Hyderabad, JAN 18: తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు (Bade Chokkarao) పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్‌లో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Chhattisgarh Encounter) ఆయన మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ ఓ లేఖను విడుదల చేసింది. నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో దామోదర్‌తో పాటు మరో 17 మంది మరణించారు. దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి. దాదాపు 30 ఏళ్లుగా ఆయన మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు.
ఎన్నో ఏండ్లుగా ఆయన పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. ఆయనపై ఛత్తీస్‌గఢ్‌లో50 లక్షల రివార్డు కూడా ఉంది. తెలంగాణలోనూ 25లక్షల రివార్డు ఉంది. ఆరు నెలల క్రితమే ఆయన మావోయిస్టు పార్టీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. మావోయిస్టు యాక్షన్ టీమ్‌లకు ఆయన ఇన్‌చార్జిగానూ ఉన్నారు.