నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులను భారీ భూకంపం గజగజలాడించింది. మంగళవారం ఉదయం ఇక్కడ 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 53కి చేరింది. ఈ విపత్తు కారణంగా టిబెట్‌లో ఇప్పటివరకు కనీసం 53 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈమేరకు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. మరో 62 మంది గాయపడినట్లు తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

నేపాల్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌ పై భూకంప తీవ్రత 7.1గా నమోదు.. భారత్‌ లోనూ ప్రకంపనలు.. భయాందోళనలో జనం (వీడియో)

నేపాల్‌-టిబెట్‌ (Nepal-Tibet Border) సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచె ప్రాంతంలో మంగళవారం ఉదయం 6.35 గంటలకు ఈ భూకంపం సంభవించింది. టిబెట్‌లోని షిజాంగ్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్‌ అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం తర్వాత టిబెట్‌ రీజియన్‌లో మరో రెండుసార్లు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటి తీవ్రత 4.7, 4.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం ఉన్న టిబెట్‌ ప్రాంతంలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి.

Nepal Earthquake Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)