
Health Tips: నడక అనేకరకాల జబ్బులను తగ్గిస్తుంది. నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు 10,000 అడుగులు నడవడం ద్వారా లేదా కనీసం ఒక 40 నిమిషాల పాటు నడవడం వల్ల అనేకమైన తీవ్ర జబ్బులు దూరంగా ఉంటాయి. ప్రతిరోజు నడవడం వల్ల శరీరం ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల బరువు పెరగడం, ఉబకాయం, టైప్ 2 డయాబెటిస్ ,అధిక రక్తపోటు, గుండెపోటు, క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..
నడక వల్ల కలిగే ప్రయోజనాలు.. నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కండరాల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం బోలి ఎముకల వ్యాధి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలకు నడక చాలా మంచిది, నడక వల్ల మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మానసిక ,మెదడుకు సంబంధించిన ఆరోగ్యం కూడా మెరుగుపడుతూ ఉంటుంది. నిరాశ ఆందోళన ప్రమాదాలను తగ్గిస్తుందని డాక్టర్లు తెలుపుతున్నారు. నడక వల్ల ప్రతిరోజు రాత్రి త్వరగా నిద్ర కూడా పడుతుంది..
Health Tips: తరచుగా గ్యాస్ ప్రాబ్లం తో బాధపడుతున్నారా,
ఎలా నడవాలి- సాధారణంగా వేగంగా నడవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. నెమ్మదిగా నడవడం వల్ల అంతా ఉపయోగాలు ఉండవు. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే వేగంగా నడవడం చాలా ముఖ్యం వేగంగా నడవడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుంది. జీవక్రియ రేటు పెరుగుతుంది. అంతేకాకుండా మీ గుండెకు కూడా చాలా మంచిది. అనేక రకాల జబ్బులు రాకుండా ఉంటాయి.
ప్రతిరోజు 30 నుంచి 40 నిమిషాల పాటు నడవడం వల్ల అనేక రకాల జబ్బులు తొలగిపోతాయి. మీకు ప్రతిరోజు సాధ్యం కాకపోతే వారంలో కనీసం రెండు నుంచి మూడు రోజులైనా నడవడం మంచిది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి