రాష్ట్రీయం
Hyderabad: గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల భవనం కూల్చివేత వీడియో ఇదిగో, హైడ్రాలిక్ యంత్రం సాయంతో కూల్చివేస్తున్న అధికారులు
Hazarath Reddyహైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్థుల భవనం కూల్చివేత పనులను అధికారులు చేపట్టరు. ఇక్కడి సిద్ధిఖి నగర్‌లో కొద్దిపాటి స్థలంలో నిర్మించిన నాలుగంతస్థుల కొత్త భవనం నిన్న పక్కకు ఒరిగిన సంగతి విదితమే. పక్కన మరో భవనం నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో దీనిపై ఆ ప్రభావం పడిందని అంటున్నారు.
Telangana Weather Update: రాబోయే వారం రోజులు జాగ్రత్త, తెలంగాణలో 15 డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రతలు, ఆ వ్యాధి ప్రబలే అవకాశం
VNSతెలంగాణలో రానున్న వారం రోజులు 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు (Lowest Temperatures) నమోదుకానున్నాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది. శీతల సమయాల్లోనే ఇన్‌ఫ్లూయెంజా (Influenza) పంజా విసిరే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలుగా పేర్కొంది.
Harish Rao Serious On Government: గురుకులాలా లేక నరక కూపాలా? రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం
VNSప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పట్ల మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాలా లేక నరక కూపాలా అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా అని ప్రశ్నించారు. వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్‌తో అనారోగ్యం పాలై ఓ విద్యార్థిని 20 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై కొట్టుమిట్టాడుతున్నదని హరీశ్‌రావు తెలిపారు.
AP Cabinet key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం, ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటు
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో రూ. 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Praja Vijayotsava Sabha: కేసీఆర్..ఒక్కసారి అసెంబ్లీకి రా, అన్నీ లెక్కలు తేలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు, బీఆర్‌ఆఎస్ నేతలకు మైండ్ దొబ్బిందని విమర్శ
Hazarath Reddyవేములవాడలో కాంగ్రెస్ ప్రజా విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఓడించినా మార్పు రాలేదని అని అన్నారు.బీఆర్‌ఆఎస్ నేతలకు మైండ్ దొబ్బింది అని మండిపడ్డారు.
Anil Kumar Yadav: మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తాం, వైసీపీ నేతల అరెస్టులపై స్పందించిన అనిల్ కుమార్ యాదవ్, పార్టీ మారుతున్నారనే వార్తలు కొట్టివేత
Hazarath Reddyకూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.
YS Jagan on Sharmila: వీడియో ఇదిగో.. బాలకృష్ణ ఇంటి నుంచి షర్మిలపై తప్పుడు ప్రచారం, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీలో జరుగుతున్న తాజా పరిస్థితులపై వైఎస్ జగన్ మాట్లాడారు. తనపై, తన తల్లిపై, తన చెల్లిపై అసభ్య పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.
YS Jagan on Illegal Arrests: పదేళ్లు చంద్రబాబు సీఎం అంటూ పవన్ వ్యాఖ్యలపై స్పందించిన జగన్, మంచి పనులు చేసినవారిని ప్రజలు ఆశీర్వదిస్తారని వెల్లడి
Hazarath Reddyతాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీలో జరుగుతున్న తాజా పరిస్థితులపై వైఎస్ జగన్ మాట్లాడారు. చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని... ఆయనలో ఎప్పటికీ మార్పు రాదని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు
YS Jagan Slams Chandrababu: వీడియో ఇదిగో, ఏపీ అప్పుపై జగన్ సంచలన వ్యాఖ్యలు, చంద్రబాబు తప్పుడు ప్రచారం ఇదేనంటూ లెక్కలతో వివరణ ఇచ్చిన మాజీ సీఎం
Hazarath Reddyఎన్నికల టైమ్‌లో ఏపీ అప్పుల గురించి రూ.11 లక్షలు.. 12.5 లక్షలు.. 14 లక్షల కోట్లు అని చంద్రబాబు అన్నారు. మరి బడ్జెట్‌లో రూ.6.46 లక్షల కోట్లు అంటూ చూపించారు. అంటే ఇన్నాళ్లు నువ్వు చేసింది తప్పుడు ప్రచారమేగా? కొంచెం కూడా నీకు సిగ్గు అనిపించట్లేదా చంద్రబాబూ? అని జగన్ మండిపడ్డారు.
YS Jagan on Varma: రామ్ గోపాల్ వర్మకు అండగా నిలిచిన వైఎస్ జగన్, మీకు అనుకూలంగా సినిమాలు తీయకుంటే కేసులు పెడతారా అంటూ సూటి ప్రశ్న
Hazarath Reddyవర్మ చేసిన సినిమాకి సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది. రామ్ గోపాల్ వర్మను అక్రమంగా అరెస్ట్ చేయాలని మీరు ప్రయత్నించడం లేదా ? మీకు అనుకూలంగా సినిమాలు తీస్తే ఒకే. అదే వ్యతిరేకంగా సినిమాలు తీస్తే కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారని మండిపడ్డారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ధర్మవరం వీఆర్వో అరాచకం, మహిళా రైతు పొలం ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వడానికి రూ. 3 లక్షలు డిమాండ్
Hazarath Reddyధర్మవరం తహసీల్దార్ కార్యాలయంలో ఓ వీఆర్వో అరాచకంగా మారాడు. తన పొలానికి చెందిన ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని, తిరిగి ఇవ్వమంటే రూ.3 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని పోతుకుంటకు చెందిన శ్రీలలిత అనే మహిళా రైతు వాపోయింది. ఎదురు తిరిగిన రైతులను దుర్భాషలాడుతున్న వీఆర్వో. వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు.
Pawan Kalyan on Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు ఐదేళ్లు కాదు వచ్చే పదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyతెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘అక్రమ కేసులతో జైలులో పెట్టి చంద్రబాబును ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది.
Andhra Pradesh: పసివాడిని తీవ్రంగా కొట్టి ఒంటిపై రంగు పోసి భిక్షాటన, బాలుడిని వెంటనే కాపాడాలని అధికారులకు నారా లోకేష్ ఆదేశాలు, ట్వీట్ ఇదిగో..
Hazarath Reddyస్థానికుడు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బాలుడిని కాపాడాలని నారాలోకేష్‌ని కోరటంతో ఆయన రెస్పాన్స్ అయి బాబుని వెంటనే ఎక్కడ ఉన్నాడో కనుక్కుని సంరక్షించాలని అధికారులను ఆదేశించారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, నందిగామలో నడిరోడ్డుపై తన్నుకున్న టీడీపీ - వైసీపీ నాయకులు, నలుగురికి గాయాలు, వైసీపీ ఎంపీపీ మాలిక్ బషీర్‌తో పాటు 15 మందిపై హత్యాయత్నం కేసు నమోదు
Hazarath Reddyఏపీలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ,వైసీపీ నాయకుల మధ్య వివాదం నెలకొంది. కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో వ్యక్తిగత గొడవల కారణంగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నడిరోడ్డుపై రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు.
Weather Update: ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి వచ్చే మూడు రోజుల పాటు వర్ష సూచన, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం
Hazarath Reddyఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా వాయుగుండంగా బలపడొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు కదిలే అవకాశముందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు.
Hyderabad: హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం, శ్రీలక్ష్మీ క్లాత్ టెక్స్‌టైల్స్‌లో చెలరేగిన మంటలు..రూ.లక్షల్లో ఆస్తినష్టం..వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్‌లోని శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీలక్ష్మీ క్లాత్ టెక్స్‌టైల్స్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పింది అగ్నిమాపక సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్లు అనుమానం చేశారు. సుమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం.. కేసు నమోదు చేశారు అత్తాపూర్ పోలీసులు.
CM Revanth Reddy: సోషల్ మీడియా పోస్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, బావ- బామ్మర్థులకు మా పవర్ త్వరలో తెలుస్తుంది..పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపి మీరు ఏం వెలగబెట్టారో చెప్పాలని డిమాండ్
Arun Charagondaసోషల్ మీడియాలో నాలుగు పోస్టులు పెట్టి మొనగాళ్ళు అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడలో మాట్లాడిన రేవంత్.. రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేస్తే పెద్దామనిషిగా అభినందించాల్సింది పోయి చిల్లర మాటలు మాట్లాడతారా అని మండిపడ్డారు.
Telangana: ఆస్తిలో వాటా కోసం మామపై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్...వీడియో ఇదిగో
Arun Charagondaఆస్తిలో వాటా ఇవ్వాలని మామ పై దాడికి పాల్పడ్డాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. హైదరాబాద్ - లంగర్‌హౌస్‌కి చెందిన కానిస్టేబుల్ ఎం.డి.షాహిద్ ఖాన్ అనే వ్యక్తి గత కొద్దీ రోజులుగా మామ ఆస్తిలో తనకు కూడా వాటా ఇవ్వాలంటూ ఇందిరా నగర్లో ఉంటున్న బామ్మర్ది అబ్దుల్ వాహిద్ మరియు మామ పై దాడికి పాల్పడ్డాడు.
Andhra Pradesh: ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మనుగడలో లేదని తేల్చిచెప్పిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, లేని బిడ్డకు పేరు ఎలా పెడతాం అని వైసీపీ సభ్యులకు ఎదురు ప్రశ్న..వీడియో ఇదిగో
Arun Charagondaఏపీలో వాలంటీర్ వ్యవస్థ మనుగడలో లేదని తేల్చిచెప్పారు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి. వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి..వాలంటీర్ వ్యవస్థ లేని బిడ్డ లాంటిది..అసలు ఆ వ్యవస్థే లేదని చెప్పారు మంత్రి. లేని బిడ్డకు పేరు పెట్టడం ఎలా సాధ్యం? అని ఎదురు ప్రశ్న వేశారు. ఎన్నికల్లో కొనసాగిస్తాం అని హామీ ఇచ్చారు కదా అన్న ప్రశ్నకు.. అన్నాం.. కానీ మీరు కూడా సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి చేయలేదు కదా అంటూ డైవర్ట్ చేశారు మంత్రి.
CM Revanth Reddy: వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు , పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న రేవంత్..వీడియో ఇదిగో
Arun Charagondaవేములవాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం. మధ్యాహ్నం గుడి జాతర గ్రౌండ్‌లో బహిరంగ సభలో పాల్గొననున్నారు.