Sports

Shakib Al Hasan Injured: వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బంగ్లాదేశ్‌కు మ‌రో షాక్, గాయంతో చివ‌రి లీగ్ మ్యాచ్‌కు కెప్టెన్ ష‌కీబుల్ హ‌స‌న్ ఔట్

Hazarath Reddy

వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బంగ్లాదేశ్‌కు మ‌రో షాక్ త‌గిలింది. చివ‌రి లీగ్ మ్యాచ్‌కు కెప్టెన్ ష‌కీబుల్ హ‌స‌న్(Shakib Al Hasan) దూరం కానున్నాడు. ఎడ‌మ చేతి చూపుడు వేలికి గాయం కావ‌డంతో ష‌కీబ్‌ విశ్రాంతి తీసుకోనున్నాడు. బెంగ‌ళూరులో శ్రీ‌లంక‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండ‌గా బంగ్లా సార‌థి చూపుడు వేలికి బంతి బ‌లంగా తాకింది.

AUS vs AFG CWC 2023: ప్రపంచకప్‌లో అఫ్గాన్ తరఫున తొలి శతకం నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన ఇబ్రహీం జద్రాన్‌, 2015 నుంచి నో సెంచరీ

Hazarath Reddy

భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు.2015 నుంచి వన్డే వరల్డ్‌ కప్‌ ఆడుతున్న అఫ్గానిస్తాన్‌ తరఫున ఇంతవరకూ (ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు) ఒక్క బ్యాటర్‌ కూడా సెంచరీ నమోదు చేయలేదు.

AUS vs AFG CWC 2023: ఆడేది మూడో వన్డే ప్రపంచకప్‌, అయినా మెగా టోర్నీలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన అఫ్గానిస్తాన్‌

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌ 2023లో సంచలన విజయాలు నమోదుచేస్తున్న అఫ్గానిస్తాన్‌.. తాజాగా ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదుచేసింది. ఆసీస్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌.. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 291 పరుగుల భారీ స్కోరు చేసింది.

Ajay Jadeja Dancing Video: వీడియో ఇదిగో, డ్యాన్స్‌తో ఆస్ట్రేలియాను కవ్వించిన అజయ్‌ జడేజా, లబుషేన్‌ను సరదాగా ట్రోల్‌ చేసిన అఫ్గనిస్తాన్‌ మెంటార్‌

Hazarath Reddy

అఫ్గనిస్తాన్‌ మెంటార్‌, టీమిండియా మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా ఆస్ట్రేలియా బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ను ట్రోల్‌ చేశాడు. తమపై ఫిర్యాదు చేసినందుకు డ్యాన్స్‌తో అతడిని కవ్వించాడు.వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది.

Advertisement

AUS vs AFG CWC 2023: రెండవ సెంచరీ పూర్తి చేసుకున్న గ్లెన్ మాక్స్‌వెల్, అంతకు ముందు నెదర్లాండ్స్‌పై ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు

Hazarath Reddy

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై మిగిలిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ విఫలమైనప్పటికీ, గ్లెన్ మాక్స్‌వెల్ తన జట్టును లక్ష్యానికి చేరువ చేసేందుకు సాహసోపేతంగా ఆడాడు. ఇంతకు ముందు నెదర్లాండ్స్‌పై ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేసిన మాక్స్‌వెల్, ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023లో తన రెండవ టన్నును పూర్తి చేశాడు.

Mitchell Starc Dismissal Video: వీడియో ఇదిగో, రివ్యూ తీసుకోకుండా బుక్ అయిన మిచెల్ స్టార్క్, కీలక వికెట్‌ను చేజార్చుకున్న ఆస్ట్రేలియా

Hazarath Reddy

భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో సంచలన విజయాలతో దూసుకుపోతున్న అఫ్గానిస్తాన్‌.. ఆస్ట్రేలియాతో ముంబైలోని వాంఖెడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కూడా గెలుపు దిశగా పయనిస్తోంది.కాగా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ ఇచ్చిన క్యాచ్ ను ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ ఇక్రమ్ అలీఖిల్ అందుకున్నాడు.

Virat Kohli on Criticism: స్వార్థం కోసం నెమ్మదిగా ఆడావనే విమర్శలకు ఘాటుగా బదులిచ్చిన విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా లేకపోవడంతో చివరి వరకు బ్యాటింగ్..

Hazarath Reddy

ఆదివారం జరిగిన ICC ODI ప్రపంచ కప్ 2023 లీగ్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి 49వ వన్డే సెంచరీతో ప్రపంచ రికార్డును సమం చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసేందుకు కోహ్లీ 121 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు.

Hasin Jahan on Mohammed Shami: వీడియో ఇదిగో, మాకు డబ్బులివ్వాలంటే గట్టిగా సంపాదించాలిగా, మొహమ్మద్ షమీ ప్రదర్శనపై భార్య హసీన్‌ జహాన్‌ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తానేం క్రికెట్‌కు గానీ క్రికెటర్లకు అభిమానిని కాదని తెలిపింది. ‘వరల్డ్‌ కప్‌లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఒకవేళ అతడు మంచి ప్రదర్శనలు చేస్తూ ఇలాగే ఆడితే అతడికి భారత జట్టులోనే ఉంటాడు. బాగా సంపాదిస్తాడు. అది మా భవిష్యత్‌ను మరింత సురక్షితం చేస్తుంది’ అని వెల్లడించింది.

Advertisement

Angelo Mathews Timed Out: నాకు ఎలాంటి బాధలేదు, రూల్స్‌లో ఉంది కాబట్టి అప్పీల్‌ చేశాను, ఏంజెలో మాథ్యూస్‌ టైమ్‌ ఔట్‌పై స్పందించిన బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కంటే నిమిషం ఆలస్యంగా బ్యాటింగ్‌ చేసేందుకు వచ్చి టైమ్‌ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.

Angelo Mathews Timed Out: టైమ్‌ ఔట్‌పై స్పందించిన ఏంజెలో మాథ్యూస్‌, బంగ్లా కాబట్టే అలా ప్రవర్తించిందంటూ విమర్శలు గుప్పించిన శ్రీలంక క్రికెటర్

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కంటే నిమిషం ఆలస్యంగా బ్యాటింగ్‌ చేసేందుకు వచ్చి టైమ్‌ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.

SL vs BAN, CWC 2023: ఓటమి తర్వాత బంగ్లాదేశ్‌ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించిన శ్రీలంక ఆటగాళ్లు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేసింది. ఆ తర్వాత ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. వరుసగా ఆరు పరాజయాలను చవిచూసి సెమీఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది. మాజీ విశ్వవిజేత శ్రీలంకతో జరిగిన ఈ పోరులో బంగ్లాదేశ్‌ మూడు వికెట్ల తేడాతో నెగ్గి మళ్లీ గెలుపుబాట పట్టింది.

Bangladesh vs Sri Lanka, World Cup 2023: బంగ్లా దేశ్ చేతిలో శ్రీలంక ఘోర ఓటమి...చరిత్ అసలంక సెంచరీ వృధా..

ahana

నజ్ముల్ హొస్సేన్ శాంటో, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అద్భుతమైన అర్ధ సెంచరీలతో శ్రీలంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Advertisement

World Cup 2023: భారత్‌పై ఘోర ఓటమితో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం, మొత్తం క్రికెట్ బోర్డునే తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన క్రీడల మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023)భారత్‌ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన శ్రీలంక జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో శ్రీలంక క్రీడల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం క్రికెట్ బోర్డునే తొలగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి మధ్యంతర బోర్డును ఏర్పాటు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

Unwanted Records in IND Vs SA: సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్ రికార్డుల హోరు, ఈడెన్ గార్డెన్స్ లో పలు రికార్డులను సృష్టించిన టీమిండియా

VNS

వన్డే వరల్డ్‌ కప్‌లో (CWC-23) భారత జైత్రయాత్రను కొనసాగిస్తూ ఆదివారం కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్‌ (Eden Gardens) వేదికగా సౌతాఫ్రికాతో (South Africa) ముగిసిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన దుమ్ముదులిపింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ టాప్‌ క్లాస్‌ పర్ఫార్మెన్స్‌తో రాణించి సఫారీలపై ఏకంగా 243 పరుగుల తేడాతో (IND Vs SA) ఘన విజయాన్ని అందుకుంది.

Modi Wishes to Team India:వాహ్ టీమిండియా! కోహ్లీ బర్త్‌ డే కు ఘనమైన గిఫ్ట్ ఇచ్చారు, భారత ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ

VNS

సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ లో టీమిండియా వరుసగా ఎనిమిదో విజయాన్ని (India Beat South Africa) నమోదుచేస్తూ టీమిండియా రికార్డులను బ్రేక్‌ చేసింది. ఈ మెగాటోర్నీలో పరుగుల వరద పారిస్తున్న సఫారీల ఆటలు భారత్‌ ముందు సాగలేదు. 400 పరుగులను అవలీలగా కొడుతున్న సౌతాఫ్రికా.. 327 పరుగుల ఛేదనలో ముక్కీమూలిగుతూ కనీసం మూడంకెల స్కోరు కూడా చేయకుండా 83 పరుగులకే చేతులెత్తేసింది.

India Beat South Africa: సఫారీలను చిత్తుగా ఓడించిన భారత్, కనీసం 100 పరుగులు కూడా కొట్టలేక చతికిల పడ్డ సౌతాఫ్రికా, ఏకంగా 243 పరుగుల తేడాతో భారత్ విజయం

VNS

వన్డే వరల్డ్‌ కప్‌లో (IND Vs SA) భారత జైత్రయాత్ర అప్రతీహాతంగా సాగుతోంది. వరుసగా ఎనిమిదో విజయాన్నినమోదుచేస్తూ టీమిండియా రికార్డులను బ్రేక్‌ చేసింది. ఈ మెగాటోర్నీలో పరుగుల వరద పారిస్తున్న సఫారీల ఆటలు భారత్‌ ముందు సాగలేదు. 400 పరుగులను అవలీలగా కొడుతున్న సౌతాఫ్రికా.. 327 పరుగుల ఛేదనలో ముక్కీమూలిగుతూ కనీసం మూడంకెల స్కోరు కూడా చేయకుండా 83 పరుగులకే చేతులెత్తేసింది.

Advertisement

Virat Kohli Century: సచిన్ సెంచరీల రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ.. బర్త్ డే రోజే సౌతాఫ్రికాపై 49వ సెంచరీ నమోదు చేసిన చిచ్చర పిడుగు

ahana

దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ ఈ అద్భుతమైన సెంచరీని నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ వన్డే కెరీర్‌లో ఇది 49వ సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్‌ రికార్డును సమం చేశాడు.

India vs South Africa, Viral Video: శుభ్ మాన్ గిల్ క్లీన్ బౌల్డ్ అయిన వీడియో చూస్తే, షాక్ తినడం ఖాయం..

ahana

భారత ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్‌ మహరాజ్‌, ఫామ్ లో ఉన్న బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌ వికెట్‌ పడగొట్టాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మహరాజ్ వేసిన తొలి ఓవర్ ఇది.

India vs South Africa, Viral Video : వైరల్ గా మారిన శ్రేయస్ అయ్యర్ సిక్సర్ వీడియో, సౌతాఫ్రికాపై ఎదురు దాడి చేస్తున్న కోహ్లీ, శ్రేయస్..

ahana

ప్రపంచకప్ 2023లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Sachin Tendulkar at Hyderabad: హైదరాబాద్ లో నేడు సచిన్ టెండూల్కర్ సందడి, హైదరాబాద్ హాఫ్ మారథాన్‌ ప్రారంభం..

ahana

హైదరాబాద్ లో సచిన్ తెందూల్కర్ సందడి చేశారు. గచ్చిబౌలి మైదానంలో ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో 20K, 10K, 5K రన్ ను సచిన్ జెండా ఊపి ప్రారంభించారు.

Advertisement
Advertisement