pixabay

ఈ మధ్యకాలంలో మండి భోజనం చాలా ఫేమస్ అయ్యింది. స్నేహితులతో కలిసి హోటల్లో బయట మండి భోజనాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటున్నారు. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీని వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జలుబు దగ్గు వంటివి- మనము ఇతరులతో కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేస్తున్నప్పుడు వారి నోటి నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్లు కూడా మన ప్లేట్లోకి వస్తాయి. దీని ద్వారా ఆ వ్యక్తికి జలుబు దగ్గు లేదా కడుపు సంబంధ వ్యాధులు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి మనకు కూడా సులభంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్యాస్ట్రో ఇంటరెస్ట్ ఇన్ఫెక్షన్స్ ప్రమాదం పెరుగుతుంది.

జీర్ణ సమస్యలు- మనం తీసుకునే ఆహారం ఎంత శుభ్రమైనదో ఉండాలో అదేవిధంగా మనం తినే పాత్రను కూడా అదే విధంగా శుభ్రంగా ఉండాలి. లేకపోతే బ్యాక్టీరియా మన శరీరంలోనికి ప్రవేశించి జీర్ణ వ్యవస్థ పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఒక్కొక్కసారి కడుపు నొప్పి అజీర్ణం గ్యాస్ ట్రబుల్ అతిసారం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.

Health Tips: ఈ ఆహార పదార్థాలను ఎప్పుడూ కూడా పచ్చిగా తినకూడదు ...

పోషకాల లోపం- మీరు ఒక్కొక్కసారి ఇతరులతో కలిసి మండి భోజనం చేస్తున్నప్పుడు మీకు తగినంత మోతాదులో పోషకాలు లభించవు. అది మీ పోషకాహార లోపానికి కారణం కూడా అవుతుంది.

ఎలర్జీ- మీరు మండి భోజనం చేసేటప్పుడు మీరు కలిసి భోజనం చేసేవారికి ఎలర్జీ సమస్య ఉంటే అదే ఆహారాన్ని మీరు కూడా తింటున్నట్లైతే ఆ ఎనర్జీ మిమ్మల్ని కూడా ప్రభావితం చేస్తుంది.

మండి భోజనం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

మండి భోజనం చేసేటప్పుడు ముఖ్యంగా చేతులను బాగా శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల బ్యాక్టీరియా, వైరస్ వంటివి తొలగిపోతాయి. ఒక్కొక్కసారి శానిటైజర్ ని కూడా ఉపయోగిస్తే ఈ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

తినేటప్పుడు ఎల్లప్పుడు కూడా స్పూను ఫోర్కులను శుభ్రమైన పాత్రను మాత్రమే ఉపయోగించాలి. చేతుల ద్వారా ఆహారం తీసుకోవడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా వైరస్లు ఆహారంలోనికి చేతుల ద్వారా ప్రవేశిస్తాయి. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు స్కూల్స్ లేదా ఫోర్క్ తో తినేలాగా చూడండి. మండి ఆహారం తినేటప్పుడు అది మీకు ఇష్టమైనప్పటికీ కూడా దాని వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్, జీర్ణ వ్యవస్థ సమస్యలు, పోషకాహార లోపం, ఎలర్జీల వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఈ అలవాట్లు మానుకుంటే మంచిది. ఇది మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించడం ద్వారా మీ జీవితం సంతోషంగా ఉంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి