క్రీడలు

MI vs CSK Highlights: పాత కథే నడిచింది, ఓటమితో ఐపీఎల్ 20ని ప్రారంభించిన ముంబై, తొలి విక్టరీ నమోదు చేసిన ధోనీ సేన, సూపర్ ఇన్నింగ్స్ ఆడిన రాయుడు

Hazarath Reddy

ఐపీఎల్‌-13 వ సీజన్‌ ఆరంభపు మ్యాచ్‌లో ముంబై పాత కథనే కొనసాగించింది. విక్టరీ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొలి మ్యాచ్ లోనే దుమ్ములేపింది. అటు బౌలింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో సూపర్‌ విక్టరీ (Chennai Super Kings Beat Mumbai) సాధించింది. అంబటి రాయుడు (Ambati Rayudu)(71; 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) బ్యాటింగ్‌ పవర్‌ చూపించగా, డుప్లెసిస్ (Faf du Plessis) (58 నాటౌట్‌; 44 బంతుల్లో 6 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి విజయంలో సహకరించాడు.

IPL 2020 CSK vs MI: ముంబై భారీ స్కోరును అందిస్తుందా? టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్, కరోనా సంక్షోభంతో ఆరంభ వేడుకలు లేకుండానే మ్యాచ్‌లు

Hazarath Reddy

ఐపీఎల్‌-13వ సీజన్‌ ప్రారంభమైంది. కరోనా సంక్షోభం కారణంగా ఎటువంటి ఆరంభ వేడుకలు లేకుండానే ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ నిశ్శబ్దంగా మనముందుకు వచ్చేసింది. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (IPL 2020 CSK vs MI) చెన్నై సూపర్‌కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. షేక్ జాయేద్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2020 మొదలైంది. 2008లో సీజన్‌ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా అత్యంత విజయవంతమైన జట్లుగా చెన్నై, ముంబై పేరు తెచ్చుకున్నాయి.

'Junior Chris Gayle': గేల్‌ని మురిపిస్తున్న బుడ్డోడు, బిల్డింగ్‌ స్టెప్స్ ‌పైనుంచే హిట్టింగ్‌ల మోత, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆకాశ్‌ చోప్రా షేరింగ్ వీడియో

Hazarath Reddy

వీడియోలో ఒక బుడతడు బిల్డింగ్‌ స్టెప్స్‌పైనే బ్యాట్‌ పట్టుకుని బంతిని ఎడాపెడా (kid playing phenomenal cricket shots) బాదేస్తున్నాడు. కింద నుంచి ఎవరో బాల్స్ వేస్తుంటే మెట్ల మీద నుంచి భారీ హిట్టింగ్‌లతో విరుచుకుపడుతున్నాడు. కచ్చితమైన హిట్టింగ్‌ ఆడిన ఈ బుడతడిని చూసి నెటిజన్లు తెగమురిసిపోతున్నారు. ఇక ఈ వీడియో పోస్ట్‌ చేసిన ఆకాశ్‌ చోప్రా.. ‘ఈ పిల్లాడు ఎంత బాగా ఆడుతున్నాడు’ అనే కామెంట్‌ చేశాడు.

IPL 2020: బౌల్ట్‌ బౌలింగ్ దెబ్బ..వికెట్ రెండు ముక్కలైంది, ప్రాక్టీస్ సెషన్‌లో అదరరగొడుతున్న న్యూజీలాండ్ బౌలర్, లసిత్ మలింగ స్థానంలో ముంబై జట్టుకు ఎంపిక

Hazarath Reddy

న్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (Trent Boult) ఐపీఎల్‌లో ఈ ఏడాది ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్ లో బాల్ తో నిప్పులు చెరుగుతున్నాడు. లసిత్‌ మలింగ స్థానంలోకి ముంబై జట్టులో చేరిన ఈ ఫాస్ట్ బౌలర్ లసిత్‌ మలింగ లేని లోటును తీర్చేందుకు రెడీ అయ్యాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో (Mumbai Indians Training Session) వికెట్లను విరగొట్టేస్తున్న బౌల్ట్‌.. తాను ఫామ్‌లోనే ఉన్నా అంటూ ప్రత్యర్థి ఆటగాళ్లకు కాచుకోమంటూ సవాల్ విసురుతున్నాడు.

Advertisement

US Open 2020: కొంపలు ముంచిన కోపం, యుఎస్ ఓపెన్ నుంచి డిస్‌ క్వాలిఫై అయిన నొవాక్‌ జొకోవిచ్‌, లైన్‌ జడ్జ్‌ను గాయపరిచినందుకు క్షమాపణ చెప్పిన జకోవిచ్

Hazarath Reddy

ఉద్ధేశ్యపూర్వకంగా ఆమెను కొట్టకపోయినా.. లైన్‌ జడ్జ్‌ను గాయపరిచినందుకు గానూ గేమ్‌ రూల్స్‌ ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవల్సిన పరిస్థితి (Djokovic disqualified) వచ్చింది. కానీ, అధికారులు తనపై చర్యలు తీసుకోవటం ఇష్టం లేని జొకోవిచ్‌ వెంటనే స్టేడియంనుంచి బయటకు వెళ్లిపోయాడు.

Jwala Gutta-Vishnu Vishal Engagement: గుత్తా జ్వాలతో తమిళ నటుడు విశాల్ ఎంగేజ్‌మెంట్, కొత్త ప్రయాణాన్ని ప్రారంభిద్దామంటూ ట్వీట్ చేసిన విష్ణు విశాల్

Hazarath Reddy

గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్‌ నిశ్చితార్థం (Jwala Gutta-Vishnu Vishal Engagement) జరిగింది. త్వరలో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు. ఇవాళ గుత్తా జ్వాల పుట్టినరోజు (Jwala Gutta Birthday) కాగా.. ఆమెకు రింగ్ తొడిగేశారు విష్ణు (Vishnu Vishal). ఈ విషయాన్ని సోషల్ మీడియాలో విష్ణు వెల్లడించారు..

IPL 2020 Schedule Announced: సెప్టెంబర్ 19 నుంచి నవంబర్‌ 3 వరకు ఐపీఎల్‌ 13, ముంబై వర్సెస్ చెన్నై మధ్య తొలి మ్యాచ్‌, సెప్టెంబర్ 21న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ వర్సెస్‌ బెంగళూరు మ్యాచ్

Hazarath Reddy

ఎన్నో తర్జనభర్జనల అనంతరం ఐపీఎల్‌ 2020 వేడుక ప్రారంభానికి ముహూర్తం (IPL 2020 Schedule Announced) కుదిరింది. ఐపీఎల్‌ 13వ సీజన్ షెడ్యూల్ ఆదివారం విడుదలైంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ తాజా సీజన్‌ నవంబర్‌ 3 వరకు కొనసాగుతుంది. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్‌ 2020లో (Indian Premier League 2020) సెప్టెంబర్‌ 19న ముంబై వర్సెస్ చెన్నై మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది.

IPL 2020 Update: కారణమదేనా..రైనా ఐపీఎల్ నుంచి అర్థాంతరంగా ఎందుకు తప్పుకున్నారు? రైనాకు ఎప్పుడైనా అండగా నిలుస్తామని తెలిపిన సీఎస్‌కే యజమాని ఎన్‌. శ్రీనివాసన్‌

Hazarath Reddy

ఐపీఎల్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో సురేశ్‌ రైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) యజమాని ఎన్‌. శ్రీనివాసన్‌ 24 గంటల్లోపే తన మాటలను మార్చుకున్నారు. రైనా గురించి తాను చెప్పిన మాటలను వక్రీకరించారని, అతనికి ఎప్పుడైనా అండగా నిలుస్తామని చెప్పారు. ‘ఇన్నేళ్లుగా చెన్నై జట్టుకు (Chennai Super Kings) రైనా చేసిన సేవలు అసమానం. నేను చేసిన వేర్వేరు వ్యాఖ్యలను ఒక చోట జోడించి కొందరు తప్పుగా ప్రచారం చేశారు. సురేష్ రైనా ( Suresh Raina) మానసిక పరిస్థితి ఏమిటో అర్థం చేసుకొని అతనికి మనం అండగా నిలవాలని, మా ఫ్రాంచైజీ ఎప్పుడైనా అతనికి తోడుగా ఉంటుందని తెలిపారు.

Advertisement

IPL 2020: క్వారంటైన్‌లో ధోనీ సేన, చైన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ దీపక్‌ చహర్‌కు కరోనా పాజిటివ్, సెప్టెంబర్‌ మొదటి వారంలో నెట్స్‌కు వెళ్లే అవకాశం

Hazarath Reddy

చెన్నై సూపర్‌కింగ్స్‌ను (Chennai Super Kings) కరోనావైరస్ మహమ్మారి చుట్టేసింది. చెన్నై సహాయక బృంద సభ్యులతో పాటు భారత ఆటగాడు దీపక్‌ చహర్‌కు కరోనా సోకడం ఇప్పుడు ఆ జట్టులో కలకలం రేపుతోంది. దీంతో ఆటగాళ్లంతా క్వారంటైన్‌ లోకి (Quarantine) వెళ్లిపోయారు. చెన్నై కోవిడ్‌ కేసులపై బయటకు తెలిసిపోయినా సదరు ఫ్రాంచైజీ మాత్రం మొదట నోరే మెదపలేదు. అధికారికంగా ఎంతమంది మహమ్మారి బారిన పడ్డారో తెలియడంలేదు. అనధికార వర్గాల సమాచారం మేరకు 12 మంది కోవిడ్‌ పాజిటివ్‌ (12 CSK Squad Members Test Positive) బాధితులున్నట్లు తెలిసింది.

Lionel Messi: పుట్‌బాల్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్, బార్సిలోనా క్లబ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన లియోనల్ మెస్సీ, ధృవీకరించిన జట్టు యాజమాన్యం

Hazarath Reddy

అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ( Argentine Footballer) ఫుట్‌బాల్ ప్రపంచానికి షాకిచ్చాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన ఈ ఫుట్‌బాల్ దిగ్గజం (Lionel Messi) ఆ జట్టును వీడుతున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం కూడా ధృవీకరించింది. మెస్సీ తన నిర్ణయాన్ని బ్యూరోఫాక్స్ ద్వారా తెలియజేశాడని, వెంటనే బోర్డు మీటింగ్‌కు పిలుపునిచ్చామని తెలిపింది. అయితే 11 రోజుల క్రితం చాంపియన్స్‌లీగ్‌లో ఎదురైన ఘోరపరాజయంతోనే మెస్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Usain Bolt Coronavirus: బర్త్‌డే పార్టీ అతిథులకు కరోనా టెన్సన్, పరుగుల చిరుత బోల్ట్‌కు కరోనాగా నిర్ధారణ, స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన జమైకా స్ప్రింటర్‌

Hazarath Reddy

ఒలింపిక్స్‌లో ఎనిమిది బంగారు పతకాలు సాధించిన జమైకా దిగ్గజ స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ (Usain Bolt Coronavirus) కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కోవిడ్‌ పాజిటివ్ రావడంతో ఉసేన్ బోల్ట్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ‘గుడ్‌ మార్నింగ్‌.. నాకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. శనివారం చేసిన పరీక్షలో ఇది బయటపడింది.

IPL 2020 Sponsorship Deal: డ్రీమ్‌ 11 కంపెనీకి ఐపీఎల్ 13వ సీజన్‌ హక్కులు, రూ.222కోట్లతో బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న డ్రీమ్‌ 11, నాలుగు నెలల 13 రోజుల పాటు ఐపీఎల్ 13 స్పాన్సర్‌ గా కొనసాగనున్న కంపెనీ

Hazarath Reddy

ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌కు సంబంధించిన హక్కులను (IPL 2020 Sponsorship Deal) 250 కోట్ల రూపాయలకు డ్రీమ్‌ 11 కంపెనీ (Dream11) దక్కించుకుంది..ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ డ్రీమ్‌ 11 ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ (IPL 2020 Sponsorship) హక్కుల కోసం రూ.222కోట్లతో బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్నది. డ్రీమ్‌ 11 ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌ హక్కులను దక్కించుకుందని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ వెల్లడించారు. డ్రీమ్‌ 11 నాలుగు నెలల 13 రోజుల పాటు ఐపీఎల్ 13 స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ప‌తంజ‌లి, అడిడాస్‌, జియో క‌మ్యూనికేష‌న్స్‌, అన్అకాడ‌మీ, టాటా గ్రూప్‌ తదితర దిగ్గజ కంపెనీలు టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం పోటీపడ్డాయి.

Advertisement

MS Dhoni Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు ఎం.ఎస్ ధోనీ వీడ్కోలు, అభిమానుల ప్రేమకు ధన్యవాదాలంటూ సంక్షిప్త సందేశం, ఐపీఎల్‌లోనైనా ఆడతాడా, లేదా? అని అభిమానుల్లో ఉత్కంఠ

Team Latestly

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఆగష్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం రోజున సంచలన ప్రకటన చేశారు. తాను అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్....

IPL 2020 Sponsor: ఐపీఎల్-2020 స్పాన్సర్‌షిప్, రేసులో బాబా రాందేవ్ పతంజలి గ్రూపు, బిడ్డింగ్‌లో పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపిన సంస్థ ప్రతినిధి ఎస్ కె టిజరవాలా

Hazarath Reddy

ఐపీఎల్-2020 స్పాన్సర్‌షిప్ నుంచి చైనా మొబైల్ కంపెనీ వివో తప్పుకున్న నేపథ్యంలో రేసులోకి యోగా గురువు బాబా రాందేవ్‌కు (Baba Ramdev) చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి (Patanjali Ayurved) వచ్చింది. తన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చే వ్యూహంలో పంతాంజలి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ (IPL 2020 Sponsor) కోసం ప్రయత్నిస్తోంది. ఈ అంశాన్ని తాము పరిశీలిస్తున్నామంటూ ప్రతినిధి ఎస్ కె టిజరవాలా ధృవీకరించారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆగస్టు 14 లోగా తన ప్రతిపాదనను సమర్పించాల్సి ఉందని చెప్పారు.

IPL 2020 Dates Announced: యూఏఈలో ఐపీఎల్ 13, సెప్టెంబర్‌ 19నుంచి ప్రారంభం, ఈ ఏడాది ఐపీఎల్ రద్దు చేస్తే రూ. 4 వేల కోట్ల నష్టం, మరిన్ని వివరాలు కథనంలో..

Hazarath Reddy

క్రికెట్‌ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-13వ సీజన్‌పై ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) షెడ్యూల్‌పై స్పష్టత (IPL 2020 Dates Announced) వచ్చింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE) వేదికగా సెప్టెంబర్‌ 19న లీగ్‌ ఆరంభంకానుందని (Scheduled to Begin on September 19 in UAE) నవంబర్‌ 8న ఫైనల్‌తో టోర్నీ ముగియనుందని ఐపీఎల్‌ ఛైర్మన్‌బ్రిజేష్‌‌ పటేల్‌ (Brijesh Patel) శుక్రవారం క్లారిటీ ఇచ్చారు. ఈసారి పూర్తిస్థాయి టోర్నమెంట్‌ను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

ICC T20 World Cup 2020: ఈ ఏడాది జరగాల్సిన టీ20 క్రికెట్ ప్రపంచ కప్ వాయిదా, అధికారికంగా ప్రకటించిన ఐసీసీ, ఐపీఎల్ 2020 నిర్వహణకు లైన్ క్లియర్

Team Latestly

అదే సమయంలో ఐసీసీ ప్రపంచకప్ షెడ్యూల్ చేయబడి ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ పై కొంత అస్పష్టత నెలకొని ఉంది, ప్రస్తుతం ప్రపంచకప్ వాయిదా పడటంతో బీసీసీఐ ముందు ఉన్న ఒక అడ్డు తొలగిపోయినట్లయింది. ఐపీఎల్ వేదికకు తొలి ప్రాధాన్యం...

Advertisement

IPL 2020: యూఎఈలో ఐపీఎల్ 2020! అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో బీసీసీఐ నిర్ణయం, భారత ప్రభుత్వం అనుమతిస్తేనే అడుగు ముందుకు

Team Latestly

ఐపీఎల్ 2020 టోర్నమెంట్ నిర్వహించడం తమ ప్రథమ ప్రాధాన్యత అని ఇప్పటికే బిసిసిఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బిసిసిఐ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న సౌరవ్ గంగూలీ ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ 2020 నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నారు. భారతదేశంలో నిర్వహణ సాధ్యం కాకపోతే విదేశాల్లోనైనా నిర్వహించాలని ఆయన దృఢ నిశ్చయం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో ప్రపంచంలో కొవిడ్ తీవ్రత తక్కువగా ఉన్న యూఎఈ

Ganguly In Home Quarantine: సౌరవ్‌ గంగూలీ సోదరునికి కరోనా, హోం ఐసోలేషన్‌కి వెళ్లిన దాదా, బెల్లెవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగూలీ సోదరుడు స్నేహాశీష్‌

Hazarath Reddy

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ స్వీయ నిర్బంధంలోకి (Ganguly In Home Quarantine) వెళ్లాడు. బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) సంయుక్త కార్యదర్శి, గంగూలీకి సోదరుడైన స్నేహాశీష్‌ గంగూలీ (Snehasish Ganguly) బుధవారం కరోనా పాజిటివ్‌గా తేలడంతో దాదా కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం కానున్నాడు. బెంగాల్‌ మాజీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ అయిన స్నేహాశీష్‌ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు క్యాబ్‌ అధ్యక్షుడు అవిషేక్‌ దాల్మియా తెలిపారు.

Asia Cup 2020 postponed: ఆసియా కప్‌ 2021కి వాయిదా, వచ్చే ఏడాది శ్రీలంకలో నిర్వహించే అవకాశం

Hazarath Reddy

కరోనా కారణంగా ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్‌ను వచ్చే ఏడాది 2021కు వాయిదా వేస్తున్నట్లు (Asia Cup 2020 postponed) ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ACC) ప్రకటించింది. ఆసియా ఖండంలో కోవిడ్‌–19 (COVID-19) తీవ్రత పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని స్పష్టం చేసింది. ‘అన్ని రకాల పరిస్థితులను అంచనా వేసిన తర్వాత సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను వాయిదా వేయడమే మంచిదని ఏసీసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు భావించింది.

1983 World Cup Memories: అంచనాలు లేకుండానే విశ్వవిజేత, భారత్ తొలి ప్రపంచకప్ సాధించి నేటితో 37 ఏళ్లు, ఈ తీపి గుర్తులపై స్పెషల్ స్టోరీ

Hazarath Reddy

హాకీతో దూసుకుపోతున్న భారత్ ప్రజానీకాన్ని క్రికెట్ బాట పట్టించిన రోజు నేడు. ప్రపంచ యవనికపై ప్రపంచ కప్ ను (1983 Cricket World Cup) అందుకుని నేటికి 37 ఏళ్లు. ఎటువంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగిన భారత్ మహామహులను మట్టి కరిపించి విశ్వ విజేతగా (1983 World Cup) మారిన రోజు నేడు. ఆర వీర భయంకరులను ఓడించి క్రికెట్‌కు పుట్టినిల్లయిన లార్డ్స్‌లో సగర్వంగా ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత జట్టు అందించిన మధురస్మృతులు నాలుగు దశాబ్దాలు దాటినా ఇంకా అభిమానుల గుండెల్లో అలాగే ఉన్నాయి.

Advertisement
Advertisement