Sports

Haryana Pacer Anshul Kamboj: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్, కేరళతో రంజీ ట్రోఫీలో అద్భుత బౌలింగ్..వీడియో ఇదిగో

Arun Charagonda

కేరళతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అన్షుల్ కాంబోజ్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. రోహ్‌తక్‌లో కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. 10/49తో అద్భుత స్పెల్ వేసి ఈ టోర్నమెంట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా నిలిచాడు.

Women's Asian Champions Trophy 2024: మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024, వరుసగా మూడో విజయంతో సెమీ ఫైనల్‌కు చేరుకున్న భారత మహిళా హకీ జట్టు

Vikas M

నవంబర్ 14, గురువారం రాజ్‌గిర్‌లో జరిగిన మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 మ్యాచ్‌లో స్ట్రైకర్ దీపికా సెహ్రావత్ ఐదు గోల్స్ చేయడంతో భారత్ 13-0తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత్ కూడా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

Glenn Maxwell: పాకిస్తాన్ మీద మ్యాక్స్‌వెల్ విధ్వంస‌క ఇన్నింగ్స్ వీడియో ఇదిగో, ఇదేమి ఊచకోత అంటూ తలలు పట్టుకుని కూర్చుండిపోయిన దాయాది బౌలర్లు

Vikas M

ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గబ్బాలో పాకిస్తాన్ బౌలర్లను ఊచకోత కోసాడు. టీ20 మ్యాచ్‌లో దాయాది బౌలర్లపై త‌న స్ట‌యిల్లో రెచ్చిపోయాడు.పాక్ ప్ర‌ధాన పేస‌ర్ షాహీన్ ఆఫ్రిదిని ల‌క్ష్యంగా చేసుకొని మ్యాక్సీవెల్ ఓ రేంజ్‌లో చెల‌రేగాడు. బ్రిస్బేన్‌లోని గ‌బ్బా స్టేడియంలో మ్యాక్సీ విధ్వంస‌క ఇన్నింగ్స్ ఆడాడు. ఉన్నంత సేపు పాక్ బౌల‌ర్ల‌ను వ‌ణికించాడు.

India New T20 World Record: టీ20లో టీమిండియా సరికొత్త రికార్డు, అయితే పాకిస్తాన్ టాప్‌లో, దక్షిణాఫ్రికాపై 11 పరుగుల తేడాతో మూడో టీ20లో భారత్ ఘన విజయం

Hazarath Reddy

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్‌ తిలక్‌వర్మ అజేయ సెంచరీతో కదం తొక్కడంతో భారత్ దక్షిణాఫ్రికాపై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.

Advertisement

Ramandeep Singh: భారత క్రికెటర్‌ రమణ్‌దీప్ సింగ్ అరుదైన ఫీట్..కెరీర్‌ ఫ‌స్ట్ బాల్‌కే సిక్స్ ...వీడియో

Arun Charagonda

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఆటగాడు రమణ్ దీప్‌ సింగ్ అరుదైన ఫీట్ సాధించాడు.తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ ఫస్ట్ మ్యాచ్‌ ఫస్ట్ బాల్‌ని సిక్స్‌తో ప్రారంభించాడు. తొలి బాల్‌నే సిక్స్‌గా కొట్టిన రమణ్‌దీప్‌... 6 బంతుల్లో ఒక ఫోర్‌, ఓ సిక్స్ బాది 15 ప‌రుగులు చేశాడు. ఈమ్యాచ్‌లో భార‌త్ 11 ప‌రుగుల తేడాతో గెలిచింది. తిల‌క్ వ‌ర్మ (107 నాటౌట్) రాణించగా ల‌క్ష్య ఛేద‌న‌లో ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 208 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

Samson Duck Video: సంజూ శాంస‌న్ మ‌ళ్లీ డ‌కౌట్ వీడియో ఇదిగో, మార్కో జాన్సెన్ వేసిన తొలి ఓవ‌ర్లో డిఫెన్స్ ఆడ‌బోయి క్లీన్ బౌల్డ్

Vikas M

టీ 20లో వ‌రుస‌గా రెండు సెంచ‌రీతో రికార్డు సృష్టించిన సంజూ శాంస‌న్(0) మ‌ళ్లీ డ‌కౌట్ అయ్యాడు. రెండో టీ20లో సున్నా చుట్టేసిన అత‌డు సెంచూరియ‌న్ వేదిక‌గా సాగుతున్న మూడో టీ20లోనూ 3 బంతులాడి డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.

Mohammed Shami Bowling Highlights: మహ్మద్ షమీ లేటెస్ట్ బౌలింగ్ వీడియో ఇదిగో, బెంగాల్ తరపున మధ్యప్రదేశ్‌తో 10 ఓవర్లు వేసిన భారత స్పీడ్‌స్టర్

Vikas M

భారత స్పీడ్‌స్టర్ మహ్మద్ షమీ తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోటీ క్రికెట్‌కు బుధవారం పునరాగమనం చేశాడు. ఇండోర్‌లో జరిగిన రంజీ ట్రోఫీ 2024-25 మ్యాచ్‌లో పేసర్ తన రాష్ట్ర జట్టు బెంగాల్ తరపున మధ్యప్రదేశ్‌తో ఆడాడు

Tilak Varma Slams Maiden T20I Century: స‌ఫారీల‌తో మ్యాచ్ లో అద‌ర‌గొట్టిన తెలుగు కుర్రాడు, సౌతాఫ్రికాతో టీ-20లో తిల‌క్ వ‌ర్మ సెంచ‌రీ మెరుపులు

VNS

దక్షిణాఫ్రికా గ‌డ్డ‌పై సంజూ శాంస‌న్ మెరుపు సెంచ‌రీని మ‌రువ‌క‌ముందే మ‌రో భార‌త కుర్రాడు శ‌త‌క గ‌ర్జ‌న చేశాడు. సిరీస్‌లో ముందంజ వేయాలంటే గెల‌వ‌క త‌ప్ప‌ని మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌(107 నాటౌట్) (Tilak Varma) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. సెంచూరియ‌న్‌లో బౌండ‌రీల వ‌ర్షం కురిపిస్తూ టీ20ల్లో తొలి సెంచ‌రీతో చెల‌రేగాడు.

Advertisement

Asian Champions Trophy 2024:మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024, దక్షిణ కొరియాపై భారత మహిళల హాకీ జట్టు 3-2తో ఘన విజయం

Vikas M

బీహార్‌లోని రాజ్‌గిర్ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిన మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024లో దక్షిణ కొరియాను 3-2 స్వల్ప తేడాతో ఓడించిన భారత మహిళల జాతీయ హాకీ జట్టు తమ విజయాల పరుగును కొనసాగించింది. గత మ్యాచ్‌లా కాకుండా, మొదటి అర్ధభాగంలో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది.

Munaf Patel: ఢిల్లీ క్యాపిటల్ కోచ్‌గా వరల్డ్ కప్ హీరో మునాఫ్ పటేల్, కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ యాజమాన్యం

Vikas M

ఐపీఎల్ మెగా వేలం ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్ (Delhi Capitals) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ (Ricky Ponting) స్థానంలో భార‌త మాజీ ఆట‌గాడు హేమంద్ బ‌దొనికి హెడ్‌కోచ్ బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ ఢిల్లీ యాజ‌మాన్యం తాజాగా భార‌త జ‌ట్టు వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో అయిన మునాఫ్ ప‌టేల్ (Munaf Patel)ను కొత్త‌ బౌలింగ్ కోచ్‌గా నియ‌మించింది.

David Miller One-Handed Catch Video: వీడియో ఇదిగో, ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్న డేవిడ్ మిల్లర్, అలానే చూస్తుండిపోయిన తిలక్ వర్మ

Vikas M

ఆదివారం, నవంబర్ 11న జరిగిన IND vs SA 2nd T20I 2024 సందర్భంగా డేవిడ్ మిల్లర్ తిలక్ వర్మను ఔట్ చేయడానికి అద్భుతమైన ఒంటిచేత్తో క్యాచ్ తీసుకున్నాడు. తిలక్ వర్మ దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ వేసిన ఎనిమిదో ఓవర్ చివరి బంతికి ఇది జరిగింది.

Sanju Samson: ద‌క్షిణాఫ్రికాతో టీ-20లో చెల‌రేగిన సంజూ శాంస‌న్, వ‌రుస‌గా రెండో సెంచ‌రీ, అరుదైన ఘ‌న‌త సాధించిన టీమిండియా క్రికెట‌ర్

VNS

భార‌త జ‌ట్టు నుంచి ఈ ఘ‌న‌త సాధించిన తొలి ఆట‌గాడిగా అత‌డు రికార్డు సొంతం చేసుకున్నాడు. ఉప్ప‌ల్ స్టేడియంలో బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌ను వ‌ణికిస్తూ మెరుపు సెంచ‌రీ బాదిన సంజూ శాంస‌న్ ఇప్పుడు ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై కూడా త‌న బ్యాట్ ప‌వ‌ర్ చూపించాడు.

Advertisement

PV Sindhu: బ్యాడ్మింట‌న్ అకాడ‌మీకి పీవీ సింధు భూమి పూజ, ఏడాదిలోపు అకాడ‌మీ నిర్మాణం పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టన‌

Arun Charagonda

బ్యాడ్మింట‌న్ అకాడ‌మీకి పీవీ సింధు భూమి పూజ చేశారు. ఏపీ ప్రభుత్వం కేటాయించిన భూమిలో బ్యాడ్మింట‌న్ అకాడ‌మీని నిర్మిస్తున్నారు సింధు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పూజ‌లో పాల్గొన్నారు సింధు. ఏడాదిలోపు అకాడ‌మీ నిర్మాణం పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించగా త‌మ అకాడమీ నిర్మాణానికి ప్ర‌భుత్వ స‌హ‌కారం ఉంద‌ని తెలిపారు. అన్నీ అనుమ‌తులు ల‌భించాకే భూమి పూజ చేశానని తెలిపారు.

Thomas Draca: ఐపీఎల్ 2025 మెగా వేలం, రూ.30 లక్షల కనీస ధరతో ఇటలీ నుంచి తొలిసారిగా పేరు నమోదు చేసుకున్న థామస్ డ్రాకా, అతని క్రీడా బయోడేటా ఇదే..

Vikas M

ఇటలీ క్రికెటర్ థామస్ డ్రాకా తొలిసారి ఐపీఎల్ మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ వేలం జరగనుండగా ఇటాలియన్ క్రికెటర్ థామస్ డ్రాకా తన పేరును నమోదు చేసుకున్నాడు.

Match Fixing Scandal in Mizoram: భార‌త‌ ఫుట్‌బాల్‌లో మ్యాచ్ ఫికింగ్స్ క‌ల‌క‌లం, 24 మంది ఆటగాళ్లపై వేటు వేసిన మిజోరాం ఫుట్‌బాల్ స‌మాఖ్య

Vikas M

భార‌త‌ ఫుట్‌బాల్‌ అయిన మిజోరం ప్రీమియ‌ర్ లీగ్‌(Mizoram Premier League)లో ప‌లువురు ఆట‌గాళ్లు ఫిక్సింగ్‌కు పాల్ప‌డ్డారు. దాంతో, స్థానిక పోలీసుల సాయంతో విచార‌ణ చేపట్టిన మిజోరం ఫుట్‌బాల్ స‌మాఖ్య (MFA) క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది.

AUS vs PAK 1st ODI: పాకిస్తాన్‌పై చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా, తొలి వన్డేలో రెండు వికెట్ల తేడాతో ఘన విజయం

Vikas M

పాకిస్తాన్‌తో మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ లో భాగంగా ఆస్ట్రేలియా తొలి వన్డేలో గెలిచి వన్డే సిరీస్‌ను విజయంతో ప్రారంభించింది. మెల్‌బోర్న్‌ వేదికగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో గెలిచింది.

Advertisement

AUS vs PAK 1st ODI: వారెవ్వా.. సిక్స్ పోయే బంతిని ఆపిన ఇర్ఫాన్ ఖాన్ ఫీల్డింగ్ చూస్తే సూపర్ అనాల్సిందే, అయితే దురదృష్టం ఏంటంటే..

Vikas M

AUS vs PAK 1వ ODI సమయంలో అదిరిపోయే సంఘటన చోటు చేసుకుంది. ఇర్ఫాన్ ఖాన్ యొక్క సూపర్‌మ్యాన్-ఎస్క్యూ ఒక నిర్దిష్ట సిక్స్‌ను నిరోధించడానికి ప్రయత్నించింది. అయితే అతను బంతిని ఆపే ముందు బౌండరీ లైన్ తొక్కి సిక్స్ పోయే బంతిని ఆపడంతో అంపైర్ దాన్ని సిక్స్ గా ప్రకటించారు. ఈ వీడియో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

WTC Points Table: వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయిన భారత్, టాప్ ప్లేసులోకి దూసుకువచ్చిన ఆస్ట్రేలియా

Vikas M

న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌లో ఓటమి అనంతరం వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. భారత్‌ రెండో స్థానానికి పడిపోవడంతో ఆస్ట్రేలియా టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది.

IND vs NZ, Third Test: సొంత గడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం, మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో న్యూజీలాండ్ ఘన విజయం

Vikas M

సొంత గడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో భారత్ దారుణ ఓటమి చవిచూసింది. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా చతకలపడిం‍ది.లక్ష్య చేధనలో కేవలం 121 పరుగులకే భారత జట్టు కుప్పకూలింది.

IND vs NZ: టీమిండియాను వైట్ వాష్ చేసిన కివీస్, ప్రపంచంలోనే తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌

Vikas M

టీమిండియాతో జ‌రిగిన మూడో టెస్టులో 25 ప‌రుగుల తేడాతో న్యూజిలాండ్ అద్బుత విజ‌యం సాధించింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్‌లో భార‌త్‌ను 3-0 తేడాతో న్యూజిలాండ్ వైట్ వాష్ చేసింది. ముంబై వేదిక‌గా జరిగిన ఆఖ‌రి టెస్టులో కివీస్ స్పిన్న‌ర్లు సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు.

Advertisement
Advertisement