Health Tips: కొంతమందికి తిన్న వెంటనే కడుపులో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. కడుపులో నొప్పి తిమ్మిరిగా అనిపించడము కడుపు ఉబినట్టుగా అనిపించేటువంటివి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి తిన్న వెంటనే నొప్పిని కలిగించే అంశాల గురించి ఏ అలవాట్ల వల్ల ఇలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్రై ఐటమ్స్- డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం ద్వారా కడుపులో నొప్పి ఏర్పడుతుంది. గ్యాస్ బర్నింగ్ సెన్సేషన్ తిమ్మిరి వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇది తిన్న వెంటనే జీర్ణ వ్యవస్థ పైన ఒత్తిడి తెస్తుంది. దీని కారణంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీని వల్ల తిన్న వెంటనే కడుపులో నొప్పి వస్తుంది. కాబట్టి ఇటువంటి ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది.
Health Tips: రాత్రి భోజనం చేసిన వెంటనే పాలు తాగుతున్నారా?
త్వర త్వరగా తినడం- ఆహారాన్ని ఈ మధ్యకాలంలో చాలా మంది పూర్తిగా నెమలకుండా మింగుతూ ఉంటారు. దీనివల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగదు. దీనివల్ల గ్యాస్ కడుపులో నొప్పి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఆహారాన్ని ఎప్పుడు కూడా నెమ్మదిగా నమ్ముతూ సౌకర్యవంతంగా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి కడుపులో నొప్పి వంటి సమస్యలు తొలగిపోతాయి.
నీరు త్రాగకపోవడం- మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే నీరు చాలా అత్యవసరం. మన శరీరంలో నీరు తక్కువైనప్పుడు జీల వ్యవస్థ పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు కడుపులో నొప్పిని కలిగిస్తుంది. కాబట్టి సరైన మోతాదులో తీసుకోవడం వల్ల మన కడుపు ఎప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది.
ధూమపానం, మద్యపానం- ధూమపానం ,మద్యపానం రెండు కూడా కడుపునొప్పికి కారణం అవుతాయి. తిన్న వెంటనే ఈ రెండు పనులు చేయడం ద్వారా కడుపులో ఇబ్బంది గురవుతుంది. కడుపునొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. ఆల్కహాలు, సిగరెట్లు పేగుల కదలికలను మందగించేలాగా చేసి ఆహారాన్ని జీర్ణం కాని దీని వల్ల కడుపులో నొప్పి ఏర్పడుతుంది.
ఒత్తిడి- ఒత్తిడి ,ఆందోళన కడుపులో నొప్పులను పెంచుతాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరంలో అనేక రకాల హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి జీర్ణ క్రియను ప్రభావితం చేస్తాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆహారాన్ని తీసుకోవడం వల్ల కడుపులో నొప్పి తిమ్మిరి వంటి సమస్యలు ఏర్పడతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి