు, 100 మీటర్ల మేర కొట్టుకుపోయిన రోడ్డు

Hazarath Reddy

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని చార్‌ధామ్‌ యాత్రలో కొండచరియలు విరిగిపడటంతో 300 మంది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వాటి వల్ల రాష్ట్రంలోని పితోరాగఢ్‌ జిల్లాలోని లఖన్‌పుర్ సమీపంలోని లిపులేఖ-తవఘాట్‌ రహదారి 100 మీటర్ల మేర కొట్టుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

Khairatabad Ganesh Idol: ఈ ఏడాది ఖైరతాబాద్‌ వినాయకుడు 61 అడుగులు, గతేడాది కంటే అడుగు ఎక్కువ, ప్రారంభమైన విగ్రహ తయారీ పనులు

Hazarath Reddy

గత ఏడాది 60 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌ మహాగణపతి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 61 అడుగులతో భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు బుధవారం నిర్వహించిన కర్రపూజా కార్యక్రమంలో తెలిపారు.

No RSS in Temple Premises: ఆరెస్సెస్‌కు షాకిచ్చిన కేరళ ప్రభుత్వం, 1200 దేవాలయాల్లో అడుగుపెట్టడానికి వీల్లేదని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ఉత్తర్వులు

Hazarath Reddy

కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలోని దేవాలయాల ఆవరణలో ఆరెస్సెస్‌ (రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌) శాఖా సమావేశాలు, సాయుధ శిక్షణ, మాస్‌ డ్రిల్స్‌ నిర్వహించడాన్ని నిషేధిస్తూ కేరళలోని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

Advertisement
Advertisement