Sports

T20 World Cup 2022: చెత్త ఫీల్డింగ్‌తో కొంపలు ముంచారంటూ టీమిండియాపై ట్విట్టర్లో ఫైర్, ఆ ఒక్క క్యాచ్‌ పట్టి ఉంటే మ్యాచ్‌ మలుపు తిరిగేది కోహ్లీ అంటూ నెటిజన్ ట్వీట్

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డింగ్ లో చేసిన తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది. తొలుత బ్యాటింగ్‌లో విఫలమైన భారత్‌.. అనంతరం ఫీల్డింగ్‌లో కూడా చేతులేత్తేసింది. ఇందుకు ఫలితంగా దక్షిణాఫ్రికా చేతిలో 5 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమి పాలైంది.

T20 World Cup 2022: భారత్ రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే పాకిస్తాన్ ఇంటికి, టీ20 ప్రపంచ కప్‌లో దాయాది దేశం సెమీస్ ఆశలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌-2022 సూపర్‌-12లో భాగంగా (T20 World Cup 2022) దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ ఓటమి చెందిన సంగతి విదితమే. అయితే ఈ భారత్ పరాజయం (South Africa beat India on Sunday) పాకిస్తాన్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసింది.

Virat Kohli: నా స్వంత హోటల్ గదిలోనే నాకు రక్షణ లేదు, సంచలన వీడియో షేర్ చేసిన విరాట్ కోహ్లీ, వ్యక్తిగత స్థలాన్ని ఎక్కడ ఆశించగలను అంటూ పోస్ట్

Hazarath Reddy

ఈ వీడియో భయంకరంగా ఉంది మరియు ఇది నా గోప్యత గురించి నాకు చాలా మతిస్థిమితం లేని అనుభూతిని కలిగించింది. నేను నా స్వంత హోటల్ గదిలో గోప్యతను కలిగి ఉండలేకపోతే, నేను నిజంగా వ్యక్తిగత స్థలాన్ని ఎక్కడ ఆశించగలను?? ఈ రకమైన మతోన్మాదం మరియు గోప్యతపై సంపూర్ణ చొరబాటుతో నేను సమ్మతించను.

Virat Kohli Creates Record: విరాట్ కోహ్లీ ఖాతాలో మరో కొత్త రికార్డ్, చేసింది 12 పరుగులే అయినా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన కింగ్ కోహ్లీ, టీ-20 వరల్డ్ కప్‌లో వెయ్యి పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు

Naresh. VNS

సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 12 రన్స్ చేయడం ద్వారా విరాట్ ఈ ఘనత అందుకున్నాడు. కోహ్లి (1001) కి ముందు శ్రీలంక క్రికెటర్ మహేళ జయవర్దనే (Jayawardene ) (1016) ఒక్కడే ఉన్నాడు. జయవర్దనే 31 ఇన్నింగ్స్ లు ఆడగా.. కోహ్లీ 24 ఇన్నింగ్స్ లలోనే ఈ మైలురాయి చేరుకున్నాడు

Advertisement

India vs South Africa: సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి, చేతులెత్తేసిన రోహిత్ సేన, వరల్డ్ కప్ లో తొలి ఓటమి

kanha

ఆస్ట్రేలియాలో జరుగుతున్న t20 లీగ్ మ్యాచ్లో భారత్ సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. సౌత్ ఆఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

T20 World Cup: భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ నేడే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపు కోసం పాక్ అభిమానుల ప్రార్థనలు.. భారత్, జింబాబ్వే చేతుల్లో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాకిస్థాన్.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేలపై భారత్ గెలిస్తే పాక్‌కు సెమీస్ అవకాశాలు.. నేడు నెదర్లాండ్స్‌ తో జరిగే మ్యాచ్ లో పాక్ ఓడితే ఇంటికే

Sriyansh S

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలని పాక్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

T20 World Cup 2022: ప్రపంచకప్ నుంచి భారత్ కూడా ఇంటికి వస్తుంది, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన షోయబ్ అక్తర్, మూసుకుని ఉండు అంటూ మండిపడుతున్న టీమిండియా అభిమానులు

Hazarath Reddy

భారత్ కూడా పెద్ద తీస్ మార్ ఖాన్ జట్టేం కాదు. ఆ జట్టులో కూడా క్వాలిటీ లేదు. వాళ్లు కూడా వచ్చే వారం సెమీ ఫైనల్ ఆడి స్వదేశానికి (explosive statement against Team India) తిరిగెళ్లిపోతారు’ అని తేల్చిచెప్పాడు.

T20 World Cup 2022: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన జింబాబ్వే ఆటగాడు రజా, ఒక ఏడాదిలో అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్న ఆటగాడిగా రికార్డు

Hazarath Reddy

అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్‌ ఈయర్‌లో అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్న ఆటగాడిగా జిబాంబ్వే స్టార్‌ ఆల్‌ రౌండర్‌ సికిందర్‌ రజా (Zimbabwe all-rounder Sikandar Raza) నిలిచాడు. 2022 ఏడాదిలో రజాకు ఇప్పటి వరకు 7 మ్యాన్‌ ఆఫ్‌ది అవార్డులు లభించాయి.

Advertisement

T20 World Cup 2022: బాబర్ నీవు ఓ చెత్త కెప్టెన్, ఆడింది చాలు ఇంటికి బయలుదేరండి, పాకిస్తాన్ ఆటగాళ్లపై మండిపడిన పాకిస్తాన్‌ మాజీ పాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో పాకిస్తాన్‌ ఓడిపోయిన సంగతి విదితమే.దీంతో ఈ మెగా టోర్నీలో (T20 World Cup) పాకిస్తాన్‌ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ దిగ్గజ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar Fumes) నిరాశ వ్యక్తం చేశాడు.

T20 World Cup 2022: వీడియో, పాకిస్తాన్‌పై గెలుపు తర్వాత జింబాబ్వే ఆటగాళ్ల డ్యాన్స్ వీడియో వైరల్, పాటలు పాడుతూ, డ్యాన్స్‌ చేస్తూ సంబరాలు జరుపుకున్న ఆటగాళ్లు

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ విజయం తర్వాత జింబాబ్వే ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లో మునిగి తేలిపోయారు. జింబాబ్వే ఆటగాళ్లు మైదానంలోనే పాటలు పాడుతూ, డ్యాన్స్‌ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.

ICC T20 World Cup 2022:  చివరి ఓవర్ వరకు ఉత్కంఠ,  పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన జింబాబ్వే, ఒక పరుగు తేడాతో గెలిచిన జింబాబ్వే,  రెండవ ఓటమిని మూటగట్టుకున్న పాక్ 

Hazarath Reddy

టీ20 వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ కు జింబాబ్వే చుక్కలు చూపించింది. మొదట బ్యాటింగ్ చేసి తక్కువ స్కోరు చేసినప్పటికీ బౌలింగ్ లో అదరగొట్టింది. పాక్ బ్యాటర్లు పరుగులు తీయడానికి నానా అవస్థలు పడ్డారు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి పాలైంది.

T20 World Cup 2022: ప్రపంచకప్‌లో రెండో విజయం నమోదు చేసిన భారత్, నెదర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా

Hazarath Reddy

టీ20 వరల్డ్‌కప్‌-2022 సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా ఇవాళ (అక్టోబర్‌ 27) భారత్‌-నెదర్లాండ్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు ​కోల్పోయి 179 పరుగులు సాధించింది.

Advertisement

IND vs NED: నెదర్లాండ్స్‌ బౌలర్లను ఆడుకున్న భారత బ్యాటర్లు, 20 ఓవర్లలో రెండు వికెట్లు ​కోల్పోయి 179 పరుగులు, అర్థ సెంచరీలతో చెలరేగిన కోహ్లీ, రోహిత్, సూర్యకుమార్

Hazarath Reddy

టీ20 వరల్డ్‌కప్‌-2022 సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా ఇవాళ (అక్టోబర్‌ 27) భారత్‌-నెదర్లాండ్స్‌ జట్లు తలపడుతున్న సంగతి విదితమే. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు ​కోల్పోయి 179 పరుగులు సాధించింది.

T20 World Cup 2022: ఇంగ్లండ్ కొంప ముంచిన వర్షం, 5 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఐర్లాండ్‌, తలలు బాదుకుంటున్న ఇంగ్లండ్‌ ప్లేయర్లు

Hazarath Reddy

టీ20 వరల్డ్‌కప్‌-2022లో మరో సంచలనం నమోదైంది. సూపర్‌-12 గ్రూప్‌-1లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 26) జరిగిన మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్‌ పటిష్టమైన ఇంగ్లండ్‌కు షాకిచ్చింది. వరుణుడు ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఐర్లాండ్‌ 5 పరుగుల తేడాతో హాట్‌ ఫేవరెట్‌ జట్టును ఓడించింది.

T20 World Cup 2022:బంగ్లాదేశ్‌ బౌలర్లను ఊచకోత కోసిన రోసో, 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌-2022లో దక్షిణాఫ్రికా తొలి విజయాన్ని నమోదు చేసింది. సూపర్‌-12లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం నమోదు చేసింది. 206 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 101 పరుగులకే కుప్పకూలింది.

T20 World Cup 2022: ఈ ఏడాది ప్రపంచకప్‌లో తొలి సెంచరీ, 56 బంతుల్లో 109 పరుగులు చేసిన సౌతాఫ్రికా బ్యాటర్‌ రిలీ రోసో, బంగ్లాదేశ్‌ బౌలర్లను ఊచకోత కోసిన రోసో

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌-2022లో తొలి సెంచరీ నమోదైంది. సూపర్‌-12లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో (T20 World Cup 2022) సౌతాఫ్రికా బ్యాటర్‌ రిలీ రోసో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి సెంచరీ (Rilee Rossouw smashes first century) సాధించాడు

Advertisement

T20 World Cup 2022: న్యూజిలాండ్‌-ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్ రద్దు, సెమీస్‌ ఆశలు గల్లంతవుతాయనే భయంతో విలవిలలాడుతున్న విలియమ్సన్‌ సేన

Hazarath Reddy

టీ20 వరల్డ్‌కప్‌-2022లో సూపర్‌-12 గ్రూప్‌-1లో భాగంగా న్యూజిలాండ్‌-ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కనీసం టాస్‌ కూడా పడకుండానే మ్యాచ్‌ రద్దు కావడంతో ఇరు జట్ల అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

T20 World Cup 2022: టీమిండియాకు చద్దన్నం వడ్డించిన ఐసీసీ, ఆహారాన్ని తినకుండా నిరసన వ్యక్తం చేసిన ఆటగాళ్లు, ఘటనపై స్పందించిన ఐసీసీ అధికారులు

Hazarath Reddy

టీ20 ప్రపంచ కప్‌లో (t20 world cup2022) భాగంగా పాకిస్తాన్‌పై (Pakistan) విజయం సాధించి.. తదుపరి మ్యాచ్ కోసం సిడ్నీ (Sydney) చేరుకున్న టీమిండియా (Team India) అక్కడి సర్వీసుల పట్ల అసంతృప్తి (Indian team unhappy) వ్యక్తం చేసింది.

ICC T20 World Cup 2022: వైరల్ వీడియో, హార్థిక్ పాండ్యాను కపిల్‌దేవ్‌తో పోల్చిన మాజీ క్రికెటర్‌ క్రిష్టమాచారి శ్రీకాంత్‌, కపిల్‌ గ్రేటెస్ట్‌ ప్లేయర్‌ అని సమాధానం ఇచ్చిన పాండ్యా

Hazarath Reddy

పాకిస్థాన్‌తో జరిగిన సూపర్‌ 12 మ్యాచ్‌లో హార్ధిక్‌ పాండ్యా కీలక ఇన్నింగ్స్‌ ఆడిన సంగతి విదితమే. బౌలింగ్‌లో 30 రన్స్‌ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్న హార్ఠిక్ బ్యాటింగ్‌లో 37 బంతుల్లో 40 రన్స్‌ స్కోర్‌ చేవాడు. కోహ్లీతో కలిసి 113 రన్స్‌ జోడించాడు.

T20 World Cup 2022: శ్రీలంక బౌలర్లను ఊచకోత కోసిన స్టొయినిస్‌, కేవలం 17 బంతుల్లోనే అర్థ సెంచరీ, 16.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించిన ఆసీస్

Hazarath Reddy

టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా శ్రీలంకతో నేడు జరిగిన సూపర్‌-12 గ్రూప్‌-1 మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మార్కస్‌ స్టొయినిస్‌ రాకెట్‌ ఇన్నింగ్స్‌ ఆడి ఆసీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. స్టొయినిస్‌ కేవలం 17 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదాడు.

Advertisement
Advertisement