భద్రత దళాలు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో 31 మంది నక్సలైట్లను హతమార్చారని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఇది మన దేశాన్ని నక్సలైట్లు ఉండని దేశంగా మార్చడంలో భద్రత దళాలకు లభించిన ఒక ప్రధాన విజయమని ఆయన అభివర్ణించారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర హోం మంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, భారత్‌ను నక్సలైట్లే ఉండని దేశంగా మార్చడంలో ఒక పెద్ద విజయాన్ని భద్రత దళాలు సాధించాయి, ఈ సైనికచర్యలో 31 మంది నక్సలైట్లు మట్టికరిచారు. భద్రత దళాలు ఆయుధాల్ని, పేలుడు సామగ్రిని పెద్ద ఎత్తున స్వాధీనపర్చుకొన్నాయని మంత్రి తెలిపారు.
మానవతకు శత్రువులా ఉన్న నక్సలిజాన్ని రూపుమాపడంలో ఈ రోజు ఇద్దరు సాహసిక సైనికులను మనం కోల్పోయామని కేంద్ర మంత్రి అన్నారు. ఈ వీరులకు దేశ ప్రజలు సదా రుణపడి ఉంటారని ఆయన అన్నారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు శ్రీ అమిత్ షా భావోద్వేగ భరిత సంతాపాన్ని వ్యక్తంచేశారు. 2026 మార్చి 31 కల్లా దేశంలో నుంచి నక్సలిజాన్ని పారదోలి, నక్సలిజం కారణంగా దేశంలో మరే పౌరుడు, పౌరురాలు వారి ప్రాణాల్ని పోగొట్టుకోకుండా చూస్తామని కూడా ఆయన పునరుద్ఘాటించారు.
HM Amit Shah on Naxalism:🚨 BIG STATEMENT from Home Minister Amit Shah.
"We will ELIMINATE menace of NAXALISM from all over INDIA by 31st March, 2026." 🔥 pic.twitter.com/bYiT7UX9dN
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 12, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)