తిరుమలలోని రాంభగీచా బస్టాండ్ సమీపంలో కొందరు భక్తులు ఎగ్ బిర్యానీ భోజనం చేస్తున్న సమయంలో విజిలెన్స్ అధికారులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన భక్తులు తిరుపతి నుంచి భోజనం తిరుమలకు తెచ్చుకుని తింటున్న సమయంలో కోడి గుడ్లు గుర్తించిన భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు ప్రాంతానికి చెందిన భక్తులు 30 మంది బృందంతో శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్నారు.

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలకు సంబంధించి ఏప్రిల్ కోటా టికెట్ల విడుదల వివరాలు ఇవిగో..

తిరుపతిలో ఎగ్ బిర్యానీ తీసుకొని వారి వాహనం లో తిరుమల కొండకు చేరుకున్నారు. వారు రాంభగీచా బస్టాండు సమీపంలో భోజనం చేస్తున్న సమయంలో సదరు భక్తులు గుర్తించి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భక్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీస్ సిబ్బంది పంపించారు. ఈ విషయం బయటకు రావడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అధికారులు కళ్లు తెరిచి.. తిరుమలలో తనిఖీలు సక్రమంగా నిర్వహించి, భద్రతా వైఫల్యాలను అధిగమించాలని అంటున్నారు.

తిరుమలలో ఎగ్ బిర్యానీ తింటూ ప్రత్యక్షమైన తమిళనాడు భక్తులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)