![](https://test1.latestly.com/uploads/images/2024/07/gas.jpg?width=380&height=214)
Health Tips: ఈ మధ్యకాలంలో చాలామంది గ్యాస్ ప్రాబ్లం తో బాధపడుతున్నారు. జీవనశైలిలో మార్పు ఆహారపు అలవాట్లలో తేడాల వల్ల ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. వీరు తీసుకునే ఆహారంలో శ్రద్ధ చూపకపోవడం బయట ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా గ్యాస్ సమస్య, ఎసిడిటీ ,అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా గ్యాస్ ప్రాబ్లం, రాకుండా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నీరు ఎక్కువగా తాగాలి- నీరు మన శరీరానికి చాలా ముఖ్యం అయితే నీటిని తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆహారం తిన్న వెంటనే ఎప్పుడు కూడా నీరు త్రాగవద్దు. భోజనం చేసిన తర్వాత 45 నిమిషాల తర్వాత మాత్రమే నీరు త్రాగాలి. ఇలా చేయడం ద్వారా గ్యాస్ సమస్య వంటివి రాకుండా ఉంటాయి.
Health Tips: తరచుగా నీరసంగా అలసటగా అనిపిస్తుందా,
ఆహారాన్ని బాగా నమిలి తినాలి- మనం తీసుకున్న ఆహారాన్ని సరిగ్గా నమిలి తినాలి లేకపోతే జీర్ణం కాదు అటువంటి అప్పుడు అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి ఆహారాన్ని కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినడం ద్వారా జీర్ణం అవుతుంది. మనం తీసుకునే ఆహారాన్ని పూర్తిగా నమిలినప్పుడే అది జీర్ణం అవుతుంది..
ఫ్రైడ్ ఐటమ్స్ కి దూరంగా ఉండాలి- మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువగా డీప్ ఫ్రై ఐటమ్స్ ఉంటే వాటిని తగ్గించాలి. దీని వల్ల జీర్ణం సరిగా అవ్వదు దీనివల్ల గ్యాస్ సమస్య మరింతగా పెరుగుతుంది. అంతేకాకుండా తినేటప్పుడు మధ్యలో మంచినీళ్లు త్రాగడం మజ్జిగ వంటివి కూడా తగ్గించాలి.
భోజనం చేసిన తర్వాత ఒక గంట తర్వాత పెరుగును తీసుకున్నట్లయితే అందులో ప్రొబయాటిక్ అధికంగా ఉంటుంది ఇది పేరు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి అజీర్ణ సమస్యలను తొలగిస్తుంది. నీరు పుష్కలంగా తాగాలి శీతల పానీయాలకు దూరంగా ఉంటే మంచిది. తీసుకున్న బయట ఆహారాన్ని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ప్రతి రోజు ఉదయాన్నే జీలకర్ర నీటిని తీసుకోవడం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది. ఈ చిట్కాలు పాటిస్తే గ్యాస్ సమస్యలను తగ్గించుకోవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి