Cricket
Disney Hot star: జియో దెబ్బకు దిగొచ్చిన హాట్‌స్టార్‌, క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇక పండుగే, భారత్‌లో జరిగే అన్ని క్రికెట్‌ మ్యాచ్‌లు ఫ్రీగా లైవ్‌ చూడొచ్చని హాట్‌స్టార్ ప్రకటన
VNSజియో సినిమా బాటలో వాల్ట్‌డిస్నీ కో హాట్‌స్టార్ ప్రయాణిస్తున్నది. ఇక నుంచి భారత్ లో జరిగే అన్ని క్రికెట్ టోర్నమెంట్లపై మొబైల్ ఫోన్లలో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం (Streaming) చేయనున్నది. క్రికెట్ పట్ల క్రేజ్ ఉన్న భారతీయుల మనస్సు చూరగొనేందుకు ఇటీవలే ముగిసిన ఐపీఎల్-2023 సీజన్‌లో రిలయన్స్ జియో ఆధీనంలోని ఓటీటీ ప్లాట్‌ఫామ్.. జియో సినిమా లక్షల మంది వీక్షకులను సొంతం చేసుకున్నది.
WTC Final 2023: ఫైనల్స్‌లో పట్టుసాధించిన ఆస్ట్రేలియా, తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఆసిస్‌, చేజింగ్ కష్టమే అంటున్న నిపుణులు
VNSప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్‌పై ఆస్ట్రేలియాప‌ట్టు సాధించింది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 123 ప‌రుగులు చేసింది. క్రీజులో ల‌బుషేన్‌(41), కామెరూన్ గ్రీన్‌(7)లు ఉన్నారు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా(Ravindra Jadeja) రెండు వికెట్లు తీయ‌గా, ఉమేశ్ యాద‌వ్‌ , మ‌హ్మ‌ద్ సిరాజ్‌లు చెరో వికెట్ ప‌డ‌గొట్టాడు
HC on Child Custody: విడాకుల తీసుకున్నా.. కన్నబిడ్డపై తల్లితో పాటు తండ్రికి కూడా హక్కులు ఉంటాయి, శిఖర్ ధావన్ కేసులో ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు కీలక తీర్పు
Hazarath Reddyక్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ కు దాదాపు మూడేళ్ల తరువాత ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు ద్వారా ఊరట లభించింది. ఈ సందర్భంగా అతని మాజీ భార్య అయేషా ముఖర్జికి కోర్టు చీవాట్లు పెట్టింది. తల్లి కస్టడీలో ఉన్న శిఖర్‌ ధావన్‌ 9 ఏళ్ల కొడుకు జొరావర్‌ను భారత్‌కు తీసుకురావాలని ఆదేశించింది
MS Dhoni As Footballer? పాఠ్య పుస్తకంలో పుట్‌బాల్ ఆటగాడిగా ఎంఎస్ ధోని, వైరల్ అవుతున్న పిక్ ఇదిగో..
Hazarath Reddyఎంఎస్ ధోనీ ఫుట్‌బాల్ ఆటగాడా? MS ధోని ఫుట్‌బాల్‌కు భావోద్వేగ అభిమాని. అతను చాలా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో ఫుట్‌బాల్ ఆడాడు. అతను ఇండియన్ సూపర్ లీగ్‌లో ఫుట్‌బాల్ జట్టుకు సహ యజమాని కూడా. అయితే ఇటీవల ఒక పాఠ్యపుస్తకం యొక్క చిత్రం వైరల్‌గా మారింది
Shubman Gill Wicket Video: వీడియో ఇదిగో, ఐపీఎల్ కింగ్ శుభ్‌మాన్ గిల్ అలా క్లీన్ బౌల్డ్ అయ్యాడేంటి, స్కాట్ వేసిన బాల్ దెబ్బకు బిత్తరపోయిన ఇండియన్ బ్యాటర్
Hazarath Reddyఆస్ట్రేలియన్ పేసర్ స్కాట్ బోలాండ్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేక భారత బ్యాటర్ గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆప్ స్టంప్ అవతల పడిన బంతిని వదిలేయాలని ప్రయత్నించి గిల్ బొక్క బోర్లా పడ్డాడు. అతను వదిలి వేయగానే అది లోపలికి వచ్చి స్టంప్స్‌ను ముద్దాడింది
World Cup Matches Free in Disney+ Hotstar: డిస్నీ+హాట్‌స్టార్ గుడ్ న్యూస్, మొబైల్ యూజర్లు ప్రపంచ కప్ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటన
Hazarath Reddyఐపిఎల్‌ను ఉచితంగా ప్రసారం చేయాలనే జియోసినిమా వ్యూహాన్ని అనుసరించి, డిస్నీ+ హాట్‌స్టార్ శుక్రవారం ఈ ఏడాది చివర్లో జరగనున్న ఆసియా కప్ మరియు ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లను డిస్నీ+హాట్‌స్టార్ ని యాక్సెస్ చేసే మొబైల్ ఫోన్ వినియోగదారులందరికీ ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటించింది
IND vs AUS, WTC Final Day 2 Review: రెండో రోజు చేతులెత్తేసిన రోహిత్ సేన, ఆసీస్ పేస్ ధాటికి పేకమేడలా కూలిన టీమిండియా...విజయంపై ఆశలు గల్లంతయ్యే అవకాశం..
kanhaICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రెండవ రోజు, టీమ్ ఇండియా టెస్టు మ్యాచ్‌ను కాపాడుకోవడం ఇప్పుడు కష్టతరంగా మారుతోంది. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ అద్భుత సెంచరీలు చేసిన పిచ్‌పై భారత్ స్టార్ బ్యాట్స్‌మెన్ పరుగుల కోసం తడబడుతున్నారు.
Ambati Tirupati Rayudu Met CM Jagan: సీఎం జగన్‌ని కలిసిన అంబటి రాయుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyటీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు
WTC 2023 Final: పరుగుల వరద పారిస్తున్న ఆస్ట్రేలియా బ్యాటర్లు, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ డే1 హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyలండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా- టీం ఇండియా మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (ICC World Test Championship Final) మ్యాచ్ Day 1లో భాగంగా మూడో సెషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం 62 ఓవర్లలో ఆస్ట్రేలియా బ్యాటర్లు 3 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేశారు.
Rohit Sharma Injured: టీమిండియాకు మరో షాక్, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బొట‌న వేలికి గాయం, కీల‌క పోరుకు హిట్‌మ్యాన్ దూరం అవుతాడా
Hazarath Reddyప్ర‌పంచ‌ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌(WTC Final 2023) మ్యాచ్‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) ప్రాక్టీస్ సెష‌న్‌లో గాయ‌ప‌డ్డాడు. అత‌డి ఎడ‌మ‌చేతి బొట‌న వేలికి చిన్న‌పాటి గాయం అయింది. బ్యాటింగ్ చేస్తుండ‌గా బంతి బొట‌న వేలికి బ‌లంగా తాకింది.
WTC Team of the Tournament: వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ పేరు తెరపైకి, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2021-2023 టీంను విడుదల చేసిన ఆస్ట్రేలియా
Hazarath ReddyWTC Team of the Tournamentను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గత రెండేళ్లలో ( WTC 2021-2023) బాగా రాణించిన వివిధ దేశాల ఆటగాళ్లతో తమ బెస్ట్ ఎలెవన్‌ను రూపొందించింది. ఈ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌, రిషబ్ పంత్ లకు చోటు దక్కింది.
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు భారత్‌కు మరో షాక్, నెట్స్‌లో గాయపడిన వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌
Hazarath Reddyజూన్‌ 7 నుంచి లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ జరగనుంది. తుది పోరులో ఆస్ట్రేలియా, భారత జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. అయితే ఈ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
Cricketers Photo Shoot: మన క్రికెటర్స్ ఫోటో షూట్.. జబర్దస్ట్ ఫోటోలు ఇవిగో..
Rudraటీమిండియా క్రికెటర్ల తాజా ఫోటోలను బీసీసీఐ షేర్ చేసింది. ఆ జబర్దస్ట్ ఫోటోలు ఇవిగో
David Warner Retire: టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పేస్తానని ప్రకటించిన డేవిడ్ వార్నర్,
kanhaప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తాజాగా ట్వీట్ ద్వారా తెలియజేశారు. త్వరలోనే జరగబోయే పాకిస్తాన్ తో టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ సందర్భంగా తాను రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు తెలిపారు.
Wrestlers Protest: దయచేసి పతకాలను గంగా నదిలో పడేయవద్దు, రెజ్లర్ల నిరసనపై 1983 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టు ప్రకటన, వారి సమస్య త్వరగా పరిష్కరించాలని వినతి
Hazarath Reddy1983 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టు రెజ్లర్ల నిరసనపై ప్రకటన విడుదల చేసింది - "మా ఛాంపియన్ రెజ్లర్లపై గత కొంత కాలం నుంచి జరుగుతున్న చూసి మేము బాధపడ్డాము, కలవరపడ్డాము. వారు కష్టపడి సంపాదించిన పతకాలను గంగా నదిలో పడేయాలని ఆలోచిస్తున్నందుకు మేము చాలా ఆందోళన చెందుతున్నాము.
MS Dhoni Surgery Successful: సీఎస్‌కే కెప్టెన్ ధోని మోకాలి ఆపరేషన్‌ సక్సెస్‌, మరో రెండు రోజుల పాటు అతను ఆసుపత్రిలోనే ఉంటాడని తెలిపిన సీఎస్‌కే సీఈఓ
Hazarath Reddyచెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్‌ ధోని మోకాలికి ఇవాళ (జూన్‌ 1) జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైందని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథ్‌ వెల్లడించారు. ముంబైలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో నేటి ఉదయం ధోనికి సర్జరీ జరిగిందని ఆయన తెలిపారు.
Team India New Jersey:టీం ఇండియా కొత్త జెర్సీ వీడియో ఇదిగో, వ‌న్డే, టీ20లకు కొంచెం భిన్నంగా జెర్సీలను రూపొందించిన అడిడాస్
Hazarath Reddyప్రపంచ‌టెస్టు చాంపియ‌న్‌షిప్(WTC 2023) మ‌రో వారంలో మెద‌లుకానుంది. కాగా ఈసారి భార‌త జ‌ట్టు కొత్త జెర్సీతో బ‌రిలోకి దిగ‌నుంది. మూడు ఫార్మాట్ల‌కు కొత్త జెర్సీల‌ను బీసీసీఐ(BCCI) ఈరోజు సాయంత్రం విడుద‌ల చేసింది. ఈమ‌ధ్యే కిట్ స్పాన్స‌ర్‌గా ఎంపికైన ప్ర‌ముఖ స్పోర్ట్స్ కంపెనీ అడిడాస్ లోగో జెర్సీ మీద ఉండ‌నుంది.
WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై గురి పెట్టిన ఇండియా, భారత్ శిక్షణా సెషన్ వీడియోను విడుదల చేసిన బీసీసీఐ
Hazarath ReddyICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్ కఠినమైన పరీక్షను ఎదుర్కొంటుంది. అత్యంత ముఖ్యమైన ICC WTC 2023 ఫైనల్ లండన్‌లోని ఓవల్‌లో జరుగుతుంది. కోచింగ్ సిబ్బందితో సహా భారత జట్టులోని చాలా మంది సభ్యులు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్నారు.
IPL Trophy In TTD Temple: శ్రీవారి సన్నిధిలో ఐపీఎల్ ట్రోఫీ, మొక్కు చెల్లించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం..
kanhaఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత దానిని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం చెన్నైలోని త్యాగరాయ నగర్ లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకెళ్లారు. అక్కడ ట్రోఫీకి ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం.
Ambati Rayudu Retirement: క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు, ఇది ఒక ఉద్వేగ సమయం అంటూ ట్వీట్
Hazarath Reddyఐపీఎల్ 2023 టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకున్న తర్వాత అంబటి రాయుడు భారత క్రికెట్‌లోని అన్ని రూపాలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వర్షం కారణంగా రిజర్వ్ డేకి తరలించబడిన ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఐపిఎల్ 2023 తన చివరి మ్యాచ్ అని రైట్ హ్యాండర్ గతంలో ప్రకటించాడు.