pixabay

Food Tips: శరీరంలో రక్త తక్కువగా ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా పిల్లల్లో పెద్దల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. అయితే చాలామంది ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లోనే ఈజీగా ఒక రెసిపీని తయారు చేసుకోవడం ద్వారా ఇది ఒంట్లో రక్తాన్ని పెంచి రక్తహీనతను లేకుండా చేస్తుంది. అయితే ఈ రెసిపీని చాలా సింపుల్ గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు..

రాగి పిండి- 3స్పూన్స్

బీట్రూట్-2

కార్న్ ఫ్లోర్-1స్పూన్

నెయ్యి-3స్పూన్

జీడి పప్పు -10

బెల్లం- 100గ్రాములు

నీళ్లు- 1కప్

Health Tips: మండి ఆహారం తింటున్నారా దీని వల్ల కలిగే నష్టాలు 

తయారీ విధానం..

ముందుగా ఒక బీట్రూట్ ని తీసుకొని దాని తురుము తీసేసి సన్నగా తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. బెల్లం ని కూడా అదే విధంగా తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ తురుమును రాగి పిండిని మిక్సీలో వేసుకొని ముప్పావు కప్పు నీళ్లు పోసి మిక్సీ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో బీట్రూట్ మిశ్రమాన్ని వడకట్టాలి. ఇప్పుడు వడ కట్టిన దాంట్లో అర చెంచా కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో రెండు చెంచాల నెయ్యి వేసి జీడిపప్పులు వేసి రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో తురిమిన బెల్లాన్ని వేసుకొని కొంచెం నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు ఉంచాలి. బెల్లం కరిగిన తర్వాత దాంట్లో ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని వేయాలి. తర్వాత మంటను స్లిమ్ లో పెట్టుకొని మిశ్రమం చిక్కబడే వరకు ఉంచాలి. ఇందులో ఒక రెండు చెంచాల నెయ్యి వేసి ఐదు నిమిషాల పాటు సిమ్ లోనే ఉంచి ఉడకనివ్వాలి. ఇలా కొంచెం కొంచెం గా నెయ్యి వేస్తుంది తిప్పుతూ ఉండాలి. ఇంట్లో జీడిపప్పు చిటికెడు ఉప్పు కూడా వేసి కలపాలి. ఇది హల్వా మాదిరిగా దగ్గరకు అయ్యాక స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ కి నెయ్యి రాసి దానిలో  హల్వాను వేయాలి. జీడిపప్పును ముందుగా మిశ్రమంలో వేయొచ్చు. లేదా గార్నిషింగ్ కూడా ఉపయోగించుకోవచ్చు. బీట్రూట్ హల్వా రెడీ.