Allu Arjun Pushpa 2 The Rule Trailer release(X)

Hyderabad, JAN 05: ఐకాన్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) టైటిల్‌ రోల్‌లో నటించిన సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ పుష్ప 2 ది రూల్‌ (Pushpa 2 The Rule). సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వచ్చి రికార్డు వసూళ్లతో ట్రెండింగ్‌ టాపిక్‌గా నిలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన పుష్ప 2 ది రూల్‌ ఓపెనింగ్‌ డేనే జవాన్‌, ఆర్‌ఆర్‌ఆర్ రికార్డును (RRR Record) బద్దలు కొట్టి టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

Police Notices To Allu Arjun: అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు, కిమ్స్ ఆస్పత్రికి వెళ్తారన్న సమాచారంతో నోటీసులు ఇచ్చిన పోలీసులు...వివరాలివే 

కాగా ఈ చిత్రం ఖాతాలో అరుదైన ఫీట్‌ చేరిపోయింది. పుష్ప 2 ది రూల్‌ బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద రూ.806 కోట్లు గ్రాస్‌ వసూళ్లు చేసి నంబర్‌ 1 స్థానంలో నిలిచింది. 31 రోజుల్లో ఈ ఫీట్ నమోదు చేసి టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది.

Rare Feat By Allu Arjun Pushpa 2 The Rule

 

కాగా పుష్ప 2 ది రూల్‌ వరల్డ్‌వైడ్‌గా రూ.1,719 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా ఇంప్రెస్‌ చేసింది. సీక్వెల్‌లో ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు.