క్రీడలు

ICC World Cup 2023: ప్రపంచకప్‌‌కు ముందే ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఇంటి దారి పట్టిన విధ్వంసకర ఆటగాడు మాక్స్‌వెల్‌, నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా కాలి మడమకు గాయం

Hazarath Reddy

భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023కు ముందే ఆస్ట్రేలియాకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్‌ ఆటగాళ్లు స్మిత్‌, స్టార్క్‌, వార్నర్‌, గ్రీన్‌ గాయపడగా తాజాగా వారి జాబితాలోకి ఆల్‌రౌండర్‌ మాక్స్‌వెల్‌ చేరాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ కోసం నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా మాక్స్‌వెల్‌ కాలి మడమకు గాయమైంది.

Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్‌ లో బంగారు పతకం

Rudra

ఒలింపిక్స్‌ లో భారత్‌ కు బంగారు పతకం అందించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరో చరిత్ర సృష్టించాడు. హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ లో అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో బంగారు పతకం అందించాడు.

Indian Women's Hockey Team: ఆసియా హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో భారత మహిళల హాకీ జట్టు 7-1తో జపాన్‌పై విజయం

ahana

మస్కట్‌లో జరిగిన ఆసియా హాకీ 5 ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో భారత మహిళల హాకీ జట్టు 7-1తో జపాన్‌పై విజయం సాధించింది.

India Women's Blind Cricket Team: వరల్డ్ గేమ్స్‌లో సత్తాచాటిన ఇండియా జట్టు, ఆస్ట్రేలియాను చిత్తుచేసి అంధుల క్రికెట్‌ టైటిల్‌ కైవసం చేసుకున్న భారత్‌

VNS

విశ్వవేదికపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. బర్మింగ్హమ్‌ (birmingham) వేదికగా జరిగిన తొలి ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్‌లో టైటిల్‌ కైవసం చేసుకుని భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు (India women's blind cricket team) చరిత్ర సృష్టించింది.

Advertisement

Hasaranga Breaks Down: వెక్కి వెక్కి ఏడ్చిన లంక ఆల్‌రౌండర్‌, చెల్లిపెళ్లి చేసుకొని వెళ్లిపోతుందని కన్నీరు పెట్టుకున్న హసరంగ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అప్పగింతల వీడియో

VNS

మా సోదరిని కష్టపెట్టకుండా బాగా చూసుకోవాలని బావగారిని కోరతారు. సెలబ్రెటీల ఇళ్లలో ఇలా జరగడం చాలా అరుదు. కానీ, శ్రీలంక ఆల్‌రౌండర్‌, స్టార్‌ క్రికెటర్‌ వానిందు హసరంగ (Wanindu Hasaranga) తన చెల్లి పెళ్లి అప్పగింతల సమయంలో చాలా ఎమోషనల్ (Hasaranga Breaks Down) అయ్యాడు

FIFA Suspends Luis Rubiales: గ్రౌండ్‌లోనే స్టార్‌ క్రీడాకారిణికి బలవంతంగా లిప్‌కిస్, స్పెయిన్ ఫుట్‌ బాల్ ఫెడరేషన్ చీఫ్ ప్రవర్తనపై పెల్లుబికిన ఆందోళనలు, సస్పెన్షన్ వేటు వేసిన ఫిఫా

VNS

స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ లూయిస్‌ రుబియాలెస్ (Luis Rubiales) తమ దేశ స్టార్‌ క్రీడాకారిణి జెన్నిఫర్‌ హెర్మోసోను (Jenni Hermoso) పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్నందుకు తగిన మూల్యం​ చెల్లించుకున్నాడు‌. ఈ ఉదంతం అనంతరం స్పెయిన్‌లో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో రుబియాలెస్‌పై ఫిఫా సస్పెన్షన్‌ (FIFA suspends) వేటు వేసింది

Rafael Nadal: ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్.. మూడేళ్ల పాటు ప్రచారకర్తగా బాధ్యతలు.. ఎంతో సంతోషంగా ఉందన్న టెన్నిస్ ఐకాన్

Rudra

స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తో చేయి కలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సేవలు అందిస్తున్న ఇన్ఫోసిస్ కు నాదల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడయ్యాడు.

Yuvraj Singh: మరోసారి తండ్రైన యువరాజ్‌ సింగ్, పండంటి పాపకు జన్మనిచ్చిన హజల్, నిద్రలేని రాత్రులు కూడా సంతోషాన్నిస్తాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్, ఇంతకీ యువీ పాప పేరంటో తెలుసా?

VNS

టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ (Yuvraj Singh) మ‌రోసారి తండ్రి అయ్యాడు. అత‌డి భార్య, న‌టి హాజెల్ కీచ్ (Hazel Keech) పండంటి ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇంటికి మ‌హాల‌క్ష్మి వ‌చ్చింద‌నే విష‌యాన్ని శ్రావ‌ణ శుక్ర‌వారం రోజున సోష‌ల్ మీడియా వేదిక‌గా యువీ తెలియ‌జేశాడు. చిన్నారికి ఆరా అని పేరు పెట్టిన‌ట్లు చెప్పాడు.

Advertisement

Asia Cup 2023: ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ ఇదిగో, టైటిల్ ఫేవరేట్‌గా భారత్, ప్రపంచ కప్‌కు ముందు జరుగుతున్న ప్రతిష్ఠాత్మక పోరులో గెలుపు ఎవరిది..

Hazarath Reddy

ముల్తాన్‌ తొలి వేదికగా ఆగష్టు 30 నుంచి ఆసియా క్రికెట్‌ సమరం మొదలు కానుంది. గతేడాది టీ 20 ఫార్మాట్‌లో నిర్వహించిన ఆసియా కప్‌ను శ్రీలంక గెలవగా... పాకిస్తాన్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే ఈ సారి భారత్ కప్ ఇంటికి తీసుకురావాలనే పట్టుదలతో ఉంది.

Neeraj Chopra: ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా, 88.77 మీటర్లు విసిరి గత రికార్డును అధిగమించిన భారత స్టార్

Hazarath Reddy

Rahmanullah Gurbaz: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన ఆఫ్గానిస్తాన్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్, 21 ఏళ్ల వయస్సులో అత్యధిక సెంచరీలు సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డు

Hazarath Reddy

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ రికార్డును గుర్బాజ్ బ్రేక్‌ చేశాడు. సచిన్‌ తన 21 ఏళ్ల వయస్సులో 4 వన్డే సెంచరీలు సాధించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్‌ ఓపెపర్‌ ‍క్వింటన్‌ డికాక్‌, శ్రీలంక మాజీ ఓపెనర్‌ ఉపుల్‌ తరంగా చెరో 6 సెంచరీలతో అగ్రస్ధానంలో సంయుక్తంగా కొనసాగుతున్నాడు.

FIDE World Cup 2023: ఫిడే చెస్ ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా మాగ్నస్‌ కార్ల్‌సన్, ఫైనల్లో పోరాడి ఓడిన భారత యువ ఆటగాడు ప్రజ్ఞానంద

Hazarath Reddy

ఫిడే చెస్ ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్ అవతరించాడు. హోరాహోరీగా సాగిన టై బ్రేక్స్‌లో ప్రజ్ఞానంద తొలి గేమ్‌ కోల్పోయి, రెండో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఫలితంగా కార్ల్‌సన్‌ విజేతగా నిలిచాడు.

Advertisement

WFI Membership Suspended: ప్రపంచ వేదికపై భారత్‌కు షాక్, డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వం రద్దు చేసిన యూడబ్ల్యూడబ్ల్యూ, ఎన్నికల నిర్వహణ ఆలస్యమే కారణం

Hazarath Reddy

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI ) సభ్యత్వాన్ని యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (United World Wrestling) రద్దు చేసింది. ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్‌ఐ విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ (UWW) వెల్లడించింది. డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Video: చంద్రయాన్ 3 ఘట్టాన్ని టీవీలో చూసిన ధోనీ, తన తొడ‌ల్ని కొడుతూ సంబరాలు చేసుకున్న మిస్టర్ కూల్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

చంద్ర‌యాన్-3కి చెందిన ల్యాండ‌ర్‌.. చంద్రుడిపై దిగిన క్ష‌ణాల‌ను టీవీల్లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసిన సంగతి విదితమే. ఈ అద్భుత ఘట్టాన్ని కోట్లాది మంది టీవీల్లో వీక్షించారు.మాజీ క్రికెట‌ర్ ధోనీ(MS Dhoni) కూడా త‌న మిత్రుల‌తో క‌లిసి ఆ ల్యాండింగ్ క్ష‌ణాల‌ను టీవీలో వీక్షించాడు

World Cup Tickets in BookMyShow: బుక్‌మైషోలో ప్రపంచ కప్ టికెట్లు, మాస్టర్ కార్డ్ ఉన్నవారికి ప్రీ సేల్ ఆఫర్

Hazarath Reddy

భారత్ వచ్చే నెల నుంచి ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే ప్రపంచ కప్ టికెట్లను విక్రయించేందుకు బుక్‌మైషో (BookMyShow) సంస్థతో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. బుక్‌మైషో తమ టికెటింగ్ భాగస్వామిగా ఉంటుందని తెలిపింది.

Team India Watch Chandrayaan 3 Launch: చంద్రయాన్‌ 3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను వీక్షించిన టీమిండియా సభ్యులు, జయహో ఇస్రో అంటూ ఇండియన్ క్రికెటర్స్ సంబురాలు

VNS

భార‌త క్రికెట‌ర్లు (Indian Cricketers) చంద్ర‌యాన్‌-3 ప్ర‌యోగాన్ని వీక్షిస్తున్నారు. చంద్రుడిపై ల్యాండ‌ర్ సేఫ్ ల్యాండైన వెంట‌నే క్రికెట‌ర్లు చ‌ప్ప‌ట్ల‌తో త‌మ ఆనందాన్ని తెలియ‌జేశారు. మ‌రికాసేప‌ట్లో ఐర్లాండ్‌తో టీమ్ఇండియా మూడో టీ20 మ్యాచ్ ఆడ‌నుంది. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌యాన్‌-3 ప్ర‌యోగాన్ని వీక్షించ‌డం విశేషం.

Advertisement

India Vs Ireland: నేడు భారత్‌-ఐర్లాండ్‌ మధ్య మూడో టీ20 మ్యాచ్‌, ఇప్పటికే 2-0తో సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్‌.

ahana

నేడు భారత్‌-ఐర్లాండ్‌ మధ్య మూడో టీ20 మ్యాచ్‌. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం. ఇప్పటికే 2-0తో సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్‌.

Heath Streak Passes Away: క్యాన్సర్‌ తో పోరాడి ఓడిన జింబాబ్వే దిగ్గజ ఆల్‌రౌండర్ హీత్ స్ట్రీక్.. 49 ఏళ్లకే కన్నుమూత

Rudra

జింబాబ్వే దిగ్గజ ఆల్‌ రౌండర్, క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. అతనికి 49 సంవత్సరాలు. క్యాన్సర్ కారణంగానే హీత్ స్ట్రీక్ మరణించినట్టు సమాచారం.

Asia Cup Streaming Free on Mobile: క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్, ఆసియా కప్ మ్యాచ్‌లన్నీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఫ్రీ, ఉచితంగా మీ మొబైల్ నుండి చూడొచ్చు

Hazarath Reddy

క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్‌. మీరు ఉచితంగానే ఆసియాకప్ మ్యాచ్‌లు చూడొచ్చు. ఆసియాకప్‌ మ్యాచ్‌లను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ ఫ్రీగా లైవ్‌స్ట్రీమింగ్‌ ఇవ్వనుంది. అభిమానులు మ్యాచ్‌లను తమ మొబైల్‌లో ఉచితంగా చూసుకోవ‌చ్చు. అయితే ఫ్రీ ఉచిత స్ట్రీమింగ్‌ను హైలైట్ చేస్తూ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ ఓ వీడియోను రీలీజ్‌ చేసింది.

India's Squad for Asia Cup 2023: ఆసియా కప్ టోర్నీకి 17 మందితో కూడిన జట్టు ఇదే, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కు మళ్లీ స్థానం

Hazarath Reddy

ఆసియా కప్ టోర్నీకి 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. గాయాల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కు మళ్లీ స్థానం దక్కింది. హైదరాబాద్ కు చెందన యువ కెరటం తిలక్ వర్మ జట్టులో స్థానాన్ని సంపాదించాడు. ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియాకప్ జరగనుంది.

Advertisement
Advertisement