రాష్ట్రీయం
High Security At Gandhi Bhavan: హైదరాబాద్ గాంధీభవన్ వద్ద హై సెక్యూరిటీ, హైడ్రా బాధితులు దాడి చేస్తారన్న అనుమానంతో పోలీస్ బందోబస్తు..వీడియో
Arun Charagondaహైడ్రా బాధితులు దాడి చేస్తారన్న అనుమానంతో గాంధీ భవన్ వద్ద హై సెక్యూరిటీ పెంచారు. గాంధీభవన్ చుట్టూ భారీగా పోలీసుల మోహరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఇళ్లను కూల్చుతోంది హైడ్రా. కూల్చివేతలను నిరసిస్తూ గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు మూసీ పరివాహక బాధితులు. ఈ నేపథ్యంలో బందోబస్తు పెంచారు.
Hyderabad: హైదరాబాద్‌లో కాలిబుడిదైన ఎలక్ట్రిక్ వాహనం, పక్కనే ఉన్న మెడికల్ షాపుకు అంటుకున్న మంటలు..వీడియో ఇదిగో
Arun Charagondaకుత్బుల్లాపూర్ సూరారం చౌరస్తాలోని ఆదిత్య మెడికల్ షాప్ వద్ద ఎలక్ట్రిక్ వాహనానికి మంటలు అంటుకుని దగ్ధమైంది. పక్కనే ఉన్న మెడికల్ షాప్ కు కూడా మంటలు అంటుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ ఛార్జ్ చేస్తుండగా మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు.
RK Roja On Chandrababu: శ్రీవారి మీదే నమ్మకం లేకుండా చేశారు, ఫేక్ రిపోర్టుతో డిఫెన్స్‌లోకి చంద్రబాబు, దేవుడు శిక్ష వేసిన బాబుకు బుద్దిరాలేదన్న మాజీ మంత్రి రోజా
Arun Charagondaఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి రోజా. చెన్నైలో మీడియాతో మాట్లాడిన రోజా.. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చాడంతో అదే తిరుమలలో చంద్రబాబు కు బాంబ్ బ్లాస్ట్ జరిగి.. దేవుడు శిక్ష వేసిన బుద్దిరాలేదన్నారు. చంద్రబాబు తన విధానాలతో వెంకటేశ్వర స్వామి మీదే నమ్మకం లేకుండా చేశాడన్నారు. ఇలాంటి దరిద్రపు రాజకీయాలు దేశంలో ఏ రాజకీయ నేత చేయలేదు అని దుయ్యబట్టారు.
Hydra Victims At Telangana Bhavan: ఆంధ్రా నుండి వచ్చి పదేళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు కూల్చేస్తామంటున్నారు..హరీశ్ రావుతో బాధితురాలు మొర..వీడియో
Arun Charagondaహైడ్రా బాధితులు తెలంగాణ భవన్‌కు క్యూ కట్టారు. ఆంధ్ర నుండి వచ్చి పది ఏండ్ల క్రితం హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాము.. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి బఫర్ జోన్లో ఉంది కూలకొట్టేస్తాం అంటున్నారు అని మాజీ మంత్రి హరీశ్ రావు ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
CM Chandrababu On Religions: ఏపీలో త్వరలో కొత్త చట్టం, ఏ మతాలకు చెందిన మందిరాల్లో వారే పనిచేయాలన్న సీఎం చంద్రబాబు, ఆలయాల్లో అన్యమతస్థులు ఉండటానికి వీల్లేదని వెల్లడి
Arun Charagondaఏపీలో త్వరలో కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు సీఎం చంద్రబాబు. ప్రార్థనా మందిరాలు, చర్చిలు, మసీదుల్లో ఆయా మతాలకు సంబంధించిన వారే పనిచేయాలన్నారు.
Harish Rao: తెలంగాణ భవన్ కు చేరుకున్న సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. హైడ్రా మూసీ బాధితులతో మాట్లాడనున్న మాజీ మంత్రి (వీడియో)
Rudraహైడ్రా మూసీ బాధిత కుటుంబాలు శనివారం ఉదయం నుంచి తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కాసేపటి క్రితం తెలంగాణ భవన్ కు చేరుకున్న సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. కాసేపట్లో వారితో మాట్లాడి వారి సమస్యలను వినబోతున్నారు. ఇప్పటికే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్కడికి చేరుకున్నారు.
Telangana Darshini: తెలంగాణ దర్శిని..విద్యార్థులు ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం
Arun Charagondaప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్. ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని చారిత్రక, పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులకు అవగాహన. కల్పించనున్నారు.
Road Accident: వావిలాలలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ బోళ్తా, 40కి పైగా ఆవులు మృతి..వీడియో ఇదిగో
Arun Charagondaజనగామ జిల్లా పాలకుర్తి మం. వావిలాల గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్రమంగా ఆవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ బోల్తా పడగా ఈ ఘటనలో 40కి పైగా ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. 60కి పైగా ఆవులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అర్థరాత్రి హైదరాబాద్ కు అక్రమంగా ఆవులను తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
HYDRA Notices to Shilpa Mohan Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి 'హైడ్రా' నోటీసులు.. సంగారెడ్డి జిల్లాలోని నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేసినట్లు గుర్తింపు
Rudraఏపీ మాజీ మంత్రి, వైఎస్సాఆర్ సీపీ నేత శిల్పా మోహన్ రెడ్డికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగ్సన్ పల్లిలోని నల్లవాగును ఆయన ఆక్రమించి వెంచర్ వేసినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు.
HYDRA Ranganath: 'హైడ్రా' కూల్చివేతల భయంతో కూకట్ పల్లిలో మహిళ బలవన్మరణం.. ఈ ఘటనతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదన్న కమిషనర్ రంగనాథ్
Rudraసహజ నీటి వనరులను అక్రమంగా చెరపట్టిన అక్రమార్కులపై పంజా విసురుతూ హైదరాబాద్ నగర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ హైడ్రా ఈమధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నది. అయితే, కూకట్ పల్లి పరిధిలోని యాదవ బస్తీకి చెందిన గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ హైడ్రా తమ ఇంటిని ఎక్కడ కూల్చివేస్తదో అన్న భయంతో బలవన్మరణానికి పాల్పడింది.
Constable Suicide: తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
Rudraరంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో తనను తాను కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
Jani Master Case: నన్నే ఆ అమ్మాయి వేధించింది! నా ఎదుగుదలను ఓర్వలేకనే కుట్ర చేశారు! పోలీస్ కస్టడీలో జానీ మాస్టర్ కీలక విషయాలు
VNSఅసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో మూడో రోజూ జానీ మాస్టర్ ను (Jani Master) పోలీసులు విచారించారు. ఇప్పటికే బాధితురాలి నుంచి రెండుసార్లు స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆ వివరాల ఆధారంగా జానీని ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసుల కస్టడీలో (Police Custody) జానీ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.
Traffic Advisory in Hyderabad: హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఎక్కడెక్కడ డైవర్షన్స్ ఉన్నాయంటే?
VNSశనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (draupadi murmu) హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సితక్కను తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్రపతికి స్వాగతం పలకడం నుంచి ఆమె నగరం విడిచి వెళ్లే వరకు రాష్ట్రపతి వెంటే వుండనున్నారు సీతక్క. రాష్ట్రపతి పర్యటనలో ఎక్కడా ఏ చిన్న అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలను సమన్వయం చేయనున్నారు
GHMC Commissioner Amrapali: హైదరాబాద్‌లో పోస్టర్లు బ్యాన్, ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ ఆమ్రాపాలి,పోస్టర్లు వేస్తే భారీ జరిమానా విధించాలని ఆదేశం
Arun Charagondaహైదరాబాద్‌లో పోస్టర్లు బ్యాన్ చేస్తున్నట్లు వెల్లడించారు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి. వాల్ పోస్టర్లు, వాల్ పెయింటింగ్స్‌పై సీరియస్‌గా వ్యవహరించాలని సర్క్యులర్ జారీ చేశారు కమిషనర్. సినిమా థియేటర్ వాళ్ళు కూడ ఎక్కడా పోస్టర్లు అతికించకుండ చూడాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. పోస్టర్లు వేస్తే జరిమానా విధించాలని ఆదేశించారు.
CM Revanth Reddy On Musi River Development: పర్యాటక ప్రాంతాలుగా చారిత్రాత్మక భవనాలు,సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకువెళ్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaమూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణ కు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐఐ తో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది.
Telangana Shocker: తెలంగాణలో దారుణం, ప్రేమించడం లేదని బస్సులో యువతిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు
Hazarath Reddyతెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కదులుతున్న బస్సులో ప్రియురాలిపై ఓ ప్రేమికుడు గురువారం చిన్న కత్తితో దాడి చేశాడు.నిందితుడిపై సెక్షన్ 74, 78 BNS, 320, 118 (1) BNS కింద ఫిర్యాదు నమోదు చేయబడింది. ఈ విషయంపై విచారణ నిమిత్తం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Dronavalli Harika Meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చెస్ ప్లేయర్స్ ద్రోణవల్లి హారిక, అర్జున్, ప్రోత్సాహక నగదు అందజేసిన సీఎం
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చెస్ ప్లేయర్స్ అర్జున్, ద్రోణవల్లి హారిక. FIDE చెస్ ఒలింపియాడ్ లో దేశం తరపున మొదటిసారి స్వర్ణపతకాలు సాధించారు అర్జున్, ద్రోణవల్లి హారిక. ఇద్దరిని అభినందించి రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు సీఎం.
Telangana Road Accident: వీడియో ఇదిగో, రెండు కాలేజీ బస్సుల ఢీ, ఒకరి మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు
Hazarath Reddyతెలంగాణలో రెండు కాలేజీ బస్సులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఈ ఘటన జరిగింది. బస్సులు రెండూ బీవీ రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ)కి చెందినవే కావడం గమనార్హం. నగర శివారులోని క్లాసిక్ గార్డెన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Jagan Press Meet: దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో ఇదే మొదటిసారి, ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందంటూ మండిపడిన వైఎస్ జగన్
Hazarath Reddyతన రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తాను తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు.
Addanki Dayakar On ED Rides: బీజేపీ కుట్రలో భాగమే ఈడీ దాడులు, కాంగ్రెస్‌కు వచ్చిన నష్టమేమి లేదన్న అద్దంకి దయాకర్..వీడియో ఇదిగో
Arun Charagondaఈడీ దాడులపై స్పందించారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. బీజేపీ చేస్తున్న కుట్రలోని భాగంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి పై ఈడీ దాడులు అని...దీని వలన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమి లేదు అన్నారు. బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని....ఎలాంటి చెడ్డ పేరు లేకుండా మంచి వ్యాపార వేత్త గా పేరున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.