రాష్ట్రీయం

Jagan Cancels Tirupati Visit: జగన్ తిరుమల పర్యటన రద్దు, తిరుపతి పర్యటన పూర్తి వివరాలపై కాసేపట్లో ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్న వైసీపీ అధినేత

Hazarath Reddy

వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన అనూహ్య రీతిలో రద్దయింది. ఈ సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని, రేపు (సెప్టెంబరు 28) స్వామివారి దర్శనం చేసుకోవాలని జగన్ భావించారు.

Andhra Pradesh: షాకింగ్ వీడియో, వాగు దాటేందుకు బాలింత కష్టాలు, భుజంపై మోసి పెద్దేరు వాగును దాటించిన కుటుంబ స‌భ్యులు

Hazarath Reddy

వాగు దాటేందుకు బాలింత కష్టాలు...అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండలో బాలింత‌ను ఆస్ప‌త్రికి తీసుకువెళ్ళేందుకు అవ‌స్థ‌లు ప‌డిన కుటుంబ స‌భ్యులు. ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో బాలింత‌ను భుజంపై మోసి, పెద్దేరువాగు దాటించిన కుటుంబ స‌భ్యులు. ప్ర‌భుత్వం స్పందించి త‌మ గ్రామానికి బ్రిడ్జ్ నిర్మించాల‌ని కోరుతున్న గ్రామ‌స్తులు

Harishrao On Runmafi: రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీశ్‌ రావు డెడ్ లైన్, దసరా లోపు రుణమాఫీ చేయకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక

Arun Charagonda

రుణమాఫీపై ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి డెడ్ లైన్ విధించారు. దసరా పండగలోపు రుణమాఫీ చెయ్యకపోతే మొత్తం తెలంగాణ వచ్చి నీ సెక్రటేరియట్‌ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు హరీశ్‌.

Andhra Pradesh: చంద్రబాబుపై ప్రేమతో ఓట్లు వేయలేదు, జగన్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే ఓట్లు పడ్డాయి, చంద్రబాబు విజయంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

వైసీపీ అధినేత జగన్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే చంద్రబాబుకు ఓట్లు పడ్డాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కూటమి పార్టీలపై ప్రేమతో ఓట్లు పడలేదని ఆమె చెప్పారు. చంద్రబాబు సీఎంగా వద్దు అనుకున్న ఓటర్లు కూడా 38 శాతం మంది ఉన్నారని అన్నారు

Advertisement

Theft At Bhatti Vikramarka House:తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం, ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

Arun Charagonda

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. పశ్చిమ్‌బెంగాల్‌లో ఖరగ్‌పూర్‌ జీఆర్‌పీ పోలీసులు ఇద్దరి నిందితులను అరెస్ట్‌ చేయగా నిందితుల నుంచి రూ 2.2 లక్షల నగదుతో పాటు బంగారం,వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్‌, ఉదయ్‌కుమార్‌ ఠాకూర్‌గా గుర్తించామని తెలిపారు.

New Flight Services From Hyderabad: హైదరాబాద్‌ నుండి మూడు కొత్త విమాన సర్వీసులు నడపనున్న ఇండిగో ఎయిర్‌లైన్స్, హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Arun Charagonda

హైదరాబాద్ నుంచి మూడు కొత్త విమాన స‌ర్వీసులు నడపనుంది ఇండిగో ఎయిర్‌లైన్స్. అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్‌ల‌తో స‌హా 7 రూట్లలో విమానాలు న‌డ‌ప‌నుంది ఇండిగో ఎయిర్‌లైన్స్‌.

Tirupati Laddu Row: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి కనిపించడం లేదు, పోస్టర్లు రిలీజ్ చేసిన బీజేపీ నేత, ఆచూకీ తెలిపిన వారికి బహుమతి అంటూ ప్రకటన

Arun Charagonda

తిరుమల లడ్డూ వ్యవహారంలో టీటీడీ మాజీ EO ధర్మా రెడ్డి కనబడుట లేదని పోస్టర్లు వెలిశాయి. బీజేపీ నేత నవీన్ రెడ్డి...ధర్మారెడ్డి కనిపించడం లేదని ఆయన ఆచూకీ తెలిపిన వారికి రూ.1116/- బహుమతి ఇస్తానని ప్రకటించారు. తిరుమల లడ్డూ వివాదంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే.. జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి మాత్రం తేలు కుట్టిన దొంగల్లా దాక్కున్నారని తెలిపారు బీజేపీ నేత.

Pravasi Prajavani In Hyderabad: ఎన్నారైల కోసం ప్రవాసీ ప్రజావాణి, ప్రతి మంగళ- శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి జరుగుతుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్

Arun Charagonda

సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు ఇవాళ ప్రత్యేక ప్రవాసీ ప్రజావాణి సెల్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌. గల్ఫ్‌కి వెళ్ళిన కార్మికులు చెయ్యని తప్పుల‌కు ఇబ్బంది పడుతున్నారు అని...హుస్నాబాద్ నియోజకవర్గంలో జాబ్‌మేళా నిర్వ‌హిస్తే 9 వేల మంది వ‌చ్చారు అన్నారు.

Advertisement

Tirupati Laddu Row: మనకేం కావాలి...భావోద్వేగాలను రెచ్చగొట్టి .. రాజకీయ లబ్ధిని సాధించటమా..? ఎక్స్ వేదికగా ప్రశ్నించిన ప్రకాశ్ రాజ్, సున్నితంగా సమస్యను పరిష్కరించుకోలేమా అని పోస్ట్

Arun Charagonda

తిరుపతి లడ్డూ వ్యవహారంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వరుస ట్వీట్‌లు చేస్తూనే ఉన్నారు. లడ్డూ వ్యవహారంపై తాను చేసిన ట్వీట్‌ను పవన్ కళ్యాణ్ అపార్థం చేసుకున్నారని ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని వచ్చాక రిప్లై ఇస్తానని చెప్పిన ప్రకాశ్‌ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ వరుస ట్వీట్లతో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Reliance Foundation Donation: తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం, రూ.20 కోట్లు సీఎం రేవంత్‌ రెడ్డికి అందజేసిన రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు

Arun Charagonda

ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం అందించింది. సీఎం సహాయనిధికి రూ.20 కోట్లు విరాళం అందజేశారు రిలయన్స్ ఫౌండేషన్. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నీతా అంబానీ తరపున చెక్ ను అందజేశారు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు.

Jagan Tirumala Visit Update: జగన్ తిరుమల పర్యటన, వైసీపీ నేతలు హౌస్ అరెస్ట్, తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 అమల్లోకి, ఐదేళ్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నేతను అడ్డుకుంటారా అంటూ భూమన ఆగ్రహం

Hazarath Reddy

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల‌ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌ జరిగింది. తిరుపతికి ఎవరూ రావద్దంటూ వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు

Tirupati Laddu Row: తిరుమల లడ్డూ వివాదం.. సిట్ ఏర్పాటుపై జీవో విడుదల, సిట్‌కు సహకరించాలని హోంశాఖ-దేవాదాయ శాఖ-టీటీడీ ఈవోకు ఆదేశాలు

Arun Charagonda

ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో సిట్ ఏర్పాటు పై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సిట్ సభ్యులుగా గోపీనాథ్ శెట్టి,హర్షవర్ధన్రాజు, వెంకట్రావు, సీతారామరాజు, శివ నారాయణ స్వామి, సత్యనారాయణ, సూర్య నారాయణ, ఉమామహేశ్వర్లును నియమించింది.

Advertisement

Parliamentary Standing Committee: పార్లమెంటరీ కమిటీల్లో వైసీపీ ఎంపీలకు చోటు, రవాణా టూరిజం సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి

Hazarath Reddy

ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వైవీ. సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి.. విదేశాంగ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి, రవాణా టూరిజం సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డిలకు చోటు దక్కింది.

Road Accident At Narsapur: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఢీ కొన్న రెండు బస్సులు, డ్రైవర్ మృతి..కాలేజీ విద్యార్థులకు తప్పిన ప్రమాదం..వీడియో

Arun Charagonda

మెదక్ నర్సాపూర్ పట్టణంలోని ఆనంద్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బి.వి.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు రెండు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా వస్తూ ఢీ కొనగా ఒక డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా ఒక డ్రైవర్ మృతి చెందారు. బస్సులో ఉన్న కాలేజీ విద్యార్థులకు ప్రమాదం తప్పింది.

Road Accident: జర్నీ సినిమాను తలపించేలా యాక్సిడెంట్.. మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్ఐటీ కాలేజీ బస్సులకు ప్రమాదం.. డ్రైవర్ మృతి.. పలువురు విద్యార్థులకు గాయాలు

Rudra

జర్నీ సినిమా క్లైమాక్స్ లో వచ్చే యాక్సిడెంట్ సీక్వెన్స్ ను తలపించేలా రెండు కాలేజీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని నర్సాపూర్ వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

Telangana Shocker: మహబూబాబాద్‌లో దారుణం, మంత్రాలు చేస్తున్నాడనే నేపంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన మరో వ్యక్తి..వీడియో ఇదిగో

Arun Charagonda

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో మల్లం యాకయ్య(66) అనే వ్యక్తిని చెట్టుకు కట్టేసి రాజు అనే యువకుడు దారుణంగా కొట్టి చంపాడు. స్థానికులు వెంటనే రాజును తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

Tirupati Laddu Row- Ram Mandir's Big Move: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో అయోధ్య రామ మందిరం కీలక నిర్ణయం.. బయటి సంస్థలు తయారుచేసిన ప్రసాదాలపై ఆలయంలో నిషేధం

Rudra

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామ మందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Notices To YCP Leaders: తిరుమలకు వైఎస్ జగన్, వైసీపీ నాయకులకు పోలీస్ నోటీసులు, అవాంఛనీయ సంఘటనలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరిక

Arun Charagonda

తిరుమలలో వైయస్ జగన్ పర్యటన సందర్బంగా క‌డ‌ప జిల్లా నేతలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు నోటీసులు జారీ చేశారు పోలీసులు.

Dasara Navaratri Celebrations in Vijayawada: బెజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. అక్టోబర్‌ 3న ఘట స్థాపనతో ఉత్సవాలు షురూ.. అమ్మవారు ఏ రోజున ఎలా దర్శనం ఇస్తారంటే?

Rudra

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు బెజవాడలోని ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

MLA Balu Naik: కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్‌కు నిరసన సెగ, బాలు నాయక్‌ని అడ్డుకున్న కుర్మెడ్ గ్రామస్తులు..తమ గ్రామంలోకి రావొద్దని నిరసన..వీడియో ఇదిగో

Arun Charagonda

నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్‌ను తమ గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు గ్రామస్తులు. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం కుర్మెడ్ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే బాలు నాయక్‌ని అడ్డుకున్నారు గ్రామస్తులు. తమ గ్రామంలో రావద్దు అంటూ నిరసన తెలియజేశారు గ్రామస్తులు.

Advertisement
Advertisement