Cricket

IPL 2022: గెలుపుతో ప్రారంభించి ఓటమితో ఇంటికి బయలుదేరిన కోల్‌కతా నైట్ రైడర్స్, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో చేతిలో ఓడిన శ్రేయస్‌ సేన

Hazarath Reddy

ఐపీఎల్ 2022 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కథ ముగిసింది. ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించిన కేకేఆర్‌ ఓటమితో ముగించి లీగ్‌ నుంచి నిష్క్రమించింది. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైన శ్రేయస్‌ సేన.. ప్రస్తుత ఎడిషన్‌లో 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 8 పరాజయాలు నమోదు చేసింది.

IPL 2022: అదేమి బ్యాటింగ్ క్వింటన్‌ డికాక్‌, పలు రికార్డులు బద్దలు కొట్టిన డికాక్-రాహుల్ ద్యయం, 2 పరుగుల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించిన లక్నో

Hazarath Reddy

ఐపీఎల్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య పోరు ఫ్యాన్స్‌కు విందు భోజనం అందించింది. బుధవారం జరిగిన హైస్కోరింగ్‌ మ్యాచ్‌లో (IPL 2022) లక్నో 2 పరుగుల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ చేరిన రెండో కొత్త జట్టుగా లక్నో నిలువగా, నిరుటి రన్నరప్‌ కోల్‌కతా తమ ప్రస్థానాన్ని ( Kolkata Get Eliminated) ముగించింది

IND vs SA: భారత టూర్‌కి సఫారీలు రెడీ, పొట్టి ప్రపంచకప్‌ తర్వాత సఫారీ జట్టు ఆడనున్న తొలి టీ20 సిరీస్‌, దక్షిణాఫ్రికా జట్టు పూర్తి వివరాలు ఇవే

Hazarath Reddy

వచ్చే నెలలో టీమ్‌ఇండియాతో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం మంగళవారం దక్షిణాఫ్రికా16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్‌ అనంతరం.. సఫారీ జట్టు ఆడనున్న తొలి టీ20 సిరీస్‌ ఇదే

IPL 2022: ముంబైని మట్టికరిపించిన హైదరాబాద్, ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా నిలుపుకున్న సన్ రైజర్స్, 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం

Hazarath Reddy

ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సమిష్టిగా సత్తాచాటింది. మొదట బ్యాటింగ్‌లో టాపార్డర్‌ దంచికొట్టడంతో భారీ స్కోరు చేసిన విలియమ్సన్‌ సేన.. ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైని అడ్డుకుంది. మంగళవారం జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది.

Advertisement

IPL 2022: ఐపీఎల్‌లో ఈ సారి సిక్సర్ల మోత మాములుగా లేదు, ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధింకంగా 896 సిక్సర్లు నమోదు, 1000 సిక్సర్లు నమోదవడం ఖాయమే మరి

Hazarath Reddy

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో బ్యాట్సెమెన్ల హవా కొనసాగుతుంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. బౌలింగ్‌లో అడపాదడపా ప్రదర్శనలు నమోదవుతుంటే.. బ్యాటింగ్‌లో రికార్డులు బద్ధలవుతున్నాయి.ఈ క్రమంలో ప్రస్తుత సీజన్‌ పలు భారీ సిక్సర్ల రికార్డులు కనుమరుగయ్యాయి.

Matheesha Pathirana:శ్రీలంక నుంచి మరో లసిత్ మలింగా, తొలి బంతికే వికెట్ తీసుకున్న మతీషా పతిరనా, 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టిన యువ పేసర్‌

Hazarath Reddy

ఐపీఎల్‌లో శ్రీలంక యువ పేసర్‌ మతీషా పతిరనా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పతిరనా తనదైన శైలి ఆటతో రెచ్చిపోయాడు. జూనియర్‌ మలింగగా పెరొందిన పతిరనా ఈ మ్యాచ్‌లో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు

IPL 2022: కీలక మ్యాచ్‌లో సత్తా చాటిన ఢిల్లీ, 17పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘన విజయం, 14 పాయింట్లతో నాలుగో స్థానంలోకి..

Hazarath Reddy

సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక సమయంలో అత్యవసర విజయంతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మెరుగు పర్చుకుంది. ముందంజ వేయాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో సోమవారం ఢిల్లీ 17 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తు చేసింది.

Australian Cricketer Andrew Symonds Dies In Car Crash: ఆసీస్ క్రికెట్ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్ హఠాన్మరణం, కారు ప్రమాదంలో మృతి

Krishna

క్రీడా ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది. ఆసీస్ దిగ్గజ ఆటగాడు, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement

IPL 2022: అంపైర్‌‌ని అయోమయంలో పడేసిన ధోనీ, వైడ్ ఇవ్వబోయి ఔట్ ఇచ్చిన అంపైర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఆరో ఓవర్‌ సమర్‌జిత్‌ సింగ్‌ వేశాడు. ఆ ఓవర్‌లో ఒక బంతిని సమర్‌జిత్‌ బ్యూటిఫుల్‌ ఇన్‌స్వింగర్‌ వేయగా.. ముంబై ఇండియన్స్‌ బ్యాటర్‌ ఎడ్జ్‌ను దాటుతూ కీపర్‌ ధోని చేతుల్లో పడింది. అయితే బ్యాట్‌కు తాకిన శబ్ధం వినిపించడంతో ధోని అప్పీల్‌ చేశాడు.

CSK vs MI IPL 2022 HIGHLIGHTS: కీలక మ్యాచ్‌లో చెన్నై చెత్త ఫర్మామెన్స్, ఇంటిబాట పట్టిన ధోనీసేన, ఫ్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సీఎస్కే, ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర పరాజయం

Naresh. VNS

ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ 15లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) కథ ముగిసింది. ధోనీ సేన ఇంటి దారి పట్టింది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై ఘోర పరాజయం పాలైంది. ముంబైతో(Mumbai) పోరులో ఓటమి చవిచూసిన చెన్నై.. ఫ్లే ఆఫ్స్ అవ‌కాశాల‌ను చేజార్చుకుంది. దాంతో పాటే ముంబై మాదిరే ఇంటిదారి ప‌ట్టింది

IPL 2022: మళ్లీ చెలరేగిన మిచెల్ మార్ష్, సాయం చేసిన డేవిడ్ వార్నర్, రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ ఘనవిజయం, సాహో మిచెల్ అంటున్న ఫ్యాన్స్

Naresh. VNS

రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) అదరగొట్టింది. రాజస్తాన్ పై ఘన విజయం సాధించింది. రాజస్తాన్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. 18.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన 161 పరుగులు చేసింది.ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (Mitchell Marsh)విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు

IPL 2022: రషీద్ ఖాన్ అరుదైన ఘనత, ఒక ఏడాదిలో టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు, 27 మ్యాచ్‌ల్లో 40 వికెట్లతో తొలిస్థానంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్

Hazarath Reddy

రషీద్‌ ఖాన్‌ టి20 క్రికెట్‌లో అరుదైన ఫీట్‌ అందుకున్నాడు. ఒక ఏడాదిలో టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రషీద్‌ తొలి స్థానంలో ఉన్నాడు. 2022 ఏడాదిలో రషీద్‌ ఇప్పటివరకు 27 మ్యాచ్‌ల్లో 40 వికెట్లతో తొలిస్థానం.. సందీప్‌ లమిచ్చానే 23 మ్యాచ్‌ల్లో 38 వికెట్లతో రెండు, డ్వేన్‌ బ్రావో 19 మ్యాచ్‌ల్లో 34 వికెట్లతో మూడు, జాసన్‌ హోల్డర్‌ 17 మ్యాచ్‌ల్లో 29 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

Advertisement

IPL 2022: దర్జాగా ప్లే ఆఫ్స్‌‌కు చేరిన గుజరాత్ టైటాన్స్, లక్నోను చిత్తు చేస్తూ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన గుజరాత్

Hazarath Reddy

ఐపీఎల్‌-15వ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది. లీగ్‌లో మొదటి సారి బరిలోకి దిగిన టైటాన్స్‌ ఆడిన 12 మ్యాచ్‌ల్లో తొమ్మిదింట నెగ్గి 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన ‘లో స్కోరింగ్‌’మ్యాచ్‌లో గుజరాత్‌ 62 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై విజయం సాధించింది.

IPL 2022: అరె ఇషాన్‌.. బంతి నీ పక్కనే ఉంది చూడు... బంతి కనపడక దిక్కులు చూసిన ఇషాన్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

ముంబై ఇండియన్స్‌, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంతి కనిపించకపోవడంతో ఇషాన్‌ కిషన్‌ కాసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ కుమార్‌ కార్తికేయ వేశాడు. ఓవర్‌ నాలుగో బంతిని నితీష్‌ రాణా రివర్స్‌ స్వీప్‌ ఆడే ప్రయత్నం చేశాడు.

IPL 2022: ముంబైని గెలిపించని బుమ్రా మ్యాజిక్, 52 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సీజన్‌లో ఐదో విజయం నమోదు

Hazarath Reddy

ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్‌లో ఏదీ కలిసి రావడం లేదు. జస్ప్రీత్‌ బుమ్రా ఐపీఎల్లో తొలిసారి ఐదు వికెట్లతో అదరగొట్టినా.. ముంబై ఇండియన్స్‌ను గెలిపించలేకపోయాడు. సోమవారం జరిగిన పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 52 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసి సీజన్‌లో ఐదో విజయం నమోదు చేసుకుంది. జస్ప్రీత్‌ బుమ్రా నాలుగు ఓవర్లలో 10 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.

IPL 2022: ఏంటయ్యా రషీద్‌ ఖాన్‌ ఈ ఫీల్డింగ్, సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న రషీద్‌ త్రో వీడియో

Hazarath Reddy

ఐపీఎల్‌ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబై ఇన్నింగ్స్‌ సమయంలో రషీద్‌ ఖాన్‌ మిస్‌ ఫీల్డింగ్‌ నవ్వులు పూయించింది. ప్రదీప్‌ సంగ్వాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో రెండో బంతిని ఇషాన్‌ కిషన్‌ కవర్స్‌ దిశగా ఆడాడు. అయితే బంతిని అందుకున్న రషీద్‌ త్రో విసరడంలో విఫలమయ్యాడు.

Advertisement

IPL 2022: ధోనీ రాకతో జోరు పెంచిన చెన్నై, 91 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ విజయాన్నిసాధించిన సీఎస్‌కే, కీలక వికెట్లు పడగొట్టిన మొయిన్‌ అలీ

Hazarath Reddy

ఢిల్లీతో జరిగిన పోరులో చెన్నై భారీ విజయంతో దుమ్మురేపింది. గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపర్చుకుందామనుకున్న ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 91 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

IPL 2022: మూడు సార్లు గోల్డెన్‌ డక్‌ ఔట్ అయిన కోహ్లీ, హైదరాబాద్‌పై ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు, హసరంగ డిసిల్వా స్పిన్ మాయాజాలంతో 67 పరుగుల తేడాతో రైజర్స్‌పై ఘన విజయం

Hazarath Reddy

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) వరుస విజయాలతో దూసుకెళుతున్నది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో (Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore)హైదరాబాద్‌పై బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది. ఆర్‌సీబీ 67 పరుగుల తేడాతో రైజర్స్‌పై ఘన విజయం సాధించింది.

Ben Stokes: ఒకే ఓవర్లో 34 పరుగులు, వరుసగా ఐదు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో విశ్వరూపం చూపించిన ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, వీడియో వైరల్

Hazarath Reddy

ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ గా నియమితుడైన బెన్ స్టోక్స్ కౌంటీ క్రికెట్లో విశ్వరూపం ప్రదర్శించాడు. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలో దిగిన స్టోక్స్ ఒకే ఓవర్లో 34 పరుగులు పిండుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్ వేసిన ఓ ఓవర్లో స్టోక్స్ వరుసగా ఐదు సిక్స్ లు, ఫోర్ బాదడం విశేషం.

'Shot of the Tournament': వార్నర్ మైండ్ బ్లోయింగ్ షాట్ వీడియో, మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచిన బౌండరీ షాట్, ఒక్కసారిగా ఖంగుతిన్న భువనేశ్వర్‌ కుమార్‌

Hazarath Reddy

ఐపీఎల్‌-2022లో గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అదరగొట్టాడు. 58 బంతుల్లో ఏకంగా 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 92 పరుగులతో వార్నర్‌ అజేయంగా నిలిచాడు. కాగా భువనేశ్వర్‌ కుమార్‌ ఓవర్‌లో వార్నర్‌ ఆడిన షాట్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

Advertisement
Advertisement