చిలీ, మయన్మార్ దేశాలలో భారీ భూకంపం వచ్చింది. చిలీలోని కలమాకు 84 కిలోమీటర్ల దూరంలోని అంటోఫగాస్టాలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైంది. 104 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు యురోపియన్ మెడిటెర్రేనియన్ సెస్మలాజికల్ సెంటర్(ఈఎమ్ఎస్సీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఇక మయన్మార్‌లో శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేల్‌పై 5.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. NCS ప్రకారం, 127 కిలోమీటర్ల లోతులో 10:02am (IST) సమయంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది అక్షాంశం 24.92 N మరియు రేఖాంశం 94.97 E వద్ద నమోదు చేయబడింది. భూకంపం కారణంగా జరిగిన ప్రాణ,ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల్లో నమోదైన భూకంపం దృశ్యాలను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భూకంపం ధాటికి భవనాలు కొద్ది సేపు అటు ఇటు ఊగుతుండడం ఆ వీడియోల్లో కనిపించింది.
అమెరికాలో భవనంపై కూలిన విమానం.. ఇద్దరు మృతి.. 18 మందికి గాయాలు (వీడియో)
Earthquake in Myanmar and Chile:
Another video of the M6.1 earthquake that hit Chile earlier....pic.twitter.com/w4FyDegf4n
— Volcaholic 🌋 (@volcaholic1) January 2, 2025
CCTV of the M6.1 earthquake in Chile a short while ago. That was a long one 👀pic.twitter.com/SvyBLoZZhU
— Volcaholic 🌋 (@volcaholic1) January 2, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)