రాష్ట్రీయం

YS Sharmila Reddy: వీడియో ఇదిగో, కడప అమీన్‌పీర్‌ దర్గాను దర్శించుకున్న వైయస్ షర్మిల, దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన ఏపీసిసి చీఫ్

Hazarath Reddy

కడప అమీన్‌పీర్‌ దర్గాను ఏపీసిసి చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి దర్శించుకున్నారు. దర్గాలో కు విచ్చేసిన ఏపీసిసి చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి కు దర్గా సంప్రదాయం ప్రకారం దర్గా నిర్వాహకులు స్వాగతం పలికారు.దర్గాలో ఏపీసిసి చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, కేరళలో చిక్కుకున్న ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు, సాయం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు వీడియో ద్వారా విన్నపం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధి వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు..కేరళలో చిక్కుకున్నారు. వారు బరిమల యాత్రకు వెళ్లగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వాహనం చిక్కుకుందని వీడియో ద్వారా తెలిపారు.

Andhra Pradesh Shocker: విశాఖలో లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం కేసులో షాకింగ్ నిజాలు, ప్రేమించిన ప్రియుడే ఆమె పాలిట రాక్షసుడిగా స్నేహితులకు..

Hazarath Reddy

విశాఖపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.లా చదువుతున్న విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. న్యాయ విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని నగ్నంగా వీడియోలు తీసి నిందితులు బెదిరించారు.

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోండి, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో భేటీ అయిన వైఎస్ సునీత

Hazarath Reddy

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఈరోజు ఏపీ అసెంబ్లీకి వెళ్లి.. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో ఆమె భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసు గురించి ఆమెతో చర్చించారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి... జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు.

Advertisement

Gold Theft in SBI Bank: వరంగల్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ, 10 కోట్ల బంగారం చోరీ, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో రంగంలోకి దిగిన పోలీసులు

Hazarath Reddy

తెలంగాణలోని వరంగల్‌ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో గల ఎస్‌బీఐ బ్యాంకులో(SBI Bank) భారీ చోరీ(Massive robbery) జరిగింది. సుమారు రూ.10 కోట్ల విలువ చేసే బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. లాకర్‌లో భద్రపరిచిన బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది.

Kotamreddy Sridhar Reddy: చంద్రబాబును జైల్లో పెట్టేందుకు జగన్ ఫైళ్లను మాయం చేశారు, అసెంబ్లీలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో...

Hazarath Reddy

వైసీపీ హయాంలో చంద్రబాబు(Chandrababu)పై మహాకుట్ర జరిగిందని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy) ఆరోపించారు. ఓ టీవీ ఛానల్‌ చర్చలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ (PV Ramesh)దీనిపై చాలా స్పష్టంగా చెప్పారన్నారు.

Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, వల్లభనేని వంశీ అనుచరులు అరెస్ట్, టీడీపీ నేత రంగబాడుపై ఎలైట్‌ హోటల్‌ వద్ద దాడికి పాల్పడిన కేసులో అదుపులోకి..

Hazarath Reddy

గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన రంగబాబుపై వంశీ అనుచరులు గన్నవరం సమీపంలోని పార్క్‌ ఎలైట్‌ హోటల్‌ వద్ద దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో రంగబాబుకు గాయాలయ్యాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.పొలం విషయమై మాట్లాడేందుకు పిలిచి దాడి చేశారని ఫిర్యాదులో రంగబాబు పేర్కొన్నారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, టీడీపీ సోషల్‌ మీడియాలో వైఎస్‌ జగన్‌పై అసభ్యకర పోస్టులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు

Hazarath Reddy

వైఎస్‌ జగన్‌, ఆయన కుటుంబసభ్యులపై టీడీపీ సోషల్‌ మీడియాలో పోస్టులపై పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ పోస్టులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. వైఎస్‌ జగన్‌పై లోకేష్‌ చేసిన అసభ్యకర ట్వీట్లపై ఏం చర్యలు తీసుకున్నారంటూ అంబటి ప్రశ్నించారు

Advertisement

Telangana: వీడియో ఇదిగో, గుండెపోటుతో నాలుగేండ్ల చిన్నారి మృతి, తల్లిని చూడగానే పరిగెత్తుకు వచ్చి తల్లిని చేరకుండానే కుప్పకూలి తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

ఖమ్మం జిల్లా ఎమ్ వెంకటాయపాలెం లో గుండెపోటుతో నాలుగేండ్ల చిన్నారి మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. తల్లి లావణ్య గ్రూప్‌-3 పరీక్ష రాసి ఇంటికి రాగానే తల్లి దగ్గరకు పరిగెత్తుకు వెళ్లిన చిన్నారి తల్లిని చేరకుండానే ఛాలి నొప్పి అంటూ కుప్పకూలిపడిపోయింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, సీఎం చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం, ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి లభించకపోవడంతో..

Hazarath Reddy

సీఎం ChandrababuNaidu ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. నారావారిపల్లిలో సీఎం చంద్రబాబును కలవడానికి తిరుపతికి చెందిన యశోద అనే మహిళ వెళ్లగా, ఆమెకు అనుమతి లభించలేదు.

Hyderabad: హిందూ దేవాలయంలో నమాజ్ చదివిన ముస్లిం, సోషల్ మీడియాలో వీడియో వైరల్, మండిపడుతున్న నెటిజన్లు..

Hazarath Reddy

ఓ ముస్లిం వ్యక్తి దేవాలయంలో నమాజ్ చదివిన ఘటన హైదరాబాద్ నగరంలోని నాగోల్‌లో చోటు చేసుకుంది. అక్కడి ధనలక్ష్మీ నగర్ చండీ అమ్మవారి ఆలయానికి మాల వేసిన ఓ స్వామి వెంట ముస్లిం వ్యక్తి వచ్చాడు. అయ్యప్ప పూజ జరుగుతున్న నేపథ్యంలో నమాజ్ చదివాడు.

School Bus Accident: అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన స్కూల్ బస్సు.. 40 మంది విద్యార్థులకు గాయాలు.. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

Rudra

40 మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.

Advertisement

Car Accident in Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్‌ లో కారు బీభత్సం.. యాక్సిడెంట్ జరగ్గానే డ్రైవర్ పరారీ (వీడియో)

Rudra

హైదరాబాద్ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ISRO GSAT-20: ఎలాన్ మస్క్‌ ‘స్పేస్‌ ఎక్స్’ రాకెట్ ద్వారా ఇస్రో జీశాట్-20 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం.. ఎందుకోసం అంటే?

Rudra

ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్‌ కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ ఎక్స్’కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా జీశాట్-20 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది.

Degree Colleges Bandh Today: తెలంగాణలో నేటి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీల నిరవధిక బంద్‌.. కారణం ఏంటంటే?

Rudra

తెలంగాణలోని ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కాలేజీలు నేటి నుంచి (మంగళవారం) నిరవధికంగా బంద్‌ కానున్నాయి. గడిచిన రెండేండ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్య సంఘాలు తెలిపాయి.

Telugu IAS Sanjay Murthy: ‘కాగ్’ చీఫ్ గా తొలి తెలుగు వ్యక్తి సంజయ్‌ మూర్తి.. సంజయ్‌ మూర్తి తండ్రి కేఎస్ఆర్ మూర్తి అమలాపురం మాజీ ఎంపీ

Rudra

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చీఫ్ గా తెలుగు వ్యక్తి, ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఐఏఎస్ కొండ్రు సంజయ్‌ మూర్తి నియమితులయ్యారు. కాగ్‌ కు అధిపతిగా ఓ తెలుగు వ్యక్తి నియమితులవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, భద్రాచలంలో గోదావరి నది వంతెన పైనుండి దూకి ఆత్మహత్య చేసుకోబోయిన యువకుడు, చాకచక్యంగా కాపాడిన స్థానికులు

Hazarath Reddy

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం గోదావరి నది వంతెన పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువకుడు యత్నించాడు.వంతెన పైన కూర్చుని దూకేందుకు యత్నిస్తుండగా అటుగా వెళ్లే స్థానికులు అతన్ని మాటల్లో పెట్టారు. ఈ క్రమంలోనే వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి బైక్ పార్క్ చేశాడు.

Lagacharla Village Incident: బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ అరెస్ట్, లగచర్ల వెళుతుండగా మొయినాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

బీజేపీ నేతలు చేపట్టిన లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీకే అరుణ పర్యటనను మొయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు.

Lady Aghori Naga Sadhu: లేడీ అఘోరీ కారు అద్దాలపై కొడుతూ స్థానిక ప్రజల దాడి, రంగంలోకి దిగిన పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

విజయవాడ నడిరోడ్డుపై అఘోరి హల్ చల్ చేసింది. ఇబ్రహీంపట్నం వద్ద కారు నుంచి బయటకు రాకుండా కారులోనే పూజలు చేసింది. కారు నుండి బయటకి రావాలంటూ పోలీసుల సూచన పట్టించుకోని అఘోరి. దీంతో హైదరాబాద్-విజయవాడ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Telangana: వీడియో ఇదిగో, భార్య భర్తలు గొడవలో దూరిన పోలీసును చితకబాదిన దంపతులు, సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఘటన

Hazarath Reddy

అక్కడ ఉన్న ద్విచక్ర వాహనాన్ని కింద పడేసి తన హెల్మెట్తో వాహనాన్ని కొడుతున్న సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వచ్చి విడిపించే ప్రయత్నం చేయగా కానిస్టేబుల్ పైకి సైతం చొక్కా పట్టుకొని దాడి చేశారు.

Advertisement
Advertisement