హీరో విశాల్ (Vishal) ప్రధాన పాత్రలో నటించిన మదగజరాజ మూవీ (Madha Gaja Raja Movie) షూటింగ్ 2012లోనే పూర్తయిన సంగతి తెలిసిందే, అయితే పలు కారణాల వల్ల ఎన్నో ఏళ్లుగా విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 12న రిలీజ్ అవుతోంది. తాజాగా చెన్నైలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ చేశారు. ఈ కార్యక్రమానికి పంచెకట్టులో హాజరైన విశాల్ బక్కచిక్కిపోయి దీన స్థితిలో కనిపించాడు. మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే చేతులు, గొంతు వణుకుతోంది. ఆయన కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని.. దానివల్లే శరీరం, గొంతు వణుకుతోందని పలువురు చెప్తున్నారు. తన ఆరోగ్య పరిస్థితిని లెక్క చేయకుండా విశాల్ ఈవెంట్‌కు వచ్చాడని తెలుసుకున్న అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో తన సినిమా కోసం ఈవెంట్‌కు రావడం చిన్న విషయం కాదని, అతడి అంకితభావాన్ని మెచ్చుకోవాల్సిందేనని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో మోహన్‌బాబు పిటిషన్, విచారణకు స్వీకరించిన ధర్మాసనం, తదుపరి విచారణ గురువారానికి వాయిదా
Hero Vishal Attends Event Amidst Illness
Actor @VishalKOfficial addressed the fans and media at the audio launch of the long-awaited film Madha Gaja Raja.
📸 @manivasagan_ #DTNext #Madhagajaraja #AudioLaunch #Vishal #VijayAntony #SundarC #Kushboo #TamilCinema #Kollywood #CinemaUpdate #MovieUpdate pic.twitter.com/HlhpfcNtjn
— DT Next (@dt_next) January 6, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)