యాత్ర
Kumbh Mela 2021: ఏప్రిల్ 1 నుంచి కుంభమేళా, కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కేవలం 30 రోజులు మాత్రమే జరగనున్న జాతర, యాత్రికులకు కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి
Team Latestlyకుంభమేళాకి హాజరయ్యే యాత్రికులకు పాస్ తప్పనిసరి అని పేర్కొన్నారు. కుంభమేళాలో పాల్గొనదలిచే యాత్రికులు తప్పనిసరిగా RT-PCR పరీక్ష చేసుకోవాలని.. కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తో పాటు, ఇతర మెడికల్ సర్టిఫికేట్లు మరియు గుర్తింపు కార్డు ద్వారా పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.....
Wildlife Safari: పునరుజ్జీవం పొందుతున్న పర్యాటక రంగం, ప్రకృతి ప్రేమికులకు మళ్లీ మంచి రోజులు, తెలంగాణలోని టైగర్ రిజర్వ్ సఫారీ ఏడాది విరామం తర్వాత పున:ప్రారంభం
Team Latestlyతెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో ఉత్కంఠభరితమైన జంగల్ సఫారీ ఏడాది విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది. ఇప్పుడు మరిన్ని కొత్త హంగులు మరియు అదనపు సౌలభ్యాలతో ప్రకృతి ప్రేమికులను గతంలో కంటే ఎక్కువ ఆకర్శించేందుకు సిద్ధమైంది....
Dial Your EO Program: శ్రీవారి భక్తులకు శుభవార్త, తెరుచుకోనున్న వైకుంఠ ద్వారం తెలుపులు, డిసెంబ‌రు 25 నుండి జ‌న‌వ‌రి 3వ తేదీ వ‌ర‌కు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌భాగ్యం, రోజుకు 20 వేలు చొప్పున ఆన్‌లైన్‌లో ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల‌ు విడుద‌ల
Hazarath Reddyతిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని వైకుంఠ ద్వారం తలుపులు తెరుచుకోనున్నాయి. వైకుంఠ ఏకాద‌శి (Vaikuntha Ekadashi) సంద‌ర్భంగా డిసెంబ‌రు 25 నుండి జ‌న‌వ‌రి 3వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు వైకుంట ద్వారం తలుపులు (Vaikuntha Gate of Srivari Temple) తెరిచి ఉంచి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌భాగ్యం క‌ల్పిస్తామని టీటీడీ ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి (TTD EO Dr. KS Jawahar Reddy) తెలిపారు.
International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం మరోసారి పొడగింపు, కార్గో విమానాలు మరియు ఇప్పటికే షెడ్యూల్ చేయబడిన సర్వీసులకు నిషేధం వర్తించదని స్పష్టతనిచ్చిన డీజీసీఏ
Team Latestlyఏవిషేషన్ అథారిటీ గత వారం మాట్లాడుతూ, ఈ శీతాకాలం సీజన్ లో వారానికి 12,983 దేశీయ విమాన సర్వీసులకు అనుమతిని ఇచ్చినట్లు తెలిపింది. కొవిడ్ లేనినాటి పరిస్థితులతో పోల్చితే దాదాపు 55 శాతం సర్వీసులను దేశీయ రూట్లలో నడుపుకునేందుకు అవకాశం కల్పించినట్లు....
Good News for Araku Tourists: అరకు రైలుకు మరిన్ని విస్టాడోమ్‌ కోచ్‌లు, ఎంపీ విజయసాయిరెడ్డికి రైల్వే మంత్రి లేఖ, విశాఖ-అరకు రైలు మార్గంలో అందుబాటులోకి..
Hazarath Reddyఅరకు లోయ అందాలను వీక్షించాలనుకునే పర్యాటకులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌ (Good News for Araku Tourists) చెప్పింది. విశాఖపట్నం నుంచి సుందరమైన అరకులోయను సందర్శించే పర్యాటకుల కోసం త్వరలో మరిన్ని విస్టాడోమ్‌ (గ్లాస్‌టాప్‌) కోచ్‌లను (Vistadome coaches) ప్రవేశపెట్టబోతోంది. అరకు రైలుకు మరిన్ని విస్టాడోమ్ కోచ్‌లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డికి రైల్వే మంత్రి లేఖ రాశారు.
Srivari Brahmotsavam: సెప్టెంబర్ 19 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు, హాజరుకానున్న ఏపీ సీఎం వైయస్ జగన్, కర్ణాటక సీఎం బి.ఎస్.యడ్యూరప్ప, శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం
Hazarath Reddyతిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈసారి బ్రహ్మోత్సవాలకు (Srivari Brahmotsavam) భక్తులను అనుమతించడంలేదు. దాంతో ఈ వేడుకను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు (Tirumala Srivari Brahmotsavams) సీఎం జగన్ తో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప (ap-cm-jagan-karnataka-cm-yediyurappa) కూడా హాజరవుతున్నారు. ఏటా బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ.
Antarvedi Temple Chariot Fire: రూ. 90 లక్షలతో కొత్త రథం, అంతర్వేది రధం దగ్ధం ఘటనలో ఈవో సస్పెండ్, నిజాలను నిగ్గు తేల్చేందుకు అంతర్గత విచారణ కమిటీ, టీడీపీకి మాట్లాడే హక్కు లేదని తెలిపిన మంత్రి శ్రీనివాస్
Hazarath Reddyతూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన (Antarvedi Temple Chariot Fire) చాలా బాధాకరమని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. దేవ‌దాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ పెదపాటి అమ్మాజీతో క‌లిసి ఆయ‌న సోమవారం మాట్లాడారు. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో రథం దగ్ధం అయిన ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు.
Ayodhya Ram Mandir: రఘురాముడు నడయాడిన అయోధ్య వైపే అందరి చూపు, నేడు మధ్యాహ్నం రామ మందిర్ భూమిపూజ కార్యక్రమం, అద్భుత ఘట్టం మొత్తం ప్రత్యక్ష ప్రసారం
Hazarath Reddyదేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టానికి (Ram Mandir Bhumi Pujan) కొద్ది గంటల్లో పునాది రాయి పడనుంది. రఘురాముడి జన్మస్థలమైన అయోధ్యలో (Lord Rama Birth Place) రామాలయ నిర్మాణానికి నేడు మధ్యాహ్నం భూమిపూజ జరుగనుంది. ప్రధాని మోదీ (PM Modi) స్వయంగా హాజరై.. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకతో ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 44 నిమిషాల 40 సెకన్లదాకా.. అంటే 32 సెకన్లలోపు భూమి పూజ కార్యక్రమం పూర్తి కానుంది. ఇప్పటికే శంకుస్థాపనకు సన్నాహాలు పూర్తయ్యాయి. సోమవారమే మొదలైన పూజలు.. భూమిపూజతో బుధవారం మధ్యాహ్నం పూర్తి కానున్నాయి.
Padmanabhaswamy Temple: ఆరవ నేలమాలళిగను వారు తెరుస్తారా, అనంతపద్మనాభ స్వామి ఆలయ పాలనపై హక్కులు రాజకుటుంబానికి చెందుతాయని సుప్రీం తీర్పు
Hazarath Reddyతొమ్మిది సంవత్సరాలుగా కొనసాగుతున్న అనంతపద్మనాభ స్వామి (Sree Padmanabhaswamy Temple) ఆలయ నిర్వహణ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఆలయ మేనేజ్ మెంట్ వివాదంలో ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పును ప్రకటించింది. రాజకుటుంబానికి ఆలయ పాలనపై ఉన్న హక్కులను సమర్థించింది. ఈ క్రమంలోనే ఆలయానికి సంబంధించి పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. కొత్త కమిటీ ఏర్పాటు అయ్యే వరకు ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. స్టిస్ యూయూ లలిత్, జస్టిస్ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం ఈ స్పష్టమైన తీర్పు చెప్పింది.
AP Coronavirus Update: తిరుమలలో పది మందికి కరోనా, ఏపీలో తాజాగా 837 కేసులు నమోదు, రాష్ట్ర వ్యాప్తంగా 16,934కి చేరిన కోవిడ్-19 కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 837 కరోనా పాజిటివ్‌ కేసులు (AP COVID Report) నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 38,898 శాంపిల్స్‌ పరీక్షించగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో (Andhra Pradesh) 9,71,611 పరీక్షలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్‌ సోకింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 258 క్షేమంగా డిశ్చార్జ్‌ అయ్యారు. వైరస్‌ బారిన పడి 8 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,096 బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,934కి చేరింది.
TTD Darshan: శ్రీవారిని దర్శనానికి నేటి నుంచి 9 వేల టికెట్లు అందుబాటులోకి, ప్రత్యేక‌ ప్రవేశ ద‌ర్శన టికెట్ ధర రూ. 300, జూలై ఒకటి నుంచి రోజుకు 3,000 చొప్పున స‌ర్వ ద‌ర్శనం టోకెన్ల జారీ
Hazarath Reddyఅన్లాక్ 1.0 సమయంలో జూన్ 11 న తిరిగి తెరిచిన తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam), రోజువారీ దర్శనంలో భాగంగా కోటాను మరికొంత పెంచింది. ముందుగా 3000 మందికి మాత్రమే ప్రవేశం కల్పించగా ఆ తరువాత మరో 3000 మందికి అవకాశం కల్పించారు. ఇప్పుడు తాజాగా మరో 3 వేల మందికి అవకాశం కల్పించారు. ఆన్ లైన్ బుకింగ్ (online booking darshan quota) ద్వారా రోజుకు 9 వేల మంది తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం అధికారులు కల్పించారు.
Jagannath Rath Yatra 2020: నేటి నుంచి పూరీ జగన్నాథ రథయాత్ర, ప్రజలు లేకుండా జగన్నాథుడి ఊరేగింపు, యాత్ర సవ్యంగా సాగేందుకు ఆలయ యాజమాన్య కమిటీదే బాధ్యతన్న సుప్రీంకోర్టు
Hazarath Reddyపూరీ జగన్నాథ రథయాత్రపై (Jagannath Rath Yatra) విధించిన స్టేను సుప్రీం కోర్టు (Supreme court) ఎత్తేసింది. యాత్ర నిర్వహణకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. దీంతో సంప్రదాయం ప్రకారం జూన్‌ 23నే(మంగళవారం) రథయాత్ర జరుగనుంది. ఈ యాత్రలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనరాదని షరతు విధించింది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర (Jagannath Rath Yatra 2020) సవ్యంగా సాగేందుకు ఆలయ యాజమాన్య కమిటీదే బాధ్యతని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
Ratha Yatra (Puri): పూరి జగన్నాథ రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతి, జగన్నాథుడు రేపు బయటకు రాకుంటే 12 ఏళ్లు యాత్రకు దూరం అవుతాడని కోర్టుకు తెలిపిన సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా
Hazarath Reddyఎట్టకేలకు పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీం కోర్టు (Supreme Court) అనుమతి ఇచ్చింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు లేకుండా రథయాత్ర (Puri Rath Yatra 2020) జరుపుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. పూరీ రథయాత్ర విషయంలో రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. పూరీ జగన్నాథ రథయాత్రను నిలిపివేయాలని ఈ నెల 18న ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం సోమవారం విచారణ జరిపి ఈ మేరకు తీర్పును వెలువరించింది.
Puri Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రపై సుప్రీంకోర్టు స్టే, కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో శ్రీ జగన్నాథ్ టెంపుల్ యాత్రతో పాటు ఇతర రథయాత్రలు నిర్వహించకూడదని ఒడిశా ప్రభుత్వానికి ఆదేశాలు
Hazarath Reddyజూన్‌ 23న ప్రారంభం కానున్న చారిత్రక పూరి జగన్నాథ్‌ రథయాత్ర (Jagannath Rath Yatra in Puri 2020), దాని అనుబంధ కార్యకలాపాలను కోవిడ్‌ కారణంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కరోనా వైరస్ కారణంగా రథయాత్రకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిలిపివేయాలని పేర్కొంది. ప్రజారోగ్యం, పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పూరీలోని జగన్నాథస్వామి రథయాత్రకు (Puri Rath Yatra) అనుమతించబోమని సుప్రీంకోర్టు స్పష్టం (Supreme Court stays) చేసింది.
Tirumala Temple Darshan: భక్తులతో పోటెత్తిన తిరుమల, 30 గంటల్లో 60 వేల టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు, అలిపిరి వద్ద భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌
Hazarath Reddyతిరుమల ఆలయంలో భక్తులకు శ్రీవారి దర్శనం ప్రారంభమయ్యింది. మూడు రోజుల ట్రయల్ రన్‌ తర్వాత భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు దర్శనం కల్పించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 3 వేల మందికి శ్రీవారి దర్శనభాగ్యం కలుగనుంది. టైం స్లాట్ టోకెన్ల ద్వారా మరో 3 వేల మందికి శ్రీవారి దర్శనాన్ని చేసుకున్నారు. 53 మందికి వీఐపీ టిక్కెట్ల ద్వారా టీటీడీ దర్శనం కల్పించింది. టీటీడీ సిబ్బంది అలిపిరి వద్ద భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నారు. టికెట్లు ఉన్నవారినే మాత్రమే దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతిస్తున్నారు.
Kanaka Durga Temple: జూన్ 10 నుంచి భక్తులకు దుర్గమ్మ దర్శనం, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనాలు
Hazarath Reddyఅన్‌లాక్ 1 నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఏపీలో ఆలయాలు (temples Reopen in AP) తెరుచుకున్నాయి. ప్రధాన ఆలయాల్లో రెండు రోజుల ట్రయిల్ రన్ తర్వాత భక్తులకు దైవ దర్శనం కల్పించనున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో (Kanaka Durga Temple) భక్తుల దర్శనానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూన్ 10వ తేదీ ఉదయం 6.30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు.
Unlock 1: దేశ వ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు,ప్రార్థనామందిరాలు, సర్వాంగ సుందరంగా ముస్తాబైన తిరుమల, కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyటి నుంచి దేశ వ్యాప్తంగా అన్ని ఆలయాలు (Religious Places Reopen Across India) తెరుచుకోనున్నాయి. లాక్ డౌన్ 5 అమలులో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి మినహాయింపులు ఇచ్చింది. దీంతో నేటి నుంచి ఆలయాలుదర్శనానికి భక్తులకు అనుమతి (Devotees Offer Prayers at Temples) ఇచ్చారు దేవాలయాలు, మసీదులు, చర్చిలు (Churches, Mosques) నేటి నుంచి తెరుచుకోనున్నాయి.అయితే అన్ని చోట్ల పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. ప్రధాన ఆలయాల్లో ముందుగా రెండు రోజుల పాటు ఆలయ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత సామాన్య భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆలయాలు నేటి నుంచి తెరుచుకున్నాయి.
TTD Darshan Tickets: జూన్ 8 నుంచి శ్రీవారి దర్శనం టికెట్లు బుకింగ్, ఈ నెల11 నుంచి భక్తులకు దర్శనం, ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపిన ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌
Hazarath Reddyలాక్‌డౌన్‌ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో 2 నెలలకు పైగా నిలిచిపోయిన భక్తుల దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తిరిగి పునఃప్రారంభిస్తోంది. ఆలయ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 8 నుంచి ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆన్‌లైన్‌లో రోజుకు మూడు వేల టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.
Tirumala Srivari Darshan: శ్రీవారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, జూన్ 8న తెరుచుకోనున్న శ్రీవారి ఆలయ తలుపులు, ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ అధికారులు
Hazarath Reddyకోవిడ్ 19 లాక్ డౌన్ కారణంగా రెండునెలలకు పైగా నిలిచిపోయిన తిరుమల శ్రీవారి దర్శనాలు (Tirumala Sri vari Darshan) తిరిగి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం (AP Govt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనావైరస్‌ (Coronavirus) వ్యాప్తి నేపథ్యంలో ఆరడుగుల భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్‌ రన్‌ నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు టీటీడీ ఈవో రాసిన లేఖకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
TTD Properties Row: టీటీడీ ఆస్తులను అమ్మే ప్రసక్తే లేదు, ముగిసిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం, పలు కీలక నిర్ణయాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
Hazarath Reddyతిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (Tirumala Tirupati Devasthanam Board) సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో టీటీడీ పాలక మండలి (TTD Board) కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా టీటీడీ భూములు (TTD Properties) విక్రయించొద్దని నిర్ణయం తీసుకుంది. అలాగే టీటీడీ ఆస్తులు, కానుకలు విక్రయించకూడదని నిర్ణయించింది. ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అనుణంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. టీటీడీ భూములు, ఆస్తులు ఎట్టి పరిస్థితిల్లో అమ్మేదిలేదని స్పష్టం చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమావేశమైంది.