క్రీడలు
Asia Cup 2023: ఈ రోజు మ్యాచ్ రద్దు అయితే భారత్ కు భారీ నష్టం, మిగతా రెండు మ్యాచ్‌లు డూ ఆర్ డై పరిస్థితి, రిజర్వ్ డే రూల్స్ ఎలా ఉంటాయో తెలుసుకోండి
Hazarath Reddyఆసియాకప్‌-2023లో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ భారీ వర్షంతో వాయిదా పడని సంగతి విదితమే. టోర్నీ సూపర్‌-4లో భాగంగా కొలంబో వేదికగా ఆదివారం జరగిన మ్యాచ్ లో భారత్‌ ఇన్నింగ్స్‌ 24.1 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత వర్షం పడటంతో మ్యాచ్‌ను అంపైర్‌లు నిలిపివేశారు.
India vs Pakistan Match: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రేపటికి వాయిదా, వర్షం తగ్గకపోవడంతో అంపైర్ల నిర్ణయం, ఆగిపోయిన దగ్గరి నుంచే ప్రారంభం కానున్న మ్యాచ్‌
VNSఆసియా క‌ప్‌లో భార‌త్(India), పాకిస్థాన్(Paksitan) సూప‌ర్ 4 మ్యాచ్ కోసం ఎదురు చూసిన అభిమానుల‌కు వ‌రుణుడు షాకిచ్చాడు. వాన ఎంత‌కూ త‌గ్గ‌క‌పోవ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. అయితే.. రేపు రిజ‌ర్వ్ డే(Reserve Day) ఉండ‌డంతో 50 ఓవ‌ర్ల ఆటకు అవ‌కాశం ఉంది. భార‌త జ‌ట్టు 24.1వ ఓవ‌ర్‌తో య‌థావిధిగా ఇన్నింగ్స్ కొన‌సాగించ‌నుంది.
India Vs Pakistan: ఇండియా వర్సెస్ పాక్‌ మ్యాచ్‌లో వర్షం తగ్గకపోతే జరిగేది ఇదే! డక్‌వర్త్ లూయిస్‌ ప్రకారం పాక్‌ విజయలక్ష్యం ఎంత ఉండొచ్చు అంటే?
VNSఆసియా క‌ప్‌లో భార‌త్(Team India), పాకిస్థాన్(Pakistan) సూప‌ర్ 4 మ్యాచ్‌కు పూర్తిగా సాగేలా లేదు. వ‌ర్షం కార‌ణంగా ఇప్ప‌టికే గంట‌కుపైగా ఆట నిలిచిపోయింది. ఒక‌వేళ వాన‌ త‌గ్గినా కూడా ఔట్‌ఫీల్డ్ త‌డిగా ఉండ‌డంతో ఓవ‌ర్ల‌ను కుదించే అవ‌కాశం ఉంది. అయితే.. 7:30కి ఓసారి అంపైర్లు పిచ్‌ను ప‌రిశీలించ‌నున్నారు.
Asia Cup 2023: బాబర్‌ ప్రపంచ స్థాయి ఆటగాడు, పాక్ కెప్టెన్‌పై టీమిండియా ఓపెనర్‌ గిల్ ప్రశంసలు, మేము అతడిని ఫాలో అవుతామని వెల్లడి
Hazarath Reddyఆసియాకప్‌-2023లో నేడు దాయాదులతో భారత్ తలపడనుంది. టోర్నీ సూపర్‌-4లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి.అయితే మ్యాచ్ ముందు టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్ గిల్ విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశాడు.
Asia Cup 2023: ఆసియా కప్‌లో పాకిస్థాన్ తొలి విజయం, బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందిన పాక్‌, రాణించిన ఇమామ్ ఉల్ హక్
VNSసూప‌ర్-4 ద‌శ‌లో పాకిస్తాన్ (Pakistan Won) మొద‌టి విజ‌యాన్ని న‌మోదు చేసింది. లాహోర్‌లోని గ‌డాఫీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. బంగ్లాదేశ్ (Bangladesh) నిర్దేశించిన 194 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 39.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ICC World Cup 2023: ప్రపంచకప్ కోసం టీమిండియా కెప్టెన్‌ పేరు అనౌన్స్ చేయగానే రోహిత్ శర్మ రియాక్షన్ చూశారా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..
Hazarath Reddyఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ (World Cup 2023) కోసం టీమిండియా జ‌ట్టును బీసీసీఐ (BCCI) మంగళవారం ప్రకటించింది. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ (Agarkar), రోహిత్ శర్మ (Rohit Sharma) సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు.
Neeraj Chopra: నీర‌జ్ చోప్రా విగ్ర‌హంలోని ఈటె చోరీ.. వీడియో
Rudraఒలింపిక్స్‌ లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్ విభాగంలో భారత్‌ కు తొలి బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా విగ్ర‌హానికి అవ‌మానం జ‌రిగింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని మీర‌ట్‌ లో నీరజ్‌ గౌరవార్థం నిర్మించిన కాంస్య విగ్రహం చేతుల్లోని జావెలిన్‌ (ఈటె) మంగ‌ళ‌వారం రాత్రి చోరీ గురైంది.
South Africa Squad For WC: ప్రపంచకప్‌లో తలపడే దక్షిణాఫ్రికా జట్టు ఇదిగో, అందరూ ఆల్ రౌండర్లే.. భయంకర పేసర్లు
Hazarath Reddyభారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్‌ కోసం క్రికెట్‌ సౌతాఫ్రికా తమ జట్టును నేడు ప్రకటించింది. టెంబా బవుమా జట్టును ముందుండి నడిపించనున్నాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌, క్వింటన్‌ డికాక్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌, రీజా హెండ్రిక్స్‌, రైట్‌ ఆర్మ్‌ పేసర్‌ గెరాల్డ్‌ కొయెట్జీ జట్టులో చోటు దక్కించుకున్నారు.
Virender Sehwag: ప్లేయర్ల జెర్సీలపై టీమిండియా పేరు తీసేసి వెంటనే భారత్ అని రాయండి, మన దేశం అసలైన పేరు భారత్ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్
Hazarath Reddyప్రస్తుతం దేశంలో భారత్, ఇండియా అనే పేరుతో వివాదం నడుస్తోంది. అందులో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరాడు.మన దేశం పేరును భారత్ గా మార్చడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. పేరు అనేది మనలో గర్వాన్ని నింపేదిగా ఉండాలని నేను ఎప్పుడూ నమ్ముతాను.
Indian Squad for World Cup: ఆ ఇద్దరూ టీమిండియా జట్టు నుంచి ఔట్, వన్డే ప్రపంచ కప్‌కు భారత జట్టు ఇదిగో, పేస్ దళాన్ని నడిపించనున్న జస్ప్రీత్‌ బుమ్రా
Hazarath Reddyఅక్టోబర్‌ 5 నుంచి భారత్ వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023) కోసం బీసీసీఐ (BCCI) భారత జట్టును ప్రకటించింది. వన్డే ప్రపంచకప్‌-2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ICC 2023 ODI World Cup: భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ చూడాలంటే టికెట్ ఖరీదు రూ.57 లక్షలు, ప‌ట్ట‌ప‌గ‌లే దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ంటూ బీసీసీఐపై మండిపడుతున్న క్రికెట్ అభిమానులు
Hazarath Reddyవ‌ర‌ల్డ్‌క‌ప్‌ 2023లో భాగంగా అహ్మాదాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, పాకిస్థాన్(India Vs Pakistan) మ‌ధ్య అక్టోబ‌ర్ 14వ తేదిన మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.ఈ హైవోల్టేజ్ మ్యాచ్ చూడటానికి క్రికెట్ ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడుతున్నారు.
Asia Cup 2023: సూపర్‌-4 బెర్తు ఖాయం చేసుకున్న భారత్, 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసిన టీమిండియా, వికెట్ పడకుండానే ఘన విజయం
Hazarath Reddyఆసియా కప్‌ రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ పోరులో భారత్‌ 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్‌ షేక్‌ (97 బంతుల్లో 58; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు.
Hardik Pandya Hugs Umpire: వీడియో ఇదిగో, అంపైర్‌ను కౌగిలించుకుని పడిపడి నవ్విన హార్దిక్‌ పాండ్యా, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం
Hazarath Reddyఆసియాకప్ 2023లో భాగంగా భారత్-నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంపైర్‌ను హగ్ చేసుకొని నవ్వులు పూయించాడు. నేపాల్‌ ఇన్నింగ్స్‌ 34 ఓవర్‌ ఆఖరిలో వర్షం ఒక్కసారిగా కురిసింది.
Gambhir Shows Middle Finger To Fans: కోహ్లీ అభిమానులకు మిడిల్ ఫింగర్ చూపించిన గౌతం గంభీర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyవర్షం విరామం సమయంలో, అతను స్టేడియం నుండి బయటకు వెళ్తుండగా, అభిమానులు అతనికి 'కోహ్లీ, కోహ్లీ' నినాదాలతో స్వాగతం పలికారు. ప్రతీకారంగా, మాజీ క్రికెటర్ వారికి మధ్య వేలు చూపిస్తూ కనిపించాడు.
Jasprit Bumrah Becomes Father: తండ్రి అయిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన భార్య సంజన
Hazarath Reddyభారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రి అయ్యాడు.కాగా సోమవారం నేపాల్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌కు ముందు క్యాండీ నుండి ముంబైకి తిరిగి వచ్చిన సంగతి విదితమే. భారత ప్రీమియర్ పేసర్ తన నవజాత శిశువు చిత్రాన్ని ఇన్‌స్‌గ్రామ్‌లో పంచుకున్నాడు.
Bangladesh Vs Afghanistan: ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన బంగ్లాదేశ్, ఆసియాకప్‌లో కీలక మ్యాచ్‌లో విజయం, భారీ లక్ష్యాన్ని చేధించలేక తడబడ్డ ఆఫ్ఘనిస్తాన్
VNSఆసియా క‌ప్‌లో త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్(Bangladesh) ఆల్‌రౌండ్ జ‌ట్టు ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. ఈరోజు లాహోర్‌లోని గ‌డాఫీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో అఫ్గ‌నిస్థాన్‌(Afghanistan)పై 89 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.
India vs Pakistan: భారత్- పాక్‌ మ్యాచ్‌ వర్షార్పణం, చెరో పాయింట్ పంచుకున్న ఇరు జట్లు, ఒక్కబాల్‌ కూడా ఆడకుండానే ఆగిపోయిన మ్యాచ్‌
VNSవర్షం కారణంగా భారత్, పాక్‌ (IND vs PAK) మ్యాచ్‌ రద్దయింది. దీంతో ఇరుజట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. మ్యాచ్‌ ఆరంభం నుంచి వరుణుడు ఆటంకం కలిగిస్తూనే ఉన్నాడు. తొలుత భారత్ ఇన్నింగ్స్‌కు వర్షం రెండుసార్లు అంతరాయం కలిగించింది. మొత్తంమ్మీద టీమ్‌ఇండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది.
India Vs Pakistan Odi: పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఆలౌట్, మరో ఓవర్ మిగిలి ఉండగానే అన్ని వికెట్లు కోల్పోయిన టీమిండియా, ఆదుకున్న ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా
VNSపాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా (India Vs Pakistan) బ్యాటింగ్ ముగిసింది. 48.5 ఓవర్లలో 266 పరుగులకు (India Score) ఆలౌటైంది. రోహిత్ శర్మ (11), శుభ్‌మన్ గిల్ (10), విరాట్ కోహ్లీ (4), శ్రేయస్ అయ్యర్ (14) విఫలమయ్యారు.
Asia Cup 2023 IND vs PAK Live: నిలదొక్కుకున్న ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, 25 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసిన టీమిండియా, చెలరేగుతున్న పాక్ పేసర్లు..
ahana25 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 4 వికెట్లకు 127 పరుగులు. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ 43 పరుగులతో, పాండ్యా 30 పరుగులతో ఆడుతున్నారు.