రాష్ట్రీయం
Harish Rao on Six Guarantees: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా? మీడియాకు హరీష్ రావు ఇచ్చిన సమాధానం ఇదే!
VNSరేపటి నుంచి అసెంబ్లీకి కేసీఆర్ వస్తారో.. రారో.. మీరే చూస్తారన్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడుతామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల చట్టబద్ధత కోసం పోరాడుతామన్నారు. రెండు విడతల రైతుబంధు ఇవ్వాలని అసెంబ్లీలో పట్టుబడుతామని.. ప్రజాసమస్యలపై గళం విప్పుతామన్నారు.
Ambati Rambabu Fire on Kutami: టీడీపీకి ఒక చట్టం, వైసీపీకి ఒక చట్టమా? మాపై ట్రోలింగ్ చేసిన వారిపై కేసులుండవా? అని ప్రశ్నించిన అంబటి రాంబాబు
VNSఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు వేర్వేరుగా చట్టాలు అమలు అవుతున్నాయని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu ) ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో (Social Media) అసభ్యకరంగా పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు
KCR on Telangana Thalli Statue: తెలంగాణ తల్లి విగ్రహంపై కేసీఆర్ స్పందన ఇదే! రేవంత్ సర్కారు తీరుపై ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ
VNSరైతుబంధు (Raithubandhu) తెచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలు వివరించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. గురుకులాలు, విద్యారంగంలో వైఫల్యాలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మూసీ, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని.. నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు.
KCR: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే-ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ చీఫ్ దిశానిర్దేశం
Arun Charagondaబీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు.. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ప్రసంగాల్లో చెప్పిన అంశాల్లో ఎంతమేరకు నిజం ఉందనేది ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు కేసీఆర్.
BRS Charge Sheet On Congress: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్, రేవంత్ రెడ్డి పాలన.. రైతు సంక్షేమానికి రాహు కాలం, వ్యవసాయానికి గ్రహణం అని హరీశ్ రావు మండిపాటు
Arun Charagondaకాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో రోడ్డెక్కని రంగమే లేదు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్‌షీట్ విడుదల చేశారు హరీశ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విద్యార్థుల దగ్గరినుంచి అవ్వా తాతల వరకు అన్ని వర్గాల వారిని రోడ్లు ఎక్కేలా చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు.
Vikarabad: కూతురు కళ్ల ముందే బావిలో దూకేసిన తల్లి - కొడుకు, వికారాబాద్‌లో విషాదం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Arun Charagondaవికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం గేటువనంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మేకలకు మేత వేద్దామని కూతురు, కొడుకును పొలం వద్దకు తీసుకెళ్లిన అరుంధ అనే మహిళ. కూతురు ఏడవడంతో ఇంటికి పంపించేసి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.
Medak: మెదక్‌లో ముసుగుదొంగ, 4 రోజులుగా వరుస దొంగతనాలు...పోలీసులకు సవాల్‌గా మారిన దొంగతనాలు..సీసీటీవీ వీడియో
Arun Charagondaమెదక్ జిల్లా పోలీసులకు సవాల్ విసురుతున్నాడు ముసుగు దొంగ. పాపన్నపేట మండలంలో గత 4 రోజులుగా అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడుతున్నాడు అగంతకుడు. ఇంటి బయట ఏ వస్తువులున్నా ఎత్తుకెళ్తున్నాడు గుర్తు తెలియని వ్యక్తి. సీసీటీవీ కెమెరాల్లో దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు కాగా వైరల్‌గా మారాయి.
Andhra Pradesh: పల్నాడు జిల్లాలో దారుణం...పొలాల్లో మహిళ మృతదేహం, వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానిస్తున్న పోలీసులు
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి శివారులోని పంటపొలాల్లో మృతదేహం లభ్యమైంది. మృతురాలు రంగా కాలనీకి చెందిన తోకల రమాదేవిగా గుర్తించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు పోలీసులు.
Telangana: మామపై చెప్పుతో దాడి చేసిన కోడలు, వీల్ ఛైర్‌లో ఉన్న మామ మొఖంపై చెప్పుతో కొట్టిన కోడలు..కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించని కోడలు..వీడియో ఇదిగో
Arun Charagondaమామ పై విచక్షణారహితంగా చెప్పుతో దాడి చేసింది ఓ కోడలు. నల్గొండ - వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో వృద్ధుడైన మామ పై విచక్షణారహితంగా దాడి చేసింది కోడలు. వీల్ చైర్‌లో ఉన్న మామ మొఖంపై పదే పదే చెప్పుతో దాడికి పాల్పడింది . కాళ్లు పట్టుకొని వేడుకున్నా కనికరించలేదు కోడలు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
KCR BRSLP Meeting: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై చర్చ
Rudraతెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ జరుగనుంది.
AP Minister Savita: ప్రేమోన్మాది దాడి ఘటనపై మంత్రి సవిత సీరియస్, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని కడప ఎస్పీకి ఆదేశం..విషమంగా బాధితురాలి ఆరోగ్యం
Arun Charagondaకడప జిల్ఆలో జరిగిన ప్రేమోన్మాది దాడి ఘటనపై మంత్రి సవిత సీరియస్ అయ్యారు. ఎస్పీ విద్యాసాగర్ తో ఫోన్ లో మాట్లాడిన సవిత...నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్య సేవలందించాలని రుమా ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు.
Andhra Pradesh: పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన ఇన్‌స్టాగ్రామ్, భార్య ఎదుటే ఆమె ప్రియుడికి దేహశుద్ది..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaపచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ. భార్య ఎదుటే ఆమె ప్రియుడికి దేహశుద్ధి చేశాడు భర్త. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఘటన చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం వడ్డిపల్లికి చెందిన ఇంద్ర శేఖర్ కు ఇన్‌స్టాగ్రామ్ లో వివాహితతో పరిచయం, ప్రేమగా మారింది. భార్య వ్యవహారాన్ని పసిగట్టి బుద్ధి చెప్పాలనుకున్నారు భర్త. ఇంద్రశేఖర్ ను పట్టుకుని తన భార్య ముందే దేహశుద్ధి చేశాడు భర్త.
Raging in School: స్కూల్ లో ర్యాగింగ్.. 6వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. మహబూబాబాద్ లో ఘటన
Rudraమహబూబాబాద్ జిల్లా గూడూరు ఆశ్రమ బాలుర పాఠశాలలో దారుణం జరిగింది. 6వ తరగతి చదువుతున్న విద్యార్థి రుత్విక్ ను 10వ తరగతి విద్యార్థులు ర్యాగింగ్ పేరిట వేధింపులకు గురిచేశారు.
CM Revanth Reddy: ఎన్ని కష్టాలైనా మూసీని ప్రక్షాళన చేసి తీరుతాం...సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు..స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaమూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంత ఖర్చయినా కానివ్వండి. ఎన్ని కష్టాలైనా రానివ్వండి. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది అన్నారు.
Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. స్పాట్ లోనే నలుగురు మృతి.. పల్నాడు జిల్లాలో ఘటన (వీడియో)
Rudraపల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ కారు ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్ లోనే మృతిచెందారు.
Gajwel Hit and Run Case: మనల్ని రక్షిస్తున్న రక్షకులనే భక్షించారు.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి.. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో హిట్ అండ్ రన్ ఘటన
Rudraసిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు జరిగింది. గుర్తుతెలియని వాహనం ఒకటి ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు.
Car Accident in Tirumala: తిరుమల కొండపై కారు దగ్ధం.. యజమాని అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం (వీడియో)
Rudraదేవదేవుడు ఆ వేంకటేశుడు కొలువైన తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ కారు హఠాత్తుగా దగ్ధం కావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Traffic Restrictions At Tankbund: ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో, ఈ వేళల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం
VNSవాయుసేన విమానాలు విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్‌బండ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించనున్నట్లు పోలీసులు తెలిపారు.
Bandi Sanjay Slams CM Revanth Reddy: ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో కాంగ్రెస్ కు మూడో స్థానమే, రేవంత్ రెడ్డి పాలనపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
VNSమనం కొట్లాడితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (bandi Sanjay) అన్నారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీజేపీ (BJP) గెలుపు ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. టీవీలు చూపిస్తున్నాయని నోటికొచ్చిన భాష మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) మండిపడ్డారు.
Telangana Govt Gazette on GP Merging: ఓఆర్ఆర్ సమీప మున్సిపాలిటీల్లో 51 గ్రామ పంచాయతీల విలీనం, గెజిట్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
VNSహైదరాబాద్ చుట్టూ ఉన్న 51 గ్రామ పంచాయతీలను పరిసర మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ 3 సబబేనని తేల్చిచెప్పింది. విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కీసర మండలంలోని సమీప మున్సిపాలిటీలో విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.