క్రికెట్

IPL 2023: రూ. 13 కోట్లు పెట్టి కొంటే ఇంత చెత్తగా ఆడుతున్నావ్, ఇంటికెళ్లి టెస్టులు ఆడుకో పోయి, హ్యారీ బ్రూక్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్న సన్ రైజర్స్ ఫ్యాన్స్

Hazarath Reddy

సొంత మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.

IPL 2023: వీడియో ఇదిగో, దారుణంగా అవమానించిన సన్‌రైజర్స్‌పై ప్రతీకారం తీర్చుకున్న డేవిడ్ వార్నర్, కంటతడి పెట్టిన ఎస్ఆర్‌హెచ్ అభిమానులు

Hazarath Reddy

ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో రైజర్స్‌ ఓటమి ఎదుర్కొంది. కాగా గతంలో అవమానకరంగా టీం నుంచి సాగనంపిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీపై ఢిల్లీ క్యాపిటల్స్‌ సారధి డేవిడ్‌ వార్నర్‌ ప్రతీకారం తీర్చుకున్నాడు

India Squad for WTC 2023 Final Announced: అజింక్యా రహానే రీ ఎంట్రీ, ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి టెస్ట్, భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

Hazarath Reddy

బోర్డ్ ఫర్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బిసిసిఐ) మంగళవారం ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటిసి) చివరి టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టును ప్రకటించింది. WTC ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లే ఆటగాళ్ల పేర్లను ప్రకటిస్తూ, BCCI ట్విట్టర్ లోకి వెళ్లింది. ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌కు టీమిండియా జాబితాలో గతంలో జట్టు నుండి తొలగించబడిన అజింక్యా రహానే పేరు ఉంది.

IPL 2023 SRH vs DC: ఉప్పల్ స్టేడియంలో పరువు తీసుకున్న సన్ రైజర్స్, 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం అందుకోలేక ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి..

kanha

ఐపీఎల్ 34వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. 145 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు అందుకోలేకపోయింది.

Advertisement

IPL 2023: అదేమి బౌలింగ్ సామి, అర్ష్‌దీప్‌ సింగ్‌ దెబ్బకి బీసీసీఐకి రూ. 80 లక్షలకు పైగా నష్టం, పంజాబ్ బౌలర్ యార్కర్ల ధాటికి రెండుసార్లు విరిగిపోయిన స్టంప్స్

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కిం‍గ్స్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి విదితమే. ఈ విజయంలో పంజాబ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ బీసీసీఐకి ఏకంగా రూ.88 లక్షలకు పైగా నష్టాన్ని కలిగించాడు.

IPL 2023: విరాట్ కోహ్లీ చెత్త చెత్తగా, ఏడు సార్లు గోల్డెన్‌ డకౌట్‌, జాబితాలో రెండో స్థానంలోకి వచ్చేసిన స్టార్ బ్యాటర్, తొలిస్థానంలో రషీద్‌ ఖాన్‌

Hazarath Reddy

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టాండిన్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గోల్డెన్‌ డకౌట్‌ అయిన సంగతి తెలిసిందే. బౌల్ట్‌ బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్బీగా వెనుదిరిగి షాకిచ్చాడు.ఈ క్రమంలో కోహ్లి ఐపీఎల్‌లో ఒక చెత్త రికార్డు నమోదు చేశాడు.

IPL 2023: వీడియో ఇదిగో, మహ్మద్‌ సిరాజ్‌ ఇన్‌స్వింగర్‌ దెబ్బకు బిత్తరపోయిన బట్లర్‌, మిడిల్‌ స్టంప్‌ను ఎగురగొట్టిన బంతి

Hazarath Reddy

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ అద్భుతమైన ఫామ్ తో దూసుకుపోతున్నాడు. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ నాలుగో బంతికి డేంజరస్‌ బ్యాటర్‌ జాస్‌ బట్లర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. అయితే బట్లర్‌ను ఔట్‌ చేసిన విధానం సిరాజ్‌ ఎంత మెరుగయ్యాడనేది చూపిస్తోంది.

Kohli Flying Kiss Video: వీడియో ఇదిగో, భార్య అనుష్క శర్మకు గాల్లో ముద్దులు పంపించిన కోహ్లి, తెగ సిగ్గుపడిపోయిన విరాట్ సతీమణి

Hazarath Reddy

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆదివారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఏడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. స్టాండిన్‌ కెప్టెన్‌గా కోహ్లికి ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం.ఇక ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ హర్షల్‌ పటేల్‌ వేశాడు. ఆ ఓవర్‌లో నాలుగో బంతిని జైశ్వాల్‌ భారీ షాట్‌కు యత్నించాడు.

Advertisement

Sachin Cute Birthday Post: 50 నాటౌట్ అంటూ టీ తాగుతున్న ఫోటోలను షేర్ చేసిన సచిన్ టెండూల్కర్, నేడు క్రికెట్ దిగ్గజం పుట్టినరోజు, సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

Hazarath Reddy

లెజెండ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఏప్రిల్ 24, సోమవారం తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రముఖ క్రీడాకారులు, సెలబ్రిటీలు, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో సచిన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

CSK Beat KKR: చెన్నైకి హ్యాట్రిక్ విక్టరీ, భారీ లక్ష్యాన్ని చేధించలేకపోయిన కోల్‌కతా, వృథాగా మారిన జెసన్, రింకూ పోరాటం, మరోసారి ధోనీ రివ్యూసిస్టమ్ మెరాకిల్

VNS

చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) బ్యాట‌ర్లు దంచి కొట్టారు. దాంతో, ధోనీ సేన ఈ సీజ‌న్‌లో హ్యాట్రిక్ విక్ట‌రీ కొట్టింది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై (Kolkata Knight Riders) 49 ప‌రుగుల తేడాతో గెలిచింది. ఓపెన‌ర్ డెవాన్ కాన్వే(56), అజింక్యా ర‌హానే(71), శివం దూబే(50) వీర కొట్టుడు కొట్ట‌డంతో చెన్నై 234 ప‌రుగులు చేసింది.

RCB Vs RR: చివరి ఓవర్ వరకు ఉత్కంఠ, సొంతగడ్డపై దుమ్మురేపిన ఆర్సీబీ, రాజస్థాన్ వెన్నువిరిసిన బెంగళూరు బౌలర్లు

VNS

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) మరోసారి అదరగొట్టింది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ (Rajasthan Royals) ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులకు పరిమితమైంది.

Punjab Kings defeated Mumbai Indians: ముంబై వెన్నువిరిచిన అర్షదీప్, భారీలక్ష్యాన్ని చేధించలేక చతికిల పడ్డ ముంబై ఇండియన్స్, సొంత గ్రౌండ్‌లోనే MIని చిత్తుగా ఓడించిన పంజాబ్‌

VNS

వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో (Mumbai Indians) జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) విజ‌యం సాధించింది. 215 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు న‌ష్ట‌పోయి 201 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో పంజాబ్ 13 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

MS Dhoni Retiring After IPL 2023: ఐపీఎల్ నుంచి రిటైర్మంట్ పై మహేంద్ర సింగ్ ధోనీ కీలక వ్యాఖ్యలు...త్వరలోనే నిర్ణయం..

kanha

శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత ధోనీ తన కెరీర్‌లో ఇదే చివరి దశ అని కొన్ని మాటల్లో చెప్పాడు.

CSK vs SRH Highlights: హైదరాబాద్‌ను వెంటాడుతున్న ఓటములు, సొంతగ్రౌండ్‌లో చెలరేగిన చెన్నై బౌలర్లు, బ్యాట్స్‌మెన్, ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం

VNS

ఐపీఎల్‌లో (IPL) సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌కు ఓటములు కొనసాగుతున్నాయి. ఈ సీజన్‌ లో నాలుగో ఓటమిని మూటగట్టుకుంది హైదరాబాద్. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో (Sunrisers Hyderabad) జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

IPL 2023 Playoffs Schedule: ఐపీఎల్ నుంచి సరికొత్త అప్‌డేట్, మే 22 నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్‌లు, మే 28న నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్, షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ

Hazarath Reddy

మార్చి 31న ప్రారంభమైన ఐపీఎల్ 16వ సీజన్ పోటీలు అత్యంత ఆసక్తిగా సాగుతున్నాయి. కాగా, ఐపీఎల్ తాజా సీజన్ ప్లే ఆఫ్ మ్యాచ్ ల షెడ్యూల్ ను బీసీసీఐ నేడు విడుదల చేసింది. మొత్తం 70 మ్యాచ్ లతో కూడిన ఐపీఎల్ లీగ్ దశ మే 21న ముగియనుంది. మే 22 నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరగనున్నాయి.

IPL 2023: వీడియో ఇదిగో, సిరాజ్ డైరక్ట్ త్రో దెబ్బకి షాకయిన హర్‌ప్రీత్‌, పెద్దగా అరుస్తూ కోహ్లీ సెలబ్రేట్,బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌ నమోదు చేసిన హైదరాబాదీ ఆటగాడు

Hazarath Reddy

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో ఆర్‌సీబీ బౌలర్‌ సిరాజ్‌ పంజాబ్‌ బ్యాటర్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌ బాటియాను రనౌట్‌ చేయడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

Advertisement

IPL 2023: వీడియో ఇదిగో, రేసులోకి వచ్చేసిన వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ, 4 ఓవర్లు బౌలింగ్‌ చేసి 19 పరగులిచ్చి రెండు కీలక వికెట్లు తీసుకున్న ఢిల్లీ పేసర్

Hazarath Reddy

టీమిండియా వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ దాదాపు 717 రోజుల తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌ ఆడి ఆకట్టుకున్నాడు. గురువారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఇషాంత్‌ 19 పరగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. కాగా ఈ ఏడాది జరిగిన మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇషాంత్‌ శర్మను రూ.50 లక్షలకు దక్కించుకుంది.

IPL 2023: తిన్నగా ఆడటం కూడా రాదు, చెత్త షాట్ ప్రయోగాలు మాత్రం చేస్తావు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటర్‌ మన్‌దీప్‌ సింగ్‌ పై మండిపడుతున్న కెకెఆర్ అభిమానులు

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటర్‌ మన్‌దీప్‌ సింగ్‌ తన చెత్త ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో అనవసర స్కూప్‌ షాట్‌ ఆడి క్లీన్‌ బౌల్డయ్యాడు.

IPL 2023, DC vs KKR: వార్నర్ మెరుపులు, మనీశ్ దూకుడు, ఎట్టకేలకు ఐపీఎల్ 2023లో గెలుపు ఖాతా ఓపెన్ చేసిన ఢిల్లీ, ఐదు ఓటముల అనంతరం తొలి విక్టరీ

Hazarath Reddy

ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్లో బోణీ కొట్టింది. ఐదు ఓటముల అనంతరం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన వార్నర్‌ సేన గురువారం జరిగిన రెండో పోరులో 4 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను చిత్తు చేసింది.మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది.

Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన విరాట్, సమంత, షారుఖ్, జగన్, పవన్ కల్యాణ్.. కారణం ఇదే!

Rudra

దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీనటులు ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సమంత, అలియా భట్, షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏపీ సీఎం జగన్, పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు.

Advertisement
Advertisement