ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కారుపై (Arvind Kejriwal’s car attacked) దాడి జరిగింది. ఇది బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గూండాల పనిగా ఆప్‌ ఆరోపించింది. అయితే దీనిని ఆయన ఖండించారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు ఆయన వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించంతో పాటుగా కారుపై రాళ్లు విసిరారు. అప్రమత్తమైన పోలీసులు కేజ్రీవాల్‌ కారును అక్కడి నుంచి పంపివేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు హోంమంత్రి అమిత్ షా.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్బీడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న షా, చంద్రబాబు నివాసంలో అమిత్‌ షాకు విందు

అరవింద్‌ కేజ్రీవాల్‌ కారుపై దాడికి సంబంధించిన వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాలో ఆప్‌ పోస్ట్‌ చేసింది. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గూండాలు ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపించింది. దీనిపై బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ మాట్లాడుతూ..అరవింద్‌ కేజ్రీవాల్‌ తన కారుతో ఇద్దరు యువకులను ఢీకొట్టారు. వారిద్దరినీ లేడీ హార్డింగ్ ఆసుపత్రికి తరలించారు. ఓటమిని ఎదురుగా చూసిన ఆయన, ప్రజల ప్రాణాల విలువను మరిచిపోయారు. నేను ఆసుపత్రికి వెళ్తున్నా’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Arvind Kejriwal’s Car Attacked With Stones

BJP Hits Back

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)