Health Tips: ఇప్పుడు ఉన్న బిజీ జీవనశైలిలో చాలామంది వెంట వెంటనే అలసిపోవడం నీరసంగా ఉండడం చాలా సమస్యగా మారింది. పని హడావుడి నిద్ర లేకపోవడం మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో వీరు త్వరగా నీరసపడుతూ ఉంటారు. వీరికి తక్షణ శక్తి ఇచ్చేందుకు కొన్ని ఆహార పదార్థాలు అవసరం అవుతాయి. అయితే అంతేకాకుండా కొన్ని ఆహార పదార్థాలను దూరం చేసుకోవాలి. అవేంటంటే కెఫెన్ చెక్కర ఉన్న ఆహార పదార్థాలను ఇవి మనకు శక్తి అందకుండా చేస్తాయి. వీటిని తగ్గించి సహజంగా మనకు శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అరటిపండు- అరటిపండు లో సహజంగా చక్కెర పొటాషియం విటమిన్ b6 వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరానికి కావాల్సినంత తక్షణ శక్తిని వెంటనే ఇస్తుంది. ఇది కండరాల కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరం త్వరగా కోల్పోవడానికి నీరసం నుంచి బయటపడడానికి అరటిపండు సహాయపడుతుంది. మీకు నీరసంగా అనిపిస్తే వెంటనే ఒక అరటిపండు తినడం ద్వారా తక్షణ శక్తి లభిస్తుంది.
Health Tips: తిన్న వెంటనే కడుపులో నొప్పి అనిపిస్తుందా,
ఓట్స్- ఓట్స్ చాలా అద్భుతమైన పోషక నువ్వు ఉన్న ఆహారం ఇందులో అధిక మొత్తంలో ఫైబరు కార్బోహైడ్రేట్లో ఉంటాయి. ఇది రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది. శరీరానికి కావాల్సినంత శక్తిని అందిస్తుంది. ఉదయాన్నే గ్లాస్ పాలల్లో ఓట్స్ వేసుకొని తినడం ద్వారా మీకు శక్తి లభించడంతోపాటు కడుపు కూడా హాయిగా ఉంటుంది.
నీరు- డీహైడ్రేషన్ వల్ల కొన్ని సార్లు మనకు నీరసం, అలసట అనిపిస్తుంది. మన శరీరంలో తగినంత నీరు లేనప్పుడు నీరసం నిసత్వ ఏర్పడుతుంది. మన శరీరంలో ప్రతి భాగానికి కూడా నీరు చాలా అత్యవసరం శరీరం డిహైడ్రేషన్ కి గురైనప్పుడు మనము నీరసపోయేలా చేస్తుంది. కాబట్టి ప్రతి రోజు రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగడం తప్పనిసరి.
ఖర్జూరాలు- ఖర్జూరాల్లో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇది తక్షణ శక్తికి మంచి మూలంగా చెప్పవచ్చు. దీన్ని తీసుకోవడం ద్వారా మెదడు కూడా చురుగ్గా ఉంటుంది.అలసట తగ్గుతుంది. ప్రతిరోజు ఒక నాలుగు డేట్స్ ఉదయాన్నే తీసుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా అలసట లేకుండా ఉంటారు.
గుడ్డు- గుడ్డులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది ఇది కండరాలకు బలాన్ని అందిస్తుంది. విటమిన్ డి అందిస్తుంది. శరీరానికి కావాల్సినంత శక్తిని అందిస్తుంది. గుడ్డు తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావాల్సిన ఏమైనా ఆసిడ్స్ అన్ని కూడా లభించి శరీరం నీరసంగా ఉండకుండా సహాయపడుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి