Cricket

Most Sixes in International Cricket: క్రిస్‌ గేల్‌ అత్యధిక సిక్స్‌లు రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ, అంతర్జాతీయ క్రికెట్‌లో 554 సిక్స్‌లు బాదిన టీమిండియా కెప్టెన్

Hazarath Reddy

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ ఈ అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ వేసిన నవీన్‌ ఉల్‌ బౌలింగ్‌లో ఐదో బంతిని సిక్స్‌గా మలిచిన రోహిత్‌.. ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

India vs Afghanistan, World Cup 2023: భారత్ ముందు భారీ లక్ష్యం ఉంచిన పసికూన ఆఫ్ఘనిస్తాన్, టీమిండియా లక్ష్యం 273 పరుగులు..

ahana

ICC ODI వరల్డ్ కప్ 9వ మ్యాచ్‌లో, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు భారత్‌ పై మొదట బ్యాటింగ్ చేసి 272 పరుగులు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 273 పరుగులు చేయాలి.

ICC World Cup 2023: నవీన్-ఉల్-హక్ vs విరాట్ కోహ్లీ, రసవత్తరంగా మారిన మ్యాచ్, అందరి కళ్లు వారిద్దరూ ఎదురుపడటం దాని పైనే..

Hazarath Reddy

2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడుతోంది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ అటాక్‌కు, భారత్ బ్యాటింగ్ పరాక్రమానికి మధ్య మ్యాచ్ జరగనుంది.

IND Vs AFG: వరల్డ్ కప్‌లో ఇవాళ మరో ఇంట్రస్టింగ్ మ్యాచ్‌, ఢిల్లీ వేదికగా ఆఫ్టనిస్తాన్‌తో ఢీకొట్టనున్న భారత్, ఈ సారైనా రోహిత్ హిట్ కొడతాడా?

VNS

భారత్‌ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి మాంచి ఊపు మీదుండగా.. తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో పరాజయం పాలైన అఫ్ఘాన్‌ టీమ్‌ భారత్‌పై సంచలనం నమోదు చేయాలని భావిస్తోంది. కాగా, ఈ ప్రపంచకప్‌లో (World Cup) ఇప్పటివరకు మొత్తం 8 మ్యాచ్‌లు జరిగాయి. ఇవాళ జరిగేది 9వ మ్యాచ్‌.

Advertisement

ICC World Cup 2023, Pakistan Vs Srilanka: శ్రీలంకను మట్టికరిపించిన పాకిస్థాన్, ప్రపంచ కప్ చరిత్రలో అతిపెద్ద చేజింగ్ రికార్డు స్థాపించిన పాక్, రిజ్వాన్ సెంచరీతో 344 పరుగుల టార్గెట్ ఛేదించిన పాకిస్థాన్..

ahana

ICC ODI ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు అదరగొట్టింది. శ్రీలంకను మట్టికరిపించింది. టోర్నమెంట్ చరిత్రలో అతిపెద్ద పరుగుల చేజ్ ను సాధించింది. మహ్మద్ రిజ్వాన్ అద్భుత సెంచరీ కారణంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిచింది.

ICC World Cup 2023: 137 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన ఇంగ్లండ్, వన్డే ప్రపంచకప్‌-2023లో తొలి విజయం నమోదు

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌-2023లో ఇంగ్లండ్‌ తొలి విజయాన్నినమోదు చేసింది. ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 137 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ICC World Cup 2023: ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా స్పిన్నర్‌ మిచెల్‌ సాంట్నర్‌ రికార్డు, తొలి న్యూజిలాండ్‌ స్పిన్నర్‌గా రికార్డు కూడా అతనిదే..

Hazarath Reddy

న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ సాంట్నర్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్‌ స్పిన్నర్‌గా అలాగే ప్రస్తుత ఎడిషన్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

ICC World Cup 2023: ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ రెండో విజయం,  నెదర్లాండ్స్‌పై 99 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ, మిచెల్‌ సాంట్నర్‌ స్పిన్ ధాటికి పసికూన విలవిల

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023లో న్యూజిలాండ్‌ వరుసగా రెండో విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్‌.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను 99 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

Advertisement

World Cup 2023: ఆప్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌కు కూడా కష్టమే, ఇంకా కోలుకోని టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్‌ గిల్‌, స్పష్టం చేసిన బీసీసీఐ

Hazarath Reddy

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఆరోగ్యంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కీలక అప్‌డేట్‌ అందించింది. అతడు చెన్నైలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని పేర్కొంది. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ కోసం భారత జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది.

Kohli Frustration Viral Video: ఔటైన ఫ్రస్టేషన్ లో డ్రెస్సింగ్ రూమ్ లో తల బాదుకున్న కోహ్లీ.. వీడియో వైరల్

Rudra

వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో టీమిండియా విజయం సాధించింది. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే,

IND Vs AUS: వరల్డ్ కప్‌ లో టీమిండియా బోణీ, ఆసిస్‌ తో మ్యాచ్‌ లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం, కీలక ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్, కోహ్లీ

VNS

ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌.. మ్యాచ్‌ ప్రారంభం నుంచే పరుగులు రాబట్టడానికి తంటాలు పడింది. వార్నర్‌, స్టీవెన్‌ స్మిత్‌ కొంతసేపు నిలకడగా ఆడటంతో స్కోర్‌ బోర్డు మెల్లగా ముందుకు సాగింది. ఆ ఇద్దరూ ఔటైన తర్వాత జట్టు పరిస్థితి దయనీయంగా మారింది. చివర్లో మిచెల్ స్టార్క్‌ (28) రాణించడంతో ఆసీస్‌ ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోర్‌నైనా చేయగలిగింది.

India vs Australia, World Cup 2023: భారత్ ఎదుట 199 పరుగులకే చతికిలపడ్డ ఆస్ట్రేలియా..టీమిండియా లక్ష్యం 200 పరుగులు మాత్రమే..

ahana

వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో 199 పరుగుల స్కోరు వద్ద ఆస్ట్రేలియాను భారత్ ఆలౌట్ చేసింది. టీమిండియా విజయానికి కేవలం 200 పరుగులు చేయాలి.

Advertisement

World Cup 2023, South Africa vs Sri Lanka: తొలి మ్యాచులో శ్రీలంకను చిత్తు చేసిన సౌతాఫ్రికా, 102 పరుగుల భారీ తేడాతో విజయం..

ahana

ప్రపంచ కప్ పోటీలో సౌతాఫ్రికా తన మొదటి మ్యాచ్‌లోనే రికార్డుల వర్షం కురిపించి ప్రత్యర్థి జట్లకు హెచ్చరిక పంపింది. ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా భారీ విజయం సాధించి ప్రపంచకప్‌లో తన ఉనికిని చాటుకుంది.

World Cup 2023, South Africa vs Sri Lanka: వరల్డ్ కప్ లో రికార్డు మోత మోగించిన సౌతాఫ్రికా, శ్రీలంక ముందు 429 పరుగుల భారీ లక్ష్యం..ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఐడెన్ మార్క్రామ్

ahana

వన్డే ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఐడెన్ మార్క్రామ్ ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. శనివారం సాయంత్రం అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అతను 49 బంతుల్లో ఈ సెంచరీని సాధించాడు.

IND vs AFG Final, Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టుకు స్వర్ణ పతకం

ahana

ఆసియా క్రీడలు 2023లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడలు 2023లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆఫ్ఘనిస్థాన్‌ కంటే ఎక్కువ సీడ్‌ కావడంతో భారత్‌ విజేతగా నిలిచింది.

Pak Won On Netherlands: పాక్ టార్గెట్‌ ను చేధించడంలో తడబడ్డ నెదర్లాండ్స్, ఉప్పల్ మ్యాచ్‌లో పాక్ విజయం, 9 ఓవర్లు ఉండగానే ఆల్‌ ఔట్

VNS

ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్-2023 టోర్నీలో (ICC World CUP) హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ (PAK Vs Netherlands) విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 286 పరుగులకు ఆల్ ఔట్ అయింది. 287 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 41 ఓవర్లకే 205 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.

Advertisement

World Cup 2023: భారత జట్టుకు భారీ షాక్, డెంగ్యూ బారీన పడిన టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌, ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఆడటంపై సస్పెన్స్

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనున్న సంగతి విదితమే. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు బిగ్‌ షాక్‌ తగిలింది. టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ డెంగ్యూతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

Asian Games 2023: అఫ్గనిస్తాన్‌ చేతిలో పాకిస్తాన్‌కు ఘోర ఓటమి, సెమీ ఫైనల్లో 4 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆప్ఘన్లు, ఫైనల్లో టీమిండియాతో రెడీ

Hazarath Reddy

చైనాలోని హోంగ్జూలో జరగుతున్న ఆసియా క్రీడలు-2023లో పాకిస్తాన్‌కు ఘోర ఓటమి ఎదురైంది. సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయిన పాక్‌ జట్టుకు చేదు అనుభవం మిగిలింది. గోల్డ్‌ మెడల్‌ రేసు నుంచి పాక్‌ క్రికెట్‌ బృందం నిష్క్రమించింది.

Asian Games: బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విక్ట‌రీ.. ఆసియా గేమ్స్ ఫైన‌ల్లోకి భార‌త్‌

Rudra

ఆసియా క్రీడ‌ల్లో ఇండియా ఫైన‌ల్లోకి దూసుకెళ్లింది. ఇవాళ జ‌రిగిన సెమీస్ మ్యాచ్‌ లో.. బంగ్లాదే శ్‌పై 9 వికెట్ల తేడాతో భార‌త జ‌ట్టు విజ‌యం సాధించింది.

ICC World Cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు భారీ షాక్, 9 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ అదిరిపోయే విక్టరీ, 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ఎదురైన ఓట‌మికి ప్రతీకారం

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ దుమ్మురేపింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై అదిరిపోయే విక్టరీ సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

Advertisement
Advertisement