Viral
H-1B Visa Fee Hike: హెచ్‌1బీ వీసా ఫీజు భారీగా పెంపు.. 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు.. కొత్త ఫీజులు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి..
Rudraఉద్యోగాలు, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లాలని భావిస్తున్నవారికి అగ్రరాజ్యం ఊహించని ఝలక్ ఇచ్చింది. హెచ్‌-1బీ, ఎల్‌-1, ఈబీ-5 లాంటి వివిధ క్యాటగిరీల వలసేతర (నాన్‌-ఇమ్మిగ్రెంట్‌) వీసా ఫీజులను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది.
Rahul Gandhi on His Marriage: వీడియో ఇదిగో, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు, రాహుల్ గాంధీని అడిగేసిన ఆరేళ్ల బుడ్డోడు, ఆయన సమాధానం ఏంటంటే..
Hazarath Reddyకాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర సాగుతున్న బీహార్‌లోని కిషన్‌గంజ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ పర్యటనలో రాహుల్ గాంధీని ఆరేళ్ల బుడ్డోడు మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగాడు.దీనికి రాహుల్ గాంధీ సరదా సమాధానం ఇచ్చారు.
Viswambhara Update: వీడియో ఇదిగో, జిమ్‌లో చెమటలు పట్టేలా వ్యాయామం చేస్తున్న చిరంజీవి, విశ్వంభర చిత్రంలో సరికొత్త లుక్‌తో రానున్న మెగాస్టార్
Hazarath Reddyమెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో 156వ చిత్రం 'విశ్వంభర' చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే.ఈ చిత్రం కోసం చిరంజీవి జిమ్ లో చెమటోడ్చుతున్నారు. జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Gyanvapi Mosque Case: వీడియో ఇదిగో, జ్ఞాన‌వాపీ మ‌సీదులో 30 ఏళ్ళ తర్వాత ప్రారంభమైన శివ‌పూజ‌లు, భక్తులతో పోటెత్తిన వ్యాస్ కా తెహ్‌ఖానా ఆలయం
Hazarath Reddyజ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో హిందువులకు పూజలు చేసేందుకు వారణాసి కోర్టు అనుమతించడంతో, వారణాసిలోని కాంప్లెక్స్‌లోని 'వ్యాస్ కా తెహ్‌ఖానా'లో ప్రార్థనలు చేసేందుకు భక్తులు పోటెత్తారు.
Sachin Tendulkar: వీడియో ఇదిగో, రోడ్డు మీద వెళుతున్న అభిమానిని పిలిచి సర్ ప్రైజ్ చేసిన సచిన్, తమ దేవుడిని రోడ్డు మీద చూడగానే అ అభిమాని రియాక్షన్ ఏంటంటే..
Hazarath Reddyసచిన్ టెండూల్కర్ ఎక్స్ ద్వారా ఒక ఆసక్తికర వీడియోను పంచుకున్నాడు. 'సచిన్ ఇవాళ టెండూల్కర్ ను కలిశాడు' అంటూ తన పోస్టుకు హెడ్డింగ్ పెట్టారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే... సచిన్ కారులో వెళుతుండగా, టెండూల్కర్ అనే పేరుతో ఉన్న నెం.10 ముంబయి ఇండియన్స్ జెర్సీని ధరించి బైక్ పై అదే రూట్లో ఓ వ్యక్తి వెళ్లడం చూడొచ్చు.
Honour Killing in Tamil Nadu: తమిళనాడులో పరువు హత్య కలకలం, అక్కను, ఆమె ప్రియుడి తలను కత్తితో దారుణంగా నరికిన తమ్ముడు
Hazarath Reddyతమిళనాడులోని తిరుమంగళం సమీపంలోని కొంబాడి గ్రామంలో మంగళవారం రాత్రి 22 ఏళ్ల యువకుడు తన అక్కను, ఆమె ప్రియుడిని దారుణంగా హత్య చేశాడు. ఎ ప్రవీణ్ కుమార్ అనే నిందితుడు వారి సంబంధాన్ని వ్యతిరేకించాడు. మానుకోవాలని ఇద్దరినీ చాలాసార్లు హెచ్చరించాడు.
HC on Adultery: వ్యభిచారం ఆరోపణలు, భార్యా పిల్లల రక్త నమూనాలను సేకరించాలనే భర్త పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
Hazarath Reddyఅజోస్పెర్మియా (పురుషుల వంధ్యత్వానికి సంబంధించిన ఒక రూపం)తో బాధపడుతున్నట్లు పేర్కొంటూ, పిల్లల పితృత్వాన్ని పరీక్షించేందుకు అతని భార్య మరియు మైనర్ పిల్లల రక్త నమూనాలను కోరిన వ్యక్తి చేసిన అభ్యర్థనను జనవరి 31, బుధవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
Video: ఫుల్లుగా తాగి ఇంటిదగ్గర దింపమని అంబులెన్స్‌కు కాల్ చేసిన మందుబాబు, లేదంటే స్పృహతప్పి పడిపోతానంటూ వాదన, వీడియో ఇదిగో..
Hazarath Reddyరమేష్ అనే వ్యక్తి ఫుల్లుగా తాగేసి భువనగిరి నుండి జనగాంకు నడుచుకుంటూ వెళ్తూ అంబులెన్స్‌కు కాల్ చేసాడు.. అవాక్కైన సిబ్బంది ఎందుకు కాల్ చేసావని అడగగా నడవలేకపోతున్నా, బస్సులు కూడా లేవు, నన్ను జనగాంలో దింపండి లేదంటే స్పృహతప్పి పడిపోతానేమో అంటూ వాదించాడు.
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలోకి దూసుకొచ్చిన విరాట్ కోహ్లీ, అగ్రస్థానంలో కొనసాగుతున్న కేన్ విలియమ్సన్, బౌలింగ్ ర్యాంకుల్లో నెంబర్ వన్ గా అశ్విన్
Hazarath Reddyఅంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసింది. బ్యాటింగ్ ర్యాంకుల్లో విరాట్ కోహ్లీ ఒక స్థానం ఎగబాకి ఆరో ర్యాంకుకు చేరాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు.
LPG Price Hike: సామాన్యులకు భారీ షాక్, రూ. 14 పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర, ఢిల్లీలో రూ.1,769.50కి చేరుకున్నగ్యాస్ బండ ధర
Hazarath Reddyమధ్యంతర బడ్జెట్ సమావేశాలకు ముందే సామాన్యులకు షాక్ తగిలింది. దేశ వ్యాప్తంగా ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్ పై రూ. 14 పెంచారు. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,769.50కి చేరుకుంది. స్థానిక పన్నులను బట్టి ఈ ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది
Union Budget 2024: దిగుమతి సుంకాలతో సహా ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు ఒకే పన్ను రేట్లు, బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyపార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2020-25 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.."దిగుమతి సుంకాలతో సహా ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులకు ఒకే పన్ను రేట్లను కొనసాగించాలని నేను ప్రతిపాదిస్తున్నాను" అని FM అన్నారు.
Hit And Run Case: జూబ్లీహిల్స్ లో మరో హిట్ అండ్ రన్ వీడియో ఇదిగో, బైకులను ఢీకొట్టి బీభత్సం సృష్టించిన వైట్ డెకో స్పోర్ట్స్ కారు, ముగ్గురుకి తీవ్ర గాయాలు
Hazarath Reddyజూబ్లీహిల్స్ లో మరో హిట్ అండ్ రన్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో వైట్ డెకో స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగాంగా వెళ్లి ఎదురుగా ఉన్న రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్నాచెల్లితో పాటు మరో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
Hackers-ChatGPT: కొత్త మార్గంలో డేటాను దొంగిలిస్తున్న హ్యాకర్లు, ChatGPT సాయంతో 48 మిలియన్లకు పైగా కస్టమర్ల వ్యక్తిగత సమాచారం హ్యాక్
Hazarath Reddyఅద్దె కార్ల దిగ్గజం యూరోప్‌కార్ నుండి దొంగిలించబడిన డేటా యొక్క కాష్‌ను క్లెయిమ్ చేసిన నకిలీ డేటా ఉల్లంఘనను ప్రోత్సహించడానికి హ్యాకర్లు ChatGPTని ఉపయోగించారు. 48 మిలియన్లకు పైగా యూరోప్‌కార్ కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించారని పేర్కొన్నారు. హ్యాక్ చేసిన డేటాను అమ్ముతామని కూడా బెదిరించారు
Interim Budget 2024-25: దేశీయ టూరిజం రంగంలో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు 11.11 లక్షల కోట్లకు పెంచాం, బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
Hazarath Reddyపార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2020-25 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..FY25లో మౌలిక సదుపాయాల కోసం వెచ్చించడాన్ని 11.11 లక్షల కోట్ల రూపాయలకు పెంచామని FM సీతారామన్ చెప్పారు.
50-Year Interest Free Loan for Youth: టెక్నాలజీ రంగంలో ఉన్న యువతకు కేంద్రం గుడ్ న్యూస్, 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణంతో రూ.1 లక్ష కోట్ల కార్పస్ ఏర్పాటు
Hazarath Reddy50 ఏళ్ల వడ్డీ లేని రుణంతో రూ. 1 లక్ష కోట్ల కార్పస్ ఏర్పాటు చేయబడుతుంది. ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది. తక్కువ లేదా నిల్ వడ్డీ రేట్లతో ఫైనాన్సింగ్ లేదా రీ-ఫైనాన్సింగ్ సౌకర్యం ఉంటుందని మంత్రి తెలిపారు.
Free Electricity For Households: బడుగు జీవులకు కేంద్రం శుభవార్త, రూఫ్-టాప్ సోలారైజేషన్ ద్వారా కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్, ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఫ్రీ
Hazarath Reddyపార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2020-25 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రూఫ్-టాప్ సోలారైజేషన్ ద్వారా, 1 కోటి గృహాలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందగలుగుతాయి.
Pradhan Mantri Awaas Yojana: నిరుపేదలకు మోదీ సర్కారు గుడ్ న్యూస్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరో 2 కోట్ల ఇళ్లకు గ్రీన్ సిగ్నల్
Hazarath Reddyప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అమలు కొనసాగింది. మేము 3 కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి దగ్గరగా ఉన్నాము. కుటుంబాల సంఖ్య పెరగడం వల్ల ఉత్పన్నమయ్యే అవసరాలను తీర్చడానికి రాబోయే 5 సంవత్సరాలలో 2 కోట్ల ఇళ్లు నిర్మించబడతాయని మంత్రి తెలిపారు.
Union Budget 2024: స్కిల్ ఇండియా మిషన్ ద్వారా 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ, పార్లమెంట్‌లో కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
Hazarath Reddyకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, "స్కిల్ ఇండియా మిషన్ 1.4 కోట్ల మంది యువతకు శిక్షణనిచ్చింది, 54 లక్షల మంది యువతకు నైపుణ్యం మరియు తిరిగి నైపుణ్యం కల్పించింది. 3000 కొత్త ITIలను స్థాపించింది. పెద్ద సంఖ్యలో సంస్థాగత ఉన్నత విద్య కోసం 7 IITలు, 16 IIITలు, 7 IIMలు, 15 AIIMS మరియు 390 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి.
RBI Action Against Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీవ్ర చర్యలకు ఉపక్రమించిన ఆర్బీఐ, ఫిబ్రవరి 29వ తేదీ నుంచి ఈ సేవలు నిలిపివేయాలని ఆదేశాలు
Hazarath Reddyరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆ సంస్థకు (RBI Action Against Paytm) ఆదేశాలు జారీ చేసింది.
Wipro Layoffs 2024: మళ్లీ లేఆప్స్ షురూ చేసిన విప్రో, వందలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyసాఫ్ట్‌వేర్ దిగ్గజం విప్రో సంస్థ తన మార్జిన్‌లను మెరుగుపరుచుకోవడంతో వందలాది మిడ్ లెవల్ ఉద్యోగాలను తగ్గించే అవకాశం ఉందని మీడియా పేర్కొంది.