Magh Purnima 2025 Pushpa Varsha on devotees at Maha Kumbh Mela(X)

Delhi, Feb 12:  మహా కుంభమేళా( Maha Kumbh Mela 2025) ఈ నెల 26తో ముగియనున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో ప్రయాగ్‌ రాజ్‌లోని త్రివేణి సంగమంకు తరలివస్తున్నారు. ఇక ఇవాళ మాఘ పూర్ణిమ (Magh Purnima 2025)కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలు భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో కుంభమేళాలో హెలీఫ్యాడ్‌తో అధికారులు పూల వర్షాన్ని కురిపించారు. ఇక ఇప్పటివరకు కుంభమేళాలో 46 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇక మరోవైపు ప్రయాగ్‌ రాజ్‌(Prayagraj)లో ట్రాఫిక్ సమస్య ఇంకా తగ్గలేదు. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా ఉన్నతాధికారులంతా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ప్రయాగరాజ్ మ‌హాకుంభ్‌లో పుణ్య స్నానం చేసిన క్రికెట‌ర్ అనిల్ కుంబ్లే దంప‌తులు, భక్తులతో కిక్కిరిసిపోయిన త్రివేణి సంగమం

ఇక మాఘ పూర్ణిమ రోజున నది స్నానం(Magh Purnima Snan) చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అంతేగాదు దేవతలు భూమిపై వస్తూ త్రివేణి సంగమంలో స్నానం చేస్తారని, తద్వారా భక్తులు శాంతిని, మోక్షాన్ని పొందగలుగుతారని ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఇవాళ పుణ్నస్నానం ఆచరించేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు.

ఫిబ్రవరి 11 సాయంత్రం 6:55 నుంచి ఫిబ్రవరి 12 సాయంత్రం 7:22 వరకు మాఘపూర్ణిమ స్నాన సమయం కొనసాగుతుందని తెలిపారు అధికారులు. మహాశివరాత్రి ఫిబ్రవరి 26తో కుంభమేళా ముగియనుంది.

 Pushpa Varsha on devotees at Maha Kumbh Mela

భక్తుల రద్దీ నేపథ్యంలో కుంభమేళా ప్రాంతాన్ని 'నో వెహికల్ జోన్'గా ప్రకటించారు. ప్రైవేట్, పబ్లిక్ వాహనాలను ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాల్లోనే ఉంచాలని.. అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలు మాత్రమే అనుమతిస్తారని పోలీసులు తెలిపారు. భక్తులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని యూపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

మాఘీ పౌర్ణమి సందర్భంగా ప్రజలకు, సాధువులకు, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. జనవరి 13న పౌష పౌర్ణమితో మహా కుంభమేళా ప్రారంభమైంది.