నేడు మాఘ పౌర్ణమి కావడంతో త్రివేణి సంగమం కిక్కిరిసిపోయింది.తాజా సమాచారం ప్రకారం ఉదయం 10 గంటల వరకే కోటిన్నర మంది పుణ్య స్నానం చేశారు. ఇక నదీ స్నానం కోసం వస్తున్న భక్తుల సంఖ్య అధికంగా ఉన్నది. దాదాపు 10 కిలోమీటర్ల దూరం వరకు భక్తుల రద్దీ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే నేడు పుణ్య స్నానం చేశారు. ఆయన తన సతీమణితో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. అమృత స్నానంకు చెందిన ఫోటోను తన ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశారు.
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్(Maha Kumbh)లో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులపై ఇవాళ ఉదయం అధికారులు 25 క్వింటాళ్ల పువ్వులు కురిపించారు.సుమారు మూడు కోట్ల మంది ఇవాళ మహాకుంభ్‌లో స్నానాలు చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జనం రద్దీ పెరగడంతో ట్రాఫిక్ ప్లాన్‌ను మార్చేశారు. నగరంలోకి వాహనాల ఎంట్రీని నిషేధించారు. రద్దీని కంట్రోల్ చేసేందుకు భారీ సంఖ్యలో ప్రభుత్వ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. 15 జిల్లాల డీఎంలు, 20 మంది ఐఏఎస్‌లు, 85 మంది పీసీఎస్ ఆఫీసర్లు రంగంలోకి దిగారు.
Anil Kumble Visits Maha Kumbh Mela 2025
Blessed 🙏🏽#MahaKumbh #Prayagraj pic.twitter.com/OFY6T3yF5F
— Anil Kumble (@anilkumble1074) February 12, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)