రాష్ట్రీయం
Ram Gopal Varma: ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వర్మ, నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో వెల్లడి
Hazarath Reddyవివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు. ఇప్పటికే క్వాష్ పిటిషన్ విషయంలో ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Telangana: వీడియో ఇదిగో, అర్ధరాత్రి గోడకు రంధ్రం చేసి వైన్ షాప్‌లో చొరబడిన దొంగలు, మద్యం సీసాలతోపాటు, నగదును ఎత్తుకెళ్లారు..
Hazarath Reddyపెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఓ వైన్ షాప్ లో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి గోడకు రంధ్రం చేసి, వైన్ షాప్ లోకి చొరబడి, మద్యం సీసాలతోపాటు, నగదును ఎత్తుకెళ్లారు.వైన్ షాప్ గోడకు రంధ్రం చేసేందుకు సుత్తెను ఉపయోగించి, దాన్ని అక్కడే వదిలి వెళ్లారు.
Hyderabad: బాలుడిపై పండ్ల వ్యాపారి లైంగిక దాడికి యత్నం, బాలుడు కేకలు వేయడంతో వ్యాపారిని పట్టుకున్న స్థానికులు, అరెస్ట్ చేసిన పోలీసులు
Arun Charagondaహైదరాబాద్ కూకట్‌పల్లిలో షాకింగ్ సంఘటన జరిగింది. బాలుడిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు ఓ పండ్ల వ్యాపారి. వివేకానందనగర్‌లో స్థానికంగా పండ్ల వ్యాపారం చేసే ఓ వ్యక్తి బాలుడిపై లైంగికదాడికి ప్రయత్నించాడు. బాలుడు కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని పండ్ల వ్యాపారి బంధించి పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Video: నన్ను కువైట్‌లో చంపేసేలా ఉన్నారు, కాపాడాలంటూ వీడియో విడుదల చేసిన కాకినాడ మహిళ, నన్ను ఎలాగైనా నా పిల్లల వద్దకు చేర్చాలంటూ కన్నీటిపర్యంతం
Hazarath Reddyకాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ పడుతున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపింది. ఈ ఘటం నియోజకవర్గంలో కలకలం రేపుతుంది..నాకు సరిగా తిండిపెట్టడంలేదు, చంపేసేలా ఉన్నారు.నన్న కాపాడి, పిల్లల వద్దకు చేర్చాలంటూ' కన్నీటి పర్యంతమవుతోంది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయిన వృద్ధురాలిని కాపాడిన పోలీసులు, శభాష్ పోలీసన్న అంటూ నెటిజన్ల ప్రశంసలు
Hazarath Reddyఏపీలోని నంద్యాల జిల్లా ముష్టపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. నీరు తెచ్చుకునేందుకు బావి వద్దకు వెళ్లిన ఓ వృద్దురాలు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. రక్షించాలని ఆమె కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి వెంటనే ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించారు
CM Revanth Reddy: వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి, రూ.127 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్న తెలంగాణ సీఎం
Arun Charagondaఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకోనున్నారు రేవంత్ రెడ్డి. వేములవాడ లో 127 కోట్ల 65 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మిడ్ మానేర్ నిర్వాసితులకు 4 వేల 696 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద చెక్కులు పంపిణీ చేయనున్నారు. గుడి చెరువు ప్రాంతంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ లో ప్రసంగించనున్నారు తెలంగాణ సీఎం.
Posani Krishna Murali: ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలులో వేస్తారా?, పవన్‌ను తిడితే ఖండించా.. అప్పుడు పోసాని మంచి వాడు....ఇప్పుడు ప్రజల కోసం ప్రశ్నిస్తే చెడ్డవాడా ?.ఇదెక్కడి న్యాయం అన్న పోసాని కృష్ణమురళి
Arun Charagondaనన్ను నా కుటుంబాన్ని తిట్టారు కాబట్టే వాళ్లని తిట్టాను అన్నారు వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన పోసాని... ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తారా ? చెప్పాలన్నారు. పోలీసులు నాపై విచారణ చేస్తే నేను తప్పు చేసినట్లు వాళ్ళకు ఎలాంటి ఆధారాలు దొరకవు..అన్యాయంగా ఒక మంచి నాయకుడిని నేను ఎన్నడూ తిట్టలేదు అన్నారు.
GHMC Demolitions: 50 గజాల్లో ఐదు అంతస్తుల భవనం, అనుమతి లేకుండా సెల్లార్ తవ్విన యజమానిపై కేసు, భవనం కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్ణయం..వీడియో
Arun Charagondaగ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిద్దిక్ నగర్‌లో భవనం కూల్చివేతకు జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. 50 గజాల్లో ఐదు అంతస్తుల్లో భవనం నిర్మించడంపై జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్ అయ్యారు. 60 శాతం పిల్లర్లు డ్యామేజ్ అయినట్లు గుర్తించారు ఇంజనీరింగ్ నిపుణులు. సెట్ బ్యాక్ లేకుండా పిల్లర్లు తవ్వడం వల్లే పక్కనే ఉన్న ఐదంతస్తుల భవనం ఒరిగినట్లు నిర్ధారణకు రాగా అనుమతి లేకుండా సెల్లార్ తవ్విన యజమానిపై కేసు నమోదు చేశారు.
Andhra Pradesh: అమ్మాయికి మెసేజ్ చేశాడని యువకుడిని చితకబాదిన ముగ్గురు యువకులు, తూర్పు గోదావరి జిల్లాలో ఘటన..వీడియో ఇదిగో
Arun Charagondaఅమ్మాయికి మెసేజ్ చేశాడని యువకుడిపై ముకుమ్మడిగా పాశవికంగా దాడి చేశారు ముగ్గురు యువకులు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధితుడు మలికిపురం AFDT జూనియర్ కళాశాలలో చదువుతున్నాడని తెలుస్తోంది.
Telangana: అఘోరితో అర్ధరాత్రి హిజ్రాల భేటీ.. పబ్లిక్ ప్రదేశాల్లో ఎందుకు తిరుగుతున్నావని హిజ్రాల ప్రశ్న.. స్మశాన వాటికలో ఉన్న అఘోరిని కలిసిన వరంగల్ హిజ్రాలు..వీడియో ఇదిగో
Arun Charagondaఅఘోరితో అర్ధరాత్రి హిజ్రాల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. స్మశాన వాటికలో సేద తీరుతున్నఅఘోరిని కలిశారు వరంగల్ హిజ్రాలు. పబ్లిక్ ప్రదేశాల్లో ఎందుకు తిరుగుతున్నావని, పర్యటనల పేరుతో ప్రజల్లోకి రావడంతో లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయని ప్రశ్నించారు హిజ్రాల సంఘం నాయకురాలు. అఘోరి మానసిక స్థితి తెలుసుకునేందుకు ప్రయత్నం చేయగా తాను ఏమీ మాట్లాడలేనని చెప్పింది అఘోరి.
Lagacharla Accused Suresh: సంగారెడ్డి సెంట్రల్ జైలుకు సురేష్, కొడంగల్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం సెంట్రల్ జైలుకు తరలింపు..వీడియో
Arun Charagondaలగచర్ల కేసులో A2 సురేష్ లొంగిపోవడంతో మరిన్ని విషయాలు బయటికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. A2 సురేష్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి సంగారెడ్డి సెంట్రల్ జైలుకి తరలించారు. కొడంగల్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం సంగారెడ్డి సెంట్రల్ జైలుకి తరలించగా పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఈ కుట్రకి మాస్టర్ ప్లాన్ వేసిన పెద్దల పేర్లు బయటపడతాయని భావిస్తున్నారు పోలీసులు.
Harishrao: శాతగానోనికి మాటలెక్కువ..సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్, రేవంత్ నోట.. బూతులు తప్ప నీతులు రాలేదు అని మండిపాటు
Arun Charagondaవరంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. శాతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి ఉందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుండి లంబాడి బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవు. తెలంగాణ ప్రజలు మరిచిపోరు అన్నారు.
YS Jagan Mohan Reddy: శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని దర్శించుకున్న వైఎస్ జగన్, శ్రీ విధుశేఖర భారతి స్వామీజీని కలిసి ఆశీర్వచనం తీసుకున్నమాజీ ముఖ్యమంత్రి
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు(మంగళవారం)సాయంత్రం విజయవాడ శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని దర్శించుకున్నారు. సత్యనారాయణపురంలోని శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని సందర్శించి..,శ్రీ విధుశేఖర భారతి మహా స్వామీజీని కలిశారు
AP Assembly Session 2024: మైలవరంలో మైనింగ్‌లో అక్రమాలు, గత ఎమ్మెల్యే హస్తం ఉందని తెలిపిన కొల్లు రవీంద్ర, సభలో నా పరువుకు భంగం కలిగిందని వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం
Hazarath Reddyఅసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్త చేశారు. మైలవరంలో మైనింగ్‌లో అక్రమాలు జరిగాయని అందులో గత ఎమ్మెల్యే హస్తం ఉందని మంత్రి శాసన మండలిలో నా ప్రస్తావన తెచ్చారు. కొల్లు రవీంద్ర వ్యాఖ్యలతో సభలో నా పరువుకు భంగం కలిగింది.
Heart Touching Video: హృదయాన్ని హత్తుకునే వీడియో ఇదిగో.. ఆరేళ్ల క్రితం తప్పిపోయిన కన్నతండ్రిని చూసి బాగోద్వేగానికి గురైన కూతుర్లు
Hazarath Reddyఆరు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి జూబిలిహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతంలో తిరుగుతుండగా బాలయ్య అనే వ్యక్తికి మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో 'ఆశ్రయం' కల్పించడం జరిగింది.
CM Revanth Reddy: వరంగల్ గడ్డ నుంచి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రుణమాఫీ కాని రైతుల రుణాలన్నీ త్వరలో మాఫీ చేస్తామని ప్రకటన
Hazarath Reddyతెలంగాణ గడ్డపై సూర్య, చంద్రులు ఉన్నంత వరకూ ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు, ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాను టీపీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యానని రేవంత్ రెడ్డి చెప్పారు.
Revanth Reddy on Sonia Gandhi: వీడియో ఇదిగో, సోనియా గాంధీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నా తక్కువే, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyవరంగల్‌ను అభివృద్ధి చేస్తే సగం తెలంగాణను వృద్ధిలోకి తీసుకొచ్చినట్లేనని సీఎం రేవంత్ (Revanth Reddy) రెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికంగా వరంగల్ (Warangal)ను అభివృద్ధి చేస్తామన్నారు.సోనియమ్మ మా తల్లి.. ఆమె కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నా అది తక్కువేనని రేవంత్ రెడ్డి అన్నారు..
Telangana HC Cancels GO No 16: కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు, ఇక నుంచి భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేయాలని ఆదేశాలు
Hazarath Reddyతెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10ఏ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16ను ధర్మాసనం కొట్టివేసింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.
Andhra Pradesh Assembly Session 2024: వీడియో ఇదిగో, మీరు కట్టుకున్న చీర చేనేతదేనా, ఎమ్మెల్యే లోకం మాధవిని సరదాగా ప్రశ్నించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ
Hazarath Reddyఉద్యోగులు నెలకు ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించేలా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అని మాధవి ప్రశ్నించగా... ఇంతకీ మీరు ధరించింది చేనేత చీరనా? లేక వేరే చీరనా? అని రఘురాజు ప్రశ్నించారు. తాను చేనేత చీరను ధరించానని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు.